Monthly Archives: October 2011

ముసురు


ముసురు ఆ మూల ముసురు ఎప్పుడు కమ్ముకుందో ఎండిన ఈ నేల వదిలిన మట్టివాసన హృదయానికి తగిలేదాకా తెలీయనే లేదు… ఈ నేల ఇంతగా ఎప్పుడు ఎండిపోయిందో ఆ వాన నీళ్ళు దోసిట్లో పట్టి కళ్ళాపు జల్లే దాకా తెలీయనే లేదు… ఆ ముసురూ వదలనంటోంది ఈ దోసిలి నిండనంటోంది ఆ వాకిలి తడవనంటోంది….

Posted in కవితలు, కష్టం, జీవితం | 2 Comments

లెక్కల సంబంధం


లెక్కల సంబంధం ఆరుబయట మడత మంచాలలో పడుకుని వెన్నెల వెలుగులో లెక్కపెట్టిన నక్షత్రాల లెక్క తేలకుండానే బాల్యం వెళ్ళిపోయింది… బెండకాయ కూర తినటానికి లెక్కలు రావటానికి సంబంధం తెలీకుండానే చదువైపోయింది…. ఇప్పుడు తెలిసిందల్లా నోట్ల కట్టల లెక్కలతో సంబంధమే….

Posted in కవితలు, కష్టం, జీవితం | 2 Comments

నాన్న…నిండు ప్రేమ కుండ, తొణకడు.


నాన్న…నిండు ప్రేమ కుండ, తొణకడు ఆ నుదుటి మడతల్లో ఆ జారిన చెంపల్లో అరచెయ్యి బుగ్గన ఆనించుకుని నీ గురించి ఆలోచించిన క్షణాలు ఎన్నో… ఆ మసక బారిన కళ్ళలో నీ గురించి కన్న కలలు ఎన్నో… ఆ చెవిటి చెవుల్లో నీ విజయం వినాలని పడిన ఆరాటాలు ఎన్నో… ఆ వణుకుతున్న చేతుల్లో నువ్వు … Continue reading

Posted in కవితలు, నాన్న | 15 Comments

కానరాని నెలవంక


కానరాని నెలవంక కనురెప్పలు వాలే వేళ రాలిపడిన నక్షత్రాలు తళుక్కున మెరిసాయి నీలాకాశాన్నంతా వెతకటానికి…. నిద్రలోనూ కానరాని నెలవంక కాటుక కళ్ళ  చీకటిని రేయిగా తనలోకి లాక్కుంది….  

Posted in కవితలు, కష్టం | 3 Comments

సహనం


సహనం నీ అహంకారానికి తొలిమెట్టు నా సహనం.. నా సహనానికి మలిమెట్టు నీ పతనం…

Posted in కవితలు, మహిళ | 2 Comments

నువ్వు నేను


నువ్వు నేను నీ పెదవులపై దోబూచులాడే చిరునవ్వుకు చిరునామా నా తలంపులైనప్పుడు….ప్రియా నా శాశ్వత చిరునామా నీ హృదయమే… నా కళ్ళలో తళుక్కున మెరిసే మెరుపుకు కారణం నీ పలకరింపైనప్పుడు…ప్రియా… నీ ప్రేమ శాశ్వతం నా హృదయంలో….

Posted in కవితలు | 3 Comments

అక్షరాల సంకలనం


అక్షరాల సంకలనం అక్షరాలు మాట్లాడుతున్నాయి పదాలు బావాలు పలుకుతున్నాయి వాక్యాలు వ్యాకరణం పొందిక లేకున్నా జీవితపు నిగూఢ సత్యాలు తమలో దాచుకున్నాయి….

Posted in కవితలు | 1 Comment

అణువునే


అణువునే ఈ అనంత విశ్వంలో అణువునే…. ఆ అణువే నా అనంత ఆత్మీయ  ప్రపంచం……

Posted in కవితలు | 2 Comments

గూడు


గూడు గూడు కట్టుకున్న గుబులులో నుంచి ఆశలు ఎగిరిపోయాయి కొత్తగా వచ్చి చేరిన ఆలోచనలు గూటిని మరింత అందంగా తీర్చిదిద్దాయి….

Posted in కవితలు, కష్టం, జీవితం | 2 Comments

మనసు ఆకలి


మనసు ఆకలి రోజులు  గడుస్తూనే ఉంటాయి జీవితం సాగుతూనే ఉంటుంది అంతా సవ్యంగా ఉన్నట్టే ఉంటుంది అంతలోనే ఎక్కడో ఏదో రాగం శృతి తప్పినట్టు మరేదో గానం మూగబోయినట్టు ఏమూలో అసంతృప్తి సెగ రాచుకుని దావానలమై మనసంతా పరుచుకుంటుంది……. కానవస్తున్న గమ్యం కనికరం లేకుండా పరుగులు పెడుతున్నట్టు, నిచ్చెన చివరి మెట్టు చేరాక ఆ విజయం … Continue reading

Posted in కవితలు, కష్టం, జీవితం | 4 Comments

ఆ పెద్ద మనిషి


ఆ పెద్ద మనిషి ఆ పెద్ద మనిషి రచ్చబండపై ఆశీనుడై మొగుడు పెళ్ళాల పంచాయితీ తీర్చాడు పెళ్ళాన్ని ప్రేమగా చూసుకోమని మందలించి మొగుడుకి అణుకువగా నడుచుకోమని సూచించి ఇంటికి చేరాడు….. కాళ్ళకు అంటిన సంస్కారాన్ని నీళ్ళతో కడిగేసుకుని కండువా పెద్దరికాన్ని కొక్కానికి తగిలించి “ఒసేయ్ ఎక్కడ చచ్చావ్” ధర్మపత్నిని కేకేసాడు….

Posted in కవితలు, జీవితం, పెళ్లి, మనిషి, మహిళ | 10 Comments

ఓ వాన చినుకు


ఓ వాన చినుకు నింగి నుంచి ఓ వాన చినుకు వలపంతా ఒలకబోద్దామని వయ్యారంగా వచ్చిచేరింది…. అయ్యో రాత(?!) ఈ మనిషికి అంత కళాపోషణ కూడానా… ఉస్సురుమంటూ నేల జారిపోయింది…

Posted in కవితలు | 3 Comments

ఓ నలిగిన జ్ఞాపకం


ఓ నలిగిన జ్ఞాపకం జ్ఞాపకాల దొంతరలో నుంచి ఓ నలిగిన కాగితం అప్రయత్నంగా జారి పడింది…. వీలైనంత చదును చేసి చదువుదామంటే కన్నీళ్ళ కొలనులైన కళ్ళు మసగబారిపోయాయి….. ఒక చేత్తో కళ్ళు నలుపుకుంటూ మరో చేతి చూపుడు వేలుతో అలుక్కుపోయిన అక్షరాలు విడదీస్తుంటే చెమ్మగిల్లిన కాగితం మరి కాస్త చిరిగి మనసుని చిత్తడి చేసింది…

Posted in కవితలు, కష్టం | 3 Comments

నా బాల్యం, ఇంకా వేలాడుతూనే ఉంది…


నా బాల్యం, ఇంకా వేలాడుతూనే ఉంది… అమ్మ, చీర కుచ్చిళ్ళలో కొంగు అంచులో నా బాల్యం ఇంకా వేలాడుతూనే ఉంది… నాన్న, లెక్కలు చెపుతూ చరిచిన దెబ్బల్లో ప్రోగ్రెస్ కార్డు పై సంతకం పెడుతూ చూసిన చూపుల్లో నా బాల్యం ఇంకా వేలాడుతూనే ఉంది… చెల్లి, గిల్లికజ్జాల వాదనలో అలకల సాధింపులలో ఆడుకున్న ఆటలలో పంచుకున్న … Continue reading

Posted in అమ్మ, కవితలు | 6 Comments

ఏవేవో ఆలోచనలు


ఏవేవో ఆలోచనలు ఏవేవో ఆలోచనలు అల్లిబిల్లిగా అల్లేసుకుని పీటముడి పడిపోయాయి చిక్కులు విప్పుదామని చెయ్యి దూరిస్తే చల్లగా ఏదో తాకింది మనసు స్రవిస్తోన్న సిరా ఈ చిత్తు కాగితాన్ని అలికేసింది…..

Posted in కవితలు, నా ఆలోచనలు | 6 Comments

అతడు ఆమె —- ఆ బంధం


అతడు ఆమె —- ఆ బంధం అతను ప్రేమిస్తున్నానన్నాడు ఆమె అపనమ్మకంగా చూసింది నువ్వే ప్రాణం, నీతోనే జీవితమన్నాడు ఆమె మనసు కరిగి, ప్రేమ ఉప్పొంగింది బంధం ముడిపడింది….. చట్టాపట్టాలేసుకుని జీవితపు నావలో ఆనందపు తీరాలకు చేరాలని కలలు కంటూ సాగారు కొంత కాలం….     అలల ఆటుపోటులు కలలను కుదపటం మొదలుపెట్టాయి అతనిలో … Continue reading

Posted in కవితలు, కష్టం, జీవితం, పెళ్లి, మహిళ, సగటు ఆడపిల్ల | 18 Comments