Category Archives: కవితలు

ఎప్పటికప్పుడు నిన్ను


ఎప్పటికప్పుడు నిన్ను నాకు తెలిసిన మహా అద్భుతానివి నువ్వు ఏ క్షణంలో ఎలా ఆసీనమవుతావో మరుక్షణానికి ఎప్పుడు వీడ్కోలు చెపుతావో తెలీనట్టే ఉంటుంది నీ గమనం. నీ ఛాయలను తడిమితే చాలు జీవించిన కాలాలు కళ్ళలో మెదులుతూ తెరలుతెరలుగా రెపరెపలాడతాయి. అంచులలో నుంచీ జారిపోబోతున్న చుక్కలా నిలిచిన నిన్ను ఒడిసి పట్టుకోనూ లేను నిన్ను వదిలిపోనూ … Continue reading

Posted in కవితలు, కాలం, గుర్తింపు | 2 Comments

ఎక్కడో ఉంటావ్


ఎక్కడో  ఉంటావ్  ఎక్కడో  ఉంటావ్ ఆకృతులలోనో, అక్షరాలలోనో గాత్రంలోనో, గానంలోనో ఎక్కడో  ఉంటావ్! వర్ణాలలోనో, చిత్రాలలోనో నూలులోనో, అల్లికలోనో ఎక్కడో  ఉంటావ్! అందీఅందనట్టు కలలోనో తెలిసీతెలియనట్టు కలవరపాటులోనో ఉండీలేనట్టు ఉంటావ్! ఎక్కడ నుండో ఉండుండి జ్ఞాపకమై వస్తావ్ సెలయేరులా, గురుతులన్నీ ఉండచుట్టి  విసిరేసినట్టు వెళ్లిపోతావ్ జలపాతంలా. వెళ్తూ వెళ్తూ మరో ముద్రను వదిలిపోతావ్ భందించి భద్రపరుచుకోవటానికి … Continue reading

Posted in కవితలు, కష్టం, కాలం | Leave a comment

నాకోసం అట్టేపెట్టేయ్యవూ


నాకోసం అట్టేపెట్టేయ్యవూ   రెండంటే రెండే మాటలు గుప్పెడంటే గుప్పెడు నీ నవ్వులు అంతో ఇంతో చిలిపితనం కాస్తంత అమాయకత్వం కూసంత పసితనం నాకోసం అట్టేపెట్టేయ్యవూ…. ఎప్పుడోకప్పుడు గుప్పిళ్ళ  నిండా పూలను ఏరి దారాలను పెనవేస్తూ మాలలు అల్లి నీ సన్నిధికి పరిగెత్తుకుంటూ రాకపోతానా చెప్పు! తీరా వచ్చాక నాదగ్గరేం  మిగలలేదంటే నేను చిన్నబుచ్చుకోనూ! వర్షపు … Continue reading

Posted in కవితలు, జీవితం, Uncategorized | 3 Comments

నీ జ్ఞాపకాలే…….. నువ్వు కాదు


నీ జ్ఞాపకాలే…….. నువ్వు కాదు ఏ హడావుడి, మరే సందడి లేని నిశ్శబ్దంలో గాలి సవ్వడి, ఆకుల గలగలలు లేని సందర్భంలో నెలవంక బెదురుబెదురుగా అడుగులో అడుగులేస్తూ మేఘాల చాటు కెళ్తున్న తరుణంలో, చూరు నుంచీ జారిపోబోతున్న ఘడియ అక్కడే స్థంభింభించిపోయిన సమయంలో, ఆరు బయట నేనుకాక మరెవ్వరూ లేనట్టూ చుట్టూ ఉన్న మనుష్యులూ, పరిస్థితులూ ఉన్నఫళంగా ఉన్నవన్నీ … Continue reading

Posted in కవితలు, కష్టం, కాలం | 2 Comments

సువిసైడ్


సువిసైడ్    ఆ రెండు కన్నీటి చుక్కలు కనుకోనలలో వేళాడుతున్నాయి వాలే భుజం లేక…..   ఆ రెండు మాటలు నాలికను చిధిమేస్తూ గొంతుకలో నొక్కివెయ్యబడుతున్నాయి వినే మనసు లేక…..   ఆ విసుగు నిస్పృహై శూన్యంలోకి జారిపోతుంది ఆశకు ఆసరా లేక…..   ఆ తనువు తనను తాను శిక్షించుకుంటూ మరణాన్ని ప్రేమించి నిష్క్రమించింది … Continue reading

Posted in కవితలు, కష్టం, Uncategorized | 4 Comments

వింటాను


వింటాను నువ్వు ఏవేవో చెపుతూ ఉంటావు నీ మాటల ప్రవాహం సాగిన మేరా నేను నిన్ను వింటున్నాననుకుంటావు. నిజానికి నేను వినేది నీ మాటలను కాదు ఓ సంభాషణ ముగించి మరో సంఘటనకు మాటల రూపం ఇచ్చే వ్యవధిలో నువ్వు పడే యాతన ఓ సుదీర్ఘ నిశబ్దాన్ని నాకు వినిపిస్తుంది. కన్నీరు అడ్డొచ్చి వెక్కిళ్ళు మాటలను … Continue reading

Posted in కవితలు, కష్టం | 7 Comments

గాలి బుడగ


గాలి బుడగ తనలో తాను నిండుగా గాలిని నింపుకున్న బుడగహటాత్తుగా మన మధ్యలోనికి వచ్చిపడుతుంది. అనివార్యంగానో, అయోమయంగానో అత్యుత్సాహంగానో, ఆశతోనోనెత్తిన పెట్టుకుని ఊపిరితిత్తులు నొప్పెట్టేలా ఊపిరిని ఊది ఊది ఊరంత చేస్తాం. అక్కడో ఇక్కడో అది గాలిబుడగన్న వారి నెత్తిన గట్టిగా మొట్టుతాం. మేడలు కట్టే హడావుడిలో గాలి సంగతి ఆలోచించనే ఆలోచించం. అంతే హటాత్తుగా బుడగ భళ్ళున బద్దలవుతుంది. బెంబేలెత్తిపోతాం మోసపోయామని … Continue reading

Posted in కవితలు, ప్రజాస్వామ్యం | 2 Comments

తోడు


తోడు  నువ్వూ నేనూ రెండు విరుద్ద భావాలను వ్యక్తీకరిస్తున్నాం అనుకుంటున్నాం తరచి తరచి చూస్తే వాటి మూలం ఒకటే  నేస్తం! నువ్వన్నావు, కష్టాన్ని పంచుకునే తోడొకటి లేకపోవటమే పెద్ద లోటని నేనన్నాను, సంతోషాన్ని పంచుకోలేని తోడు ఒక తోడే కాదని హుటాహుటిన పెద్ద పెద్ద గ్రంధాలను మోసుకోచ్చావ్ నీ చూపుడు వేలితో ఆ నీతుల వెంట … Continue reading

Posted in కవితలు, కష్టం | 2 Comments

కాఫీ కప్పే!


కాఫీ కప్పే! సగం తాగిన కాఫీ కప్పును విసురుగా నెట్టేసాడతను టేబుల్ పై ఒలికిన చుక్కలపై ఒక్క చూపన్నా చూడకుండా తన షులో తన పాదాలను ఇరికించేసుకుని పెద్ద పెద్ద అడుగులు వేసుకుంటూ ఆఫీసుకు వెళ్ళిపోయాడు. భారాన్ని మోస్తూ ముడుచుక్కూర్చుంటే ఇళ్ళు సాగదని చీర కొంగుకో, చున్నీ అంచుకో మూటగట్టగలిగినంత మూటగట్టి నడుం బిగించిందామె. మూల … Continue reading

Posted in కవితలు, మహిళ | 11 Comments

ఆవిడ ఆమె


ఆవిడ  ఆమె సృష్టి భారమంతా ఆవిడే మోస్తుందని ఆవిడకు ఎవరు చెప్పారో? ఆవిడ ఎలా నమ్మిందో! త్యాగాల మూటను భుజానకెత్తుకుని భారంగా అడుగులు వేస్తుంది. చలాకీతనం తెలీనట్టే ఉంటాయి ఆవిడ పాదాలు. పుస్కరానికోనాడు ఆవిడ విశ్రాంతి కోరుకుంటుంది. చంద్రుడు చుక్కలు గాఢ నిద్రలోకి జారాక నిశ్శబ్దంగా కూర్చుంటుంది. అరిగిన కీళ్ళు  కళ్ళుక్కుమంటుంటాయి కుచ్చిళ్ళలోని గజ్జెలు గళ్ళుమంటుంటాయి … Continue reading

Posted in కవితలు, మహిళ, Uncategorized | 5 Comments

ఆసుపత్రి


ఆసుపత్రి వెతుక్కుంటునో లేక దారి తప్పో ఈ రోజు నేనో చోటుకు వెళ్లాను. నగరంలో ఓ ములకు విసిరేయ్యబడ్డ స్థలమది. పచ్చదనాన్ని పట్టించుకోకుండా అస్తవ్య స్థంగా పెరిగిన పచ్చికను దాటుకుంటూ ఊహామాత్రపు పరిచయమన్నా లేని ఆ నాలుగు గోడల నడుమకు  చేరాను.   అక్కడందరూ అదో తరహా మనుష్యులంట! మతి లేని వారో? స్తిమితం తప్పినవారో? … Continue reading

Posted in కవితలు, కష్టం | 1 Comment

నేననే ప్రశ్న


నేననే ప్రశ్న నేను అని ప్రశ్నించే వరకే నీ గొప్పైనా, ఎవరి గొప్పలైనా ఒక్కసారి ప్రశ్నించటం మొదలుపెట్టాక పొరలు వాటికవే విడిపోతూ వుంటాయి అస్తిత్వ పోరాటాల సామాజిక పరిధిలోనైనా నాలుగు గోడల హిపోక్రసీలోనైనా….. నీ దృష్టి కోణంలో నా చూపేందుకు ఇరుక్కోవాలి? నీ ధృక్పదంలో నా బతుకెందుకు బతకాలి? నా గొంతులోనికి చొచ్చుకు వచ్చిన మరో … Continue reading

Posted in కవితలు, మహిళ, సమాజంలో సామాన్యులు | 1 Comment

ఓ ఆడ కూతురా


ఓ ఆడ కూతురా  ఇప్పుడేదో హడావిడి చేస్తున్నారు ఉరేయ్యాలంట! ఎవరెవరిని ఉరేద్దాం? పురాణాల దగ్గర మొదలుపెట్టి యుగ యుగాలుగా లెక్కిస్తూ పొతే ఏనాటికి తేలేను ఈ సంఖ్య? ఈ లోపు ఇంకెన్ని కౌరవ సభలో! ఎందరి పడతుల కన్నీటి ప్రళయాలను తనలో కలిపేసుకుందో ఈ కాలం. సముద్రంలో జారిపడిన మరో కన్నీటి చుక్కవు నువ్వు…అంతే! * … Continue reading

Posted in కవితలు, కష్టం, మహిళ | 13 Comments

ఆకాశం


ఆకాశం  చిన్నప్పుడు, ఆకాశమంటే ఏంతో ఇష్టం! నీలం రంగును గుమ్మరించి పలుచగా పరిచి అక్కడక్కడా తెల్లటి మేఘాలను అలకరించినట్టు తలపించే పగళ్ళు….. చీకటి తెరకు జాబిలిని తగిలించి నక్షత్రాలను జల్లినట్టు వెన్నెలను కురిపించే రాత్రుళ్ళు…. ఓహ్…ఎన్నెన్ని ఊహలో….. ఇంద్రధనుస్సు రంగుల కధ తెలుసా? నోటుబుక్కులోని తెల్లకాగితానికి రంగులద్దాక వాటర్ కలర్ డబ్బాలో మిగిలిన నీటి చుక్కలను … Continue reading

Posted in కవితలు | 8 Comments

ఆ క్షణాలు


ఆ క్షణాలు అనుభూతి  కోసమే జీవించే ఆ క్షణాలను మనసు కెమేరాతో ఫోటోలుగా తీసి మధి  ఆల్బంలో భద్రంగా దాచేసుకోవాలి… అపుడో ఇప్పుడో మనసు భారమైన క్షణానో కన్నీరు ఉప్పొంగుతున్న  నిమిషానో దాచుకున్న ఆల్బం తెరచి ఫోటోలను మునివేళ్ళతో సుతారంగా స్పర్శిస్తే చాలు… జీవితం అందమైనదే, కాదన్నదెవరు? ఈ స్థితా లేక కాలమా? రెండు కరిగిపోయేవేలే… … Continue reading

Posted in కవితలు, కాలం, జీవితం | 4 Comments

నిదుర


నిదుర అలసట కనురెప్పల మాటుకి చేరినా కనులు మూతపడవే వింతగా! నిదుర దరిచేరదే నిర్ధయగా! నడిరేయి చిక్కటి చీకట్లలోనూ అరమోడ్పు కనులలో అదే అలజడి అవే తలంపులు అవే సుడులు మడులు అవే తంత్రాలు, తరుణోపాయాలు అవే పరిధిలు, ప్రణాళికలు అవే వృత్తాలు అంతే వ్యత్యాసాలు…. అమ్ముల పొదితో ఒడిలో ఒదిగి ఆదమరిచి నిదుర పోయేదేలా? … Continue reading

Posted in కవితలు, కష్టం, జీవితం | 4 Comments

వెన్నెలేది?


వెన్నెలేది? పౌర్ణమి రాత్రుళ్ళ లో జోగుతూ,  ఉలిక్కిపడుతూ జాము  గడుపుతున్న కనురెప్పలనడుగు  వెన్నెలేదని? నియాన్  లైట్ల వైపు అయోమయంగా చూస్తూ బెడ్ లాంప్  వెలుగులో చరిత్ర పుటలను తిరగేస్తూ నిఘంటువు వెతుకులాటలో రేయంతా గడిపేసే నేటి కనులలో  వెలుగేది? ఎంతటి  రసహీన జీవితం….. (సిటీలో పౌర్ణమి  రోజున కుడా వెన్నెలను  చూడలేము. స్ట్రీట్  లైట్స్ ముందు వెన్నెల బోసిపోతోంది .  సిటీలో … Continue reading

Posted in కవితలు, ప్రకృతి సృష్టి | 1 Comment

ఇలాగే ఉందాం


ఇలాగే ఉందాం ఈ లోకం ఇంతే నేనూ ఇంతే మంచినే చూస్తానో, చెడునే చూస్తానో అంతా నా దృష్టిలోనే ఉందంటాను. నీదంతా అమాయకత్వం అని నవ్వేస్తారు! కాదే!…. నేనేమి చూడాలనుకుంటున్నానో నాకు తెలుసంటే పాపం మంచితనమంటారు ఈ పాపం అలంకారమెందుకో??!! ఈ లోకమూ ఇంతే, అంతు చిక్కనంటుంది! నేనూ ఇంతే, అవగతం కానిదేముంది? అంతా ప్రేమమయమే … Continue reading

Posted in కవితలు, కష్టం | 3 Comments

స్థితి


స్థితి ఆనందమూ కాదు, విషాదమూ కాదు అదో స్థితి మాటలన్నీ మూటకట్టుకుని పారిపోతే ఎద మొత్తం  మౌనంలో ఒదిగిపోతే ఆ నిశ్శబ్దపు ఒడిలో ఏర్పడే  స్థితి…..స్తబ్దత! శూన్యత కాదు  స్తబ్దత! ఈ స్తబ్దతలో శ్వాసే ప్రశ్నలను సంధిస్తుంది.. సమాధానాల అన్వేషణలో మనసును తవ్వి పొరలను చీల్చుతూ హృదయాంతరాలకు చేరాక అక్కడ ఎన్నాళ్ళుగానో  నిక్షిప్తమైన మణులు వెలికి … Continue reading

Posted in కవితలు, కష్టం, జీవితం | 3 Comments

ప్రశ్నల్లో ప్రశ్న


ప్రశ్నల్లో ప్రశ్న? సామాజికమో, ఆర్థికమో బరువో, బాధ్యతో కాళ్ళు కడిగి అప్పగింతలు అప్పజెప్పి చీర సారేలతో సాగనంపి ఖాలీ అయిన చోటన గుండె బరువు దింపి ఊపిరి పీల్చుకున్నారు. * * * * * * “బాగున్నావామ్మా?” నాన్న ఏనాడు అడగనే అడగరు! ధైర్యంలేకో? వినే ఓపిక మరింక లేకో? “బాగున్నానని మాత్రమే చెప్పు … Continue reading

Posted in కవితలు, కష్టం, మహిళ | 9 Comments