Monthly Archives: November 2012

అక్వేరియం కధ


అక్వేరియం కధ నాకెప్పటి నుంచో ఓ బుజ్జి అక్వేరియం కొనుక్కోవాలనే  కోరిక ఎప్పటికప్పుడు postpone అవుతూనే ఉంది . ఇంకా లాభం లేదు, ఈ వీకెండ్ కొనాల్సిందే అని అల్టిమేటం జారీచేశా. “కొనటం సరే. ముందు క్లీనింగ్ సంగతి తేల్చు”, మిస్టర్ పతి పార్లమెంట్ ప్రశ్న వేసారు. హన్న …..ఎంత అనుమానం??!! (కాదులే…నమ్మకం..హి హి  హి ) … Continue reading

Posted in నా అనుభవాలు | 6 Comments

ఆ క్షణాలు


ఆ క్షణాలు అనుభూతి  కోసమే జీవించే ఆ క్షణాలను మనసు కెమేరాతో ఫోటోలుగా తీసి మధి  ఆల్బంలో భద్రంగా దాచేసుకోవాలి… అపుడో ఇప్పుడో మనసు భారమైన క్షణానో కన్నీరు ఉప్పొంగుతున్న  నిమిషానో దాచుకున్న ఆల్బం తెరచి ఫోటోలను మునివేళ్ళతో సుతారంగా స్పర్శిస్తే చాలు… జీవితం అందమైనదే, కాదన్నదెవరు? ఈ స్థితా లేక కాలమా? రెండు కరిగిపోయేవేలే… … Continue reading

Posted in కవితలు, కాలం, జీవితం | 4 Comments

పర్సనల్ స్పేస్ – (ఈ నెల చినుకు మాస పత్రికలో అచ్చయిన కధ)


పర్సనల్ స్పేస్ ఆగి ఆగి వీస్తున్న చల్లటి గాలి. గాలి వీస్తున్నప్పుడల్లా సన్నగా కురుస్తున్న వానజల్లు కారు  విండోలో నుంచి ముఖంపై పడుతుంది. వాతావరణం ఆహ్లాదంగా వున్నప్పుడు కారు విండో ఓపెన్ చేసి డ్రైవ్ చెయ్యటం నాకెంతో ఇష్టం. తృప్తిగా దీర్ఘ శ్వాస తీసుకున్నాను. చిరుగాలి నన్ను అభినందిస్తున్నట్టు, వాన చినుకులు నన్ను ఆకాశానికి ఎత్తేస్తున్నట్టు ఏవేవో … Continue reading

Posted in కధలు | 18 Comments

నిదుర


నిదుర అలసట కనురెప్పల మాటుకి చేరినా కనులు మూతపడవే వింతగా! నిదుర దరిచేరదే నిర్ధయగా! నడిరేయి చిక్కటి చీకట్లలోనూ అరమోడ్పు కనులలో అదే అలజడి అవే తలంపులు అవే సుడులు మడులు అవే తంత్రాలు, తరుణోపాయాలు అవే పరిధిలు, ప్రణాళికలు అవే వృత్తాలు అంతే వ్యత్యాసాలు…. అమ్ముల పొదితో ఒడిలో ఒదిగి ఆదమరిచి నిదుర పోయేదేలా? … Continue reading

Posted in కవితలు, కష్టం, జీవితం | 4 Comments

వెన్నెలేది?


వెన్నెలేది? పౌర్ణమి రాత్రుళ్ళ లో జోగుతూ,  ఉలిక్కిపడుతూ జాము  గడుపుతున్న కనురెప్పలనడుగు  వెన్నెలేదని? నియాన్  లైట్ల వైపు అయోమయంగా చూస్తూ బెడ్ లాంప్  వెలుగులో చరిత్ర పుటలను తిరగేస్తూ నిఘంటువు వెతుకులాటలో రేయంతా గడిపేసే నేటి కనులలో  వెలుగేది? ఎంతటి  రసహీన జీవితం….. (సిటీలో పౌర్ణమి  రోజున కుడా వెన్నెలను  చూడలేము. స్ట్రీట్  లైట్స్ ముందు వెన్నెల బోసిపోతోంది .  సిటీలో … Continue reading

Posted in కవితలు, ప్రకృతి సృష్టి | 1 Comment