Monthly Archives: August 2011

గెలుపో? ఓటమో?


గెలుపో? ఓటమో?  ఎదలో ప్రశ్నల మీటలు, మధిలో సమాధానాల వెతుకులాటలు, ఎద, మధి సంవిధాన సమరంలో, గెలుపోటముల వ్యత్యాసం అతి స్వల్పం. ఆలోచనల సాయంతో, ఆశయాల మెట్లు , ఒక్కొక్కటి ఎక్కుతూ, తెలుసో తెలియకో, ఏ పాకుడు పట్టిన చోటో అడుగేసి, జర్రున జారి మళ్లీ చేరాను, మొదలు పెట్టిన చోటుకే ఎన్నోసార్లు. ఎగబాకే స్వభావం … Continue reading

Posted in కవితలు, జీవితం | 2 Comments

ఎవరిని తప్పుపడదాం?


ఎవరిని తప్పుపడదాం? ఆ తండ్రి, నెలరోజులుగా ఆస్పత్రి మంచంపై, చావుబతుకుల మధ్య ఊగిసలాడుతున్నారు, కూతుళ్ళు , కొడుకులు, దేశ విదేశాల నుంచి, ఆఘమేఘాలపై వచ్చి వాలారు. కన్నీరు ఒలికింది, కాలం కరిగింది, తిరుగు ప్రయాణం టిక్కెట్టు, రెపరెపలాడింది, ఇంకా ఆయుష్షు తీరని, తండ్రి ప్రాణంలా, ఉద్యోగ ధర్మం ఊగిసలాడింది, తల్లి కళ్ళలోని, ఆశా నిరాశల నడుమ … Continue reading

Posted in కవితలు, కష్టం | 10 Comments

వాళ్ళిద్దరూ మళ్లీ కలుసుకున్నారు


వాళ్ళిద్దరూ మళ్లీ కలుసుకున్నారు అహంకారపు కొండ, ఎక్కి ఎక్కి, ఇంక ఎక్కలేక, జర్రున జారాడు అతను….. సర్ధుబాటు మెట్లు, దిగి దిగి, ఇంక దిగలేక, చతికిలబడింది ఆమె… అక్కడ వాళ్ళిద్దరూ  మళ్లీ కలుసుకున్నారు….

Posted in కవితలు | 10 Comments

ఆ మాత్రం ఆస్వాదించలేమా జీవితాన్ని?


ఆ మాత్రం ఆస్వాదించలేమా జీవితాన్ని? గోరువెచ్చటి ఓ సూర్యకిరణం వెండి మబ్బులను చీల్చుకుని నేలను తాకింది శుభోదయమంటూ, సుదూరం నుంచి లీలగా వినిపిస్తుంది ఏదో పక్షి పలకరింపు “బాగున్నావా?”, అంటూ ఆప్యాయంగా, బాల్కనీలో పెట్టిన కుంపటిలోని గులాబి మొక్క మొగ్గేసింది ఆశకు చిగురులు తొడుగుతూ, ఇంట్లో అందం కోసం అమర్చిన ఎక్వేరియంలోని చేపలు గిరగిరా తిరుగుతున్నాయి … Continue reading

Posted in కవితలు, జీవితం | 6 Comments

జీవితం


జీవితం కాలం, సముద్రపుటొడ్డున ఇసుక రేణువులతో, గూడు కట్టి దారి చేసినా, పిడికిలిలో బిగించి విసిరేసినా, అలలలో కలిసిపోఏవే, జ్ఞాపకాలను మాత్రమే మిగులుస్తూ…….. జ్ఞాపకాలు, కరిగిపోని పులకరింతలు కొన్ని, కరుడుగట్టిన కన్నీటి గాధలు మరికొన్ని, కొన్ని మరికొన్ని అన్నీ, అనుభవాల శఖలాలే……. అనుభవాలు, పాఠాల సూక్తులలో, గునపాఠాల పోటులు, జీవన మార్గపు ఎత్తుపల్లాల, అధిరోహణ అవరోహణ, … Continue reading

Posted in కవితలు, జీవితం | 8 Comments

అర్హత


అర్హత కళ్ళెదుట కదలాడుతున్న నిన్ను చూస్తున్న ఈ క్షణం, నాలో ప్రేమ ఉప్పొంగి ఉరకలేస్తుంది, మరో క్షణం నీ అనర్హత, నా కళ్ళ ముందే  కఠినంగా తాండవిస్తోంది, ఈ రెండు క్షణాల మధ్య నేను పడే బాధ, నీకు అర్థంమయితే, ప్రియతమా, నీలో  ఏ అనర్హత నా ప్రేమను కించపరచదు……

Posted in కవితలు | 3 Comments

చిన్న సంఘటనే


చిన్న సంఘటనే అదొక చిన్న సంఘటనే, ఉబికి ఉబికి లావాలా ఉప్పొంగి, అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది, ఏమిటా అని అట్టడుగున అడుగేస్తే, ఏళ్ల తరబడి అణిచివేయబడ్డ అసంతృప్తి, తరాలుగా తల్లడిల్లుతున్న అసహాయత, విధి రాతతో రాయబడ్డ వివక్షతతో, విసిరివేయబడ్డ ఎన్నో సంఘటనలు, అడుగడుగుకి అడ్డుతగిలాయి….. అణగారిపోయిన ఆశ, నిరాశను రగిల్చి, ఆ చిన్న సంఘటన రూపంలో, … Continue reading

Posted in కవితలు, కష్టం, ప్రజాస్వామ్యం | 4 Comments

ఆ రాత్రికి మర్నాడు


ఆ రాత్రికి మర్నాడు ఆరాత్రి,నల్లటి మేఘం మనసంతా కమ్ముకుంది,హృదయానికి చిల్లులు పడినట్టు,బోరున కళ్ళు వర్షిస్తూనే ఉన్నాయి,ఆశలు కొట్టుకుపోయాయి,ఆలోచనలు విరిగిపడ్డాయి,ప్రళయం ముంచెత్తిన భావన ……ఆ మర్నాడు,గోరు వెచ్చటి సూరీడి కిరణాలు మనసుని తాకాయి,హృదయం నిర్మలంగా ఉంది ఆకాశంలా,కడిగిన ముత్యంలా మెరిసిపోతోంది లోకమంతా,చిగురాకు కొనన నిటి బిందువులా మెరుస్తోంది ఆశ,సప్తవర్ణాల ఇంద్రధనస్సును ఎక్కుపెట్టాయి ఆలోచనలు,ఆ రాత్రికి మర్నాడు,ప్రళయం కాదు … Continue reading

Posted in కవితలు, కష్టం | 5 Comments

సమాజం


సమాజం    సమాజమంటోంది, నేనో సాగర ప్రవాహమని,నేనన్నాను,నువ్వో దాహం తీర్చని ఉప్పటి ద్రవమని,నాకనిపించింది,ఓ పదునైన పాళీ తయారు చేసుకుని,సముద్రాన్ని కలంలో సిరాగా నింపి,కసితీరా రాసెయ్యాలని….సమాజం నోటితో నవ్వి,నొసటితో వెక్కిరించింది.“ఏంటని?” అడిగా,“ఏం రాస్తావేంటి?”, వ్యంగ్యం వుట్టిపడింది,“నీ గురించే రాస్తా…నీలోని మనుషుల గురించే రాస్తా”, పాళీ పదును పెడుతూ చెప్పా,“మనుషులు నాలోని లవణాలు కాదా?”, హృద్యంగా నిలదీసింది,హు…లవణ స్పటికలకు దాహమా?ఏ … Continue reading

Posted in కవితలు, ప్రజాస్వామ్యం | 1 Comment

కన్నీరు


కన్నీరు కనురెప్పల మాటున దాగని కన్నీరు, పరదా చాటు దాటితే, పరువు తక్కువంట??!! ఆనకట్ట కన్నీరు, ఎదలో ఎగిసిపడే అగ్గిశిఖలపై, చిలకరిస్తే చల్లారేనా ? కట్ట తెగిన కన్నీరు, చెంపలపై జారి, గుండెలో ఇంకిపోతే, మనసు భారం తగ్గేనా? ఘనీభవించిన కన్నీరు, నలుసై గుచ్చేది, కనులలోనా కలతలలోనా? మరుగుతున్న కన్నీటి సెగలో, కాలిపోతున్నది నువ్వా? నీ … Continue reading

Posted in కవితలు, కష్టం, జీవితం | 2 Comments

ఆమె


ఆమెవ్యక్తిత్వం నిలువెల్లా అలకరించుకుని,తనకేం కావాలో,దానికేం చెయ్యాలో,స్పష్టమైన ఆలోచనలతో,ప్రస్పుటమైన అభిప్రాయాలతో,ఆత్మగౌరవం పరిధిలో,నిర్మించుకున్న సామ్రాజ్యపు,సింహాసనం అధిరోహించేది ఆమె మాత్రమే. ఆమె రాజ్యంలో ఆమె అధికారాన్ని,అంగీకరించలేని అతిధిలు ప్రసాదించిన,పొగరు గర్వమనే బిరిదులు స్వీకరించి,అలా వచ్చిన వారిని ఇలా సాగనంపింది ఆమె. ఆమె సింహాసనంలో ఆమె స్థానాన్ని,తిరస్కరించిన వీరులు,“ఆడదేనా?!” అంటూ,అసహ్యాన్ని ప్రకటిస్తూ,ఆశ్చర్యాన్ని దాచేస్తూ,తమని చూసి తాము పడే సిగ్గును,పరుల కంటపడకుండా,పలాయనం చిత్తగిస్తున్న … Continue reading

Posted in కవితలు, నా ఆలోచనలు, మహిళ | 12 Comments