నాకోసం అట్టేపెట్టేయ్యవూ


నాకోసం అట్టేపెట్టేయ్యవూ

 10629746_10202625016488563_2699745010878008259_n

రెండంటే రెండే మాటలు

గుప్పెడంటే గుప్పెడు నీ నవ్వులు

అంతో ఇంతో చిలిపితనం

కాస్తంత అమాయకత్వం

కూసంత పసితనం

నాకోసం అట్టేపెట్టేయ్యవూ….

ఎప్పుడోకప్పుడు

గుప్పిళ్ళ  నిండా పూలను ఏరి

దారాలను పెనవేస్తూ మాలలు అల్లి

నీ సన్నిధికి పరిగెత్తుకుంటూ రాకపోతానా చెప్పు!

తీరా వచ్చాక

నాదగ్గరేం  మిగలలేదంటే

నేను చిన్నబుచ్చుకోనూ!


వర్షపు చినుకులను

పూల పరిమళాలను

కోనేటి మెట్లను

కాకి ఎంగిలిని

రామచిలుక రంగులను

కొబ్బరాకుల బొమ్మల పెళ్ళిళ్ళను

నెమళీక జ్ఞాపకాలను

కాగితపు పడవ మడతలలో

నాకోసం దాచేయ్యవూ….

అలసినప్పుడో

మనసు చిన్నబోయినప్పుడో

బుంగమూతితో నీ దగ్గరకు రాకపోతానా చెప్పు!

తీరా వచ్చాక

తాయిలాలేం లేవు నా దగ్గరని నువ్వంటే

చెమ్మగిల్లే నా కళ్ళలో ఉబికేవి నీలాలు కాదు

కన్నీరే

This entry was posted in కవితలు, జీవితం, Uncategorized. Bookmark the permalink.

3 Responses to నాకోసం అట్టేపెట్టేయ్యవూ

  1. అవినేని భాస్కర్ says:

    బాగుంది!

  2. ఇంతకంటే ఏమి చెప్పగలరు ఎవరయినా ? భావుకత బాగుంది. ధనవాదములు .

Leave a comment