Shopping Mall -Part2
ఆ పర్షియన్ షాప్ అతనికి థాంక్స్ చెప్పి మళ్ళి దిక్కులు చూడటం మొదలుపెట్టా.
ఈ షాప్ లో కేవలం పిల్లోస్ మాత్రమే అమ్ముతారు. చాలా ఖరీదే, కానీ ఎంత కలర్ఫుల్ ఉన్నాయో చూసారా.
పచ్చని ఆకు ఎక్కడున్నా అందమే.
ఆ తర్వాత హోం సెంటర్, వీళ్ళ decorative pieces చాలా బాగుంటాయి.
హోం సెంటర్ లో ఆర్టిఫిసియల్ ఫ్లవర్స్,
ఇదొక పెద్ద టాయ్ షాప్. ఈ షాప్ ముందు నుంచీ వెళ్ళామా…పిల్లలు మనల్ని పీకి పాకం పెట్టేస్తారు. దానికి తోడూ, రకరకాల వేషాలతో పిల్లలను ఆకర్షించటానికి షాప్ ముందు వీళ్ళు. ముందు ఒకతనే ఉన్నాడు, నేను క్లిక్ చేస్తుంటే మంచి ఫోస్ ఇచ్చాడు. అతన్ని చూసి ఇంకొకతను, అతన్ని చూసి నన్ను తియ్యి ఫోటో అనుకుంటూ ఇంకొకతను, ఇంతలో సెక్యూరిటీ గార్డ్ వచ్చి నవ్వుతూ ఫోస్లు ఇచ్చారు. It was nice to capture their smiles.
Food court,
ఇండియన్ రెస్టారెంట్ ముందున్న ఏనుగు బొమ్మ,
borders బుక్ షాప్. ఎన్ని రకాలో, ఎన్నెన్ని పుస్తకాలో.
ఈ బుక్ షాప్ లో ఓ చక్కటి దృశ్యం: మిడిల్ ఏజ్ అతను అక్కడున్న సోఫాలో కుర్చుని స్టీవ్ జాబ్స్ బుక్ సీరియస్ గా చదివేసుకుంటున్నారు, కొడుకనుకుంట ఆయన ఒల్లో కూర్చుని ఇంకేదో బుక్ అంతే సీరియస్ గా చదివేస్తున్నాడు.
ఇలాంటి షాప్ లో కనీసం ఓ పావు వంతున్న తెలుగు పుస్తకాల కొట్టు మనూర్లో ఉంటే ఎంత బాగుండు!
If we have libraries and parks in every corner of the city then more than half of personal and societal psychological problems will never arise.
ఇంక షాపింగ్ చేద్దామని కెమెరా లోపల పెడుతుంటే, మా సినిమా అయిపోయింది, నువ్వేక్కడున్నావ్ అని ఫోన్. ఈ ఇంగ్లీష్ సినిమాలు టికెట్ డబ్బులకు కనీసపు న్యాయం చెయ్యనే చెయ్యవు. అదే మన హిందీ సినిమాలైతేనా టికెట్ డబ్బుకు మూడు, మూడున్నర గంటల సినిమా చూడొచ్చు. ఇంగ్లీష్ సినిమా నిడివి పెంచాలని డిమాండ్ చెయ్యాలంటే ఏమి చెయ్యాలో!
Promote your Website or Blog at http://forum.telugushortfilmz.com/
good show. Surprised the Borders is still alive there. It has been defunct in the US for a few years now.
Narayana Swamy garu, Borders is a huge chain of book stores here. Almost every good/big mall has Borders. Thank you.
ఇలాంటి షాప్ లో కనీసం ఓ పావు వంతున్న తెలుగు పుస్తకాల కొట్టు మనూర్లో ఉంటే ఎంత బాగుండు! కదా ! చాల పెద్ద ఆశ ప్రవీణ గారికి ?!?! ఇప్చ్ ఆ రోజులు ఇక రావు లెండి