Monthly Archives: January 2012

మనమిద్దరం సమాంతర రేఖలం


మనమిద్దరం సమాంతర రేఖలం ఆద్యంతాలను ముడివేస్తూ మనమిద్దరం రెండు సమాంతర రేఖల్లా భూమి ఆకాశం కలిసే అనంతాలకు పరుగులుతీస్తూ ఉంటాం….. నక్షత్రాల లెక్కలు తేలవు సముద్రాల లోతులు అందవు కీచులాడుకుంటూ..వాదులాడుకుంటూ అటువైపోసారి…ఇటువైపోసారి ఎగిరిపోతూంటాం…వదిగిపోతూంటాం చీకటి గుహలలో వెతుకులాడుతూ ఒకరినొకరు తడుముకుంటూ ఏవో గతాల లోతుల్లోకి జారిపోతూ ఒకరికొకరు ఆసరాగా ఎగబాకుతూంటాం.. నీ సిరా నీదే నా … Continue reading

Posted in కవితలు, కష్టం, జీవితం | 12 Comments

ముడి పడి …విడి పడి


ముడి పడి …విడి పడి  ఏదో ముడిపడుతున్న బావన అంతలోనే విడిపోతున్న వ్యధ ఎప్పటికైనా వదులయ్యేదేగా? తెలిసినా బదులేది? మనసుకు ఊరటేది? వాడిపోయే పువ్వులే మాలల అల్లిక మానగలమా? ఎగిరిపోయే పక్షే గూటిలో పొదుగుట ఆపగలమా? ఏ దారి ఎటు పోవునో బాటసారి పయనం ఆగునా? దారి పొడుగునా కుశల ప్రశ్నల పలకరింపులే మార్గమంతా ఒంటరి … Continue reading

Posted in కవితలు, కష్టం, జీవితం | 7 Comments

ప్రేమ ఇంకా ఉంది


ప్రేమ ఇంకా ఉంది నీ గుండె సడిలోను నా కంట తడిలోను నేస్తమా… ప్రేమ ఇంకా ఉంది! కరిగే కాలము  తధ్యమే మారుతున్న లోకము  విదితమే ధనం చుట్టూ పరిభ్రమిస్తున్న మనిషి నిజమే తనలో తాను వెతుకుతున్నది  ప్రేమేనన్నది సత్యమే….

Posted in కవితలు, కాలం, జీవితం | 7 Comments

మన సినిమా స్టంట్స్….


మన సినిమా స్టంట్స్…. ఒకరోజు కారిడార్లో నడుస్తూ వెళ్తుంటే, నా నెక్స్ట్ ఆఫీసులో వుండే అరబ్ కోలీగ్ నవ్వు వినిపించింది.  ఆయనకు  చాలా గట్టిగా నవ్వే అలవాటు. నా దారిన నేను  వెళ్ళిపోకుండా..ఆయన రూంలోకి తొంగి చూసి, ” మీరు నవ్వే విషయమేదో మాకు చెబితే మేము కూడా నవ్వుతాం కదా”, అంటూ కెలికాను. నన్ను చూసి ఆయన ఇంకా గట్టిగా నవ్వుతూ, “Oh, Praveena ..come..come , I should share this with you” , అన్నారు. నాకు curiosity  ఎక్కువైపోయి , ఈయనేదో భలే విషయం చెప్పెదట్టున్నారు అనుకుంటూ కుర్చీలో … Continue reading

Posted in నా అనుభవాలు, వ్యాసాలు | 18 Comments

అద్దం


అద్దం తిలకం దిద్దుకుందామని అద్దంలోకి తొంగిచూస్తే అందం ఎక్కిరించింది చివుక్కుమన్న మనసు మధిని తట్టిలేపింది…. నేను కనిపించగానే అమ్మ కళ్ళలో మెరిసే నా రూపం నన్ను చూడగానే బిడ్డ కళ్ళల్లో ఎగిసిపడే ఆనందం ఈ అద్దానికి ఏమి తెలుసు నా కళ్ళు ఎంత అందంగా ఉన్నాయో…. మొన్నీమధ్య థాంక్సండి అనగానే ఆటోవాలా పెదవులలో  దాచుకున్న కృతజ్ఞత రోడ్డు దాటించానని పెద్దాయన బోసినవ్వుతో చెప్పిన … Continue reading

Posted in కవితలు, కష్టం, మహిళ | 6 Comments