పరుగులు పరుగులు…


పరుగులు పరుగులు…
పరుగులు, పరుగులు,
నేటి కాలంలో బతకడానికి కాలంతో పరుగులు,
శరీరం కాదు, మనసు అలిసిపోయే పరుగులు,
సుతిమెత్తని మనసు బండబారిపోయే పరుగులు,
హృదయ స్పందనలకు స్పందిచలేని పరుగులు,
ఆలోచనల ప్రవాహానికి ఆనకట్ట వేసే పరుగులు,
కోరికలకు కల్లాలు లేక, ఆశల వెనుక పరుగులు,
 
ప్రవాహానికి ఎదురీద లేక,
ఎదురీత తెలిసినా,
ఎదురీదే సాహసం లేక,
ఎదురీదితే వెనుక పడిపోతామేమోనన్న భయంతో,
ప్రవాహంలో కొట్టుకుపోవడానికి పరుగులు.
 
గుండె గూటిలో దాగిన అలసటను లెక్కచెయ్యకుండా సాగుతున్న పరుగులు,
మనసు లోతుల్లో దాక్కున్న ప్రేమను బయటకు తీసే తీరిక లేని పరుగులు,
గుప్పెడంత గుండెలో కొండంత గుబులును కప్పిపెట్టి  సాగుతున్న పరుగులు,
మనసారా ఏడిచి, గుండె బరువును తగ్గించుకునే తీరిక లేని పరుగులు.
 
మాతృత్వం నుంచీ పరుగులు, కొలువులు చేరటానికి,
మనసు మాట పెడచెవిన పెట్టి, బతకడానికి పరుగులు,
కాంతి వేగంతో కాలంతో పరుగులు పెట్టినా,
గడియారం ముల్లును మాత్రం అందుకోలేము.
 
“ఈ రోజు ఉదయం కొలువు చేరాలన్న తొందరలో, నా చిన్ని తండ్రి తాగమని ఇచ్చిన పాలు పారబోసాడని తిట్టాను. కొలువుకు చేరిన తర్వాత ఏడుస్తున్న ఆ చిన్ని కళ్ళు నా కళ్ళలో తిరుగుతున్నాయి. ఆ బాధలో పరుగులు పెట్టిన నా పదాలు…….”
This entry was posted in అమ్మ, కవితలు, కష్టం, జీవితం. Bookmark the permalink.

4 Responses to పరుగులు పరుగులు…

  1. krishnapriya says:

    బాగుంది.. నిజంగా చాలా టచింగ్ గా రాసారు.

  2. కృష్ణ ప్రియ గారు: ధన్యవాదాలు. It’s more or less a working mother feelings. Especially mother of small kids.

  3. Hari Krishna Sistla says:

    However it is compulsory for a common man to run along with Time otherwise we get backlogged,I am made to feel.

  4. praveen says:

    simply superb praveena garu.

Leave a comment