Shopping Mall -1
“How to Train Your Dragon 2”, సినిమాకి వెళదామని బుడంకాయలు డిసైడ్ చేసేసారు.
“డ్రాగన్ 1 చూసాం కదా, ఆ వింత జంతువులు…It’s so boring. Mr. Peabody & Sherman టైపు సినిమాల ఏదన్నా ఉంటే వెళ్దాం. కుక్కలు, పిల్లులు, ఉడతలు, పోనీ పులులు సింహాలు అయినా పర్లేదు. డ్రాగన్లు, డైనాసోర్స్ నా వాళ్ళ కాదురా బాబు,” మొరపెట్టుకున్నా.
“ఓ పని చేద్దాం, మేము ముగ్గురం సినిమాకు వెళ్తాం. నువ్వు షాపింగ్ చేసుకో,” ఇంటాయన మధ్యే మార్గం.
పిల్లలతో షాపింగ్ కు వెళ్ళటం అంత బుర్ర లేని పని ఇంకోటుండదు. ఒకడేమో స్పూన్ తో బుర్ర తినేస్తాడు, ఇంకో బుడంకాయేమో ఏమూలన్నా ఓపిక మిగిలితే స్ట్రా వేసుకుని అది పిల్చేస్తాడు. ఇదేదో బాగుందే అనుకుని బయల్దేరాం.
“నువ్వు షాపింగ్ చేద్దామనేమా!”, నా బాగ్ వైపు చూస్తూ అనుమానంగా అడిగితే, “ఎదో ఒకటి చేస్తాలే” అనేసా. I have my own plan here. Imagine, you get couple of hours’ time….
షాపింగ్ ఏముందిలే, కాసేపయ్యాక చేసుకోవొచ్చు, ఫస్ట్ ఫోటోలు తీసుకుందాం…..
విండో షాపింగ్ అనగా నేమి? గ్లాస్ అద్దాల్లో నుంచీ షాప్ లోని వస్తువులను కళ్ళతో స్కాన్ చేసేయ్యటం. హౌ ఫన్నీ!
విండో షాపింగ్ లా విండో క్లికింగ్ అన్నమాట 🙂
అక్కడో Persian ethnic shop భలే అందంగా ఉంటుంది. కొంచెం మొహమాటంగా, If you don’t mind may I click few photographs in your shop అని అడిగా. ఎంత మంచోడో ఆ షాప్ కీపర్, మాకేం అభ్యంతరం లేదన్నాడు.
అల్లాద్దీన్ అధ్బుత దీపాలు ఇక్కడ.
ఇంకొన్ని ఫోటోలు ఇంకో టపాలో….
Nice pics. అదే ఆశ్చర్య పడ్డా, మాల్లో, షాపుల్లో ఫొటోలు తీసుకోనిస్తారా అని!!
Narayana Swamy garu @ కొంచెం రిక్వస్టింగ్గా అడిగితె ఒప్పుకున్నారు. 🙂
nice pics praveena garu..which mall it is..?
Srujana@ Mirdif city center. Thank you 🙂
నమస్కారమండీ ప్రవీణ గారు . మొత్తానికి మీరు భలే . నాకెందుకో మీరు కొంచెం సేపు చిన్న పిల్ల అయిపోయార్నిపించింది .
ఫోటోలు బాగున్నాయి. పాపం బుడంకాయల సంగతి అందరికీ తెలిసినదే కదా. కాని షాపింగ్ అంటే అంత ఇష్టం ఎందుకో ఆడవారికి?
నమస్తే పార్థసారధి గారు. మనందర్లోనూ ఎంతో కొంత పసితనం ఉంటుంది, వీలైనప్పుడల్లా ఆ పాప/బాబును గారం చెయ్యాలి 🙂
రకరకాల రంగులు, కొత్త కొత్త డిజైన్లతో షాపింగ్ ఓ మజా.. ఎంతైనా స్త్రీలకు కళలేక్కువ. షాపింగ్ కూడా ఓ ఆర్ట్ అండి 🙂