చందమామ కధలు


చందమామ కధలు 

వెన్నెల కురిసే  ఓ పౌర్ణమి రోజున హటాత్తుగా సిటీలో కరెంట్ పోతే ఎంత బాగుండు  కదా! (దోమల సంగతి కాసేపు పక్కన పెట్టేద్దురూ 🙂 )

DSC_0565ఆబాలగోపాలం తమ తమ పరుగులన్నీ పక్కన పెట్టి వెన్నెల్లో గంతులేస్తేనో!

DSC_0570దోసిళ్ళలో వెన్నెలను దాచుకోగలిగితేనో!

DSC_0573కొబ్బరాకుల చాటునో, కొమ్మల మాటునో దోబుచులాడుతున్న చందమామను దొరికేసావోచ్ అని పట్టుకోగలిగితేనో!

DSC_0574ఎర్రగా పండిన గోరింటాకు అరచేతులను వెన్నెల వెలుగుల్లో చూసుకుంటేనో!

DSC_0577పేదరాసి పెద్దమ్మ చెప్పిన చందమామ కధలు చెప్పుకుంటేనో!

DSC_0578 వీరి వీరి గుమ్మడి పండు వీరి పేరేమి ….. నేనే చందమామను, ఆకాశంలోనుంచీ నీ ఒళ్లోకి ఊడిపడ్డానని నెలరాజు అంటేనో!

DSC_0599ఎంత బాగుండు!!!

పొర్ణమి రాత్రి వెన్నెలను ఆస్వాదించటానికి ఊరు చివరకు లాంగ్ డ్రైవ్ వెళ్ళాలనే కోరికైతే తీరలేదు కానీ, ఈ వీకెండ్ పార్కుకు వెళ్ళినపుడు చెట్టు చాటునుంచీ చంద్రుడు ఇలా పలకరిస్తే కొన్ని ఫోటోలు తీసుకున్నాను.

 

 

This entry was posted in నా అనుభవాలు, Photography. Bookmark the permalink.

5 Responses to చందమామ కధలు

  1. Suresh Raavi says:

    పిక్స్ & వాఖ్యలు రెండూ అద్భుతంగా ఉన్నాయి

  2. kinghari010 says:

    దానంతటది పోకపోతే మనమే ఆర్పేయకూడదా?ఆరిపేయవే దీపమూ అని పాడుకోకూడదా!

  3. అప్పుడప్పుడయినా ఇలా అందంగా కాసేపు ఊహలలోకి తీసుకెళ్ళారు. ధన్యవాదములు. fb కంటే అప్పుడప్పుడు వచ్చే ఇలాంటి పోస్టు చాల అద్భుతంగ ఉంటున్నాయి. ధన్యవాదములు .

  4. ivspra says:

    Wonderful picture story.

Leave a comment