Monthly Archives: May 2012

సమాధానం ఏది?


సమాధానం ఏది? తీరం చేరిన అలనడిగా నడి సముద్రపు విశేషాలేమని? తొలి పొద్దున సూరీడినడిగా గడిచిన రేయి సరసాలేమని? వీచే చిరుగాలినడిగా ఆతిధ్యమెవరిదని ? పారే సెలఏటినడిగా పరవళ్ళ పరవశమేమని? ఆకాశపు అంచునడిగా నీలం రంగేలనని? ధరణి కుచ్చిళ్ళనడిగా కడలి చెమ్మేలనని? ప్రకృతంతా ఏకమై “నీకింత ప్రేమేలనని” అడిగితే నా దగ్గర సమాధానమేది?  Inspired by … Continue reading

Posted in కవితలు, ప్రకృతి సృష్టి | 5 Comments

నడి వయసు


నడి వయసు ప్రౌడత్వం పెద్దరికాన్ని ఆపాదించుకుని తెల్లవెంట్రుకై పాపిటలో మెరిసింది. పెద్దరికం గాంభీరాన్ని తెచ్చిపెట్టుకుని నుదుటి మడతల్లో అనుభవమైనది. నిజానికి జీవితం ఎప్పుడో మొదలయినా జీవించటం ఇక్కడే ఆరంభమైంది ….. ఆశయం, ఆచరణల నడుమ నలిగే ఆలోచన నిన్న రేపటిల మధ్య వారధయింది ఇక్కడే… హక్కు, బాధ్యతల మధ్య బారం తెలిసోచ్చినది ఇక్కడే… కల, నిజం నడుమ … Continue reading

Posted in కవితలు, జీవితం | 6 Comments

నా కళ్ళజోడు క(గా)ధ …కొంత సొంత డబ్బా


నా కళ్ళజోడు క(గా)ధ …కొంత సొంత డబ్బా కాదేది కధకు అనర్హం అన్నట్టు నాకొక కళ్ళజోడు  క(గా)ధ ఉంది. నేనొక చిన్న సైజు కళ్ళద్దాలు మొహానికి తగిలించుకుంటాను.  నా కళ్ళజోడు వెనుక దాగున్న కొంత సెల్ఫ్ డబ్బా మోతనుకోండి ఈ టపా. నాకొక అరివీర భయంకర తెలివి తేటలు కలిగిన చెల్లి రత్నం ఉంది. నాకన్నా మూడేళ్ళు చిన్నది. నా జోడుకు … Continue reading

Posted in నా అనుభవాలు, వ్యాసాలు | 9 Comments

ఓ విజయం


ఓ విజయం ఓ విజయం రారమ్మని ముద్దు ముద్దుగా పిలిచింది. ఎగురుకుంటూ హుషారుగా పరుగెత్తాను. నన్నే చూస్తూ కవ్విస్తూ వెనువెనుకకు అడుగులు వేసింది….. బుంగమూతి పెట్టి దొంగ చూపులు చూస్తూ నేనూ అడుగులు వేసాను నవ్వుకుంటూ. అందలేదు..దోబూచులాడుతుంది… ఇక..ఉక్రోషం తన్నుకొస్తుంది వేగం పెంచాను అయినా అందదే దుఖం పొంగుకొచ్చింది పరుగాపలేదు.. ఓపిక తగ్గుతుంది నీరసం వస్తుంది … Continue reading

Posted in కవితలు, కష్టం | 4 Comments

సినిమాలు…పిల్లల పరిశీలన


సినిమాలు…పిల్లల పరిశీలన లత “ఎందుకో ఏమో”….పాట హమ్ చేస్తుంది. “అమ్మా, నువ్వు ఆ పాట పాడకూడదు”, అన్నాడు ఐదేళ్ళ బుజ్జిగాడు. లత ఆశ్చర్యంగా, “ఏ నేనెందుకు పాడకూడదు” అడిగింది. “నీకు తెలిదా? ఇది boys సాంగ్” అన్నాడు. “what ?? boys song , girls song అని ఉంటాఏంటి?”, కాస్త చిరాగ్గానే అడిగింది లత. … Continue reading

Posted in నా అనుభవాలు, వ్యాసాలు, సినిమాలు | 6 Comments