Author Archives: ప్రవీణ

మార్పు వచ్చింది, మారాల్సింది ఇంకా ఎంతో ఉంది


మార్పు  వచ్చింది, మారాల్సింది ఇంకా ఎంతో ఉంది అనగనగనగా ఒక ఊరన్నమాట. ఆ ఊర్లో రామయ్య గారనే ఓ మోతుబరి. నాట్లు, కోతల దగ్గర నుంచీ కౌలులెక్కలు, కూలీ నాగాలు అన్నీ ఆయనకు కరతలామలకం. అంత సమర్థులు వారు. ఇంట్లో అందరికీ ఆయనంటే భయం. ఆయన వస్తుంటే పిల్లలు పుస్తకాలలో తలలు దూరుస్తారు. భార్య భయంతోనూ, … Continue reading

Posted in నా ఆలోచనలు, మహిళ, వ్యాసాలు | 2 Comments

సముద్రతో సంభాషణ


సముద్రంతో సంభాషణ సముద్రపు ఒడ్డున ఒద్దికగా చేతులు కట్టుకుని నుంచుని ఉన్నాను. “కవిత్వం పొంగుకు వస్తుందా,” వెనుకనుంచీ వస్తూ అంది  స్నేహితురాలు. ఒక మాటకు మరోమాటను  జతచేసి వాగే నేను ఆ నిమిషాన మౌనంగా ఉండిపోయాను, మొహమాటంగా నవ్వి ఊరుకున్నాను.  కవిత్వం కాదుకదా కనీసం  ఒక్క భావం కూడా మనసులో నుంచీ తన్నుకురాలేదు, ఒక్క పదం … Continue reading

Posted in Photography, Uncategorized | 5 Comments

ఒక్కో చినుకు ఒక్కో ముత్యం


ఒక్కో చినుకు ఒక్కో ముత్యం ఒక్కో చినుకు ఒక్కో ముత్యం, ఒక్కో ముత్యం ఒక్కో పద్యం…. ఆ రాత్రి ఏ జామునో మొదలయ్యింది వాన. ఉదయం నిద్ర లేచేసరికి లోగిలంతా నీళ్ళతో కడినట్టు మెరిసిపోతోంది. సన్నగా వర్షం నాకోసమే ఇంకా కురుస్తూనే ఉంది. కరెంటు తీగలపై ముత్యాల్లా మెరుస్తున్న చినుకులు.  రంగులెన్నున్నా నలుపుతెలుపులే  శాశ్వతం. జారిపోయే … Continue reading

Posted in నా అనుభవాలు, Photography, Uncategorized | 5 Comments

ఈ దోవ పొడవునా


ఈ దోవ పొడవునా  ఇదీ గమ్యం అనేది  ఒకటంటూ ఏదీ ఉండదు. అక్కడక్కడా  మజిలీలు ఉంటాయి అంతే. నిజానికి  మనకంటూ  ఉండేది  ప్రయాణం మాత్రమే. ఈ  దారి  పొడవునా సాగిపోవాల్సిన పయనం.  ఆస్వాదించాల్సింది జీవితమనే  ప్రయాణానినే. మనం వెతుక్కోవాలే కానీ ప్రతీ మలుపులోనూ ఓ అబ్బురం దాగుంటుంది. ఇంతేసి కళ్ళేసుకుని  చూసే  మనసే  ఉండాలే  కానీ … Continue reading

Posted in Photography | Tagged | 5 Comments

ఎప్పటికప్పుడు నిన్ను


ఎప్పటికప్పుడు నిన్ను నాకు తెలిసిన మహా అద్భుతానివి నువ్వు ఏ క్షణంలో ఎలా ఆసీనమవుతావో మరుక్షణానికి ఎప్పుడు వీడ్కోలు చెపుతావో తెలీనట్టే ఉంటుంది నీ గమనం. నీ ఛాయలను తడిమితే చాలు జీవించిన కాలాలు కళ్ళలో మెదులుతూ తెరలుతెరలుగా రెపరెపలాడతాయి. అంచులలో నుంచీ జారిపోబోతున్న చుక్కలా నిలిచిన నిన్ను ఒడిసి పట్టుకోనూ లేను నిన్ను వదిలిపోనూ … Continue reading

Posted in కవితలు, కాలం, గుర్తింపు | 2 Comments

ఎక్కడో ఉంటావ్


ఎక్కడో  ఉంటావ్  ఎక్కడో  ఉంటావ్ ఆకృతులలోనో, అక్షరాలలోనో గాత్రంలోనో, గానంలోనో ఎక్కడో  ఉంటావ్! వర్ణాలలోనో, చిత్రాలలోనో నూలులోనో, అల్లికలోనో ఎక్కడో  ఉంటావ్! అందీఅందనట్టు కలలోనో తెలిసీతెలియనట్టు కలవరపాటులోనో ఉండీలేనట్టు ఉంటావ్! ఎక్కడ నుండో ఉండుండి జ్ఞాపకమై వస్తావ్ సెలయేరులా, గురుతులన్నీ ఉండచుట్టి  విసిరేసినట్టు వెళ్లిపోతావ్ జలపాతంలా. వెళ్తూ వెళ్తూ మరో ముద్రను వదిలిపోతావ్ భందించి భద్రపరుచుకోవటానికి … Continue reading

Posted in కవితలు, కష్టం, కాలం | Leave a comment

మలిసంధ్య బృందావనాలు


మలిసంధ్య బృందావనాలు “కన్నమ్మా, రోజులుదగ్గర పడిపోతున్నాయిరా తల్లీ. ఈ లాదిని తొందరగా మర్చిపోతావు కదూ, ఎప్పుడూ నన్ను గుర్తు తెచ్చుకోకే! నా ఆయుష్షుకూడా పోసుకుని నూరేళ్ళు చల్లగా జీవించు.” మంచి నిద్రలో ఒత్తిగిలిపడుకున్న పాప లేత చెక్కిళ్ళను ముద్దాడాను.చిన్న కన్నీటి చుక్క నా కంటికొస నుంచి పాప నుదుటిపైకి జారింది వీడుకోలుకు సమాయత్తమవుతూ. రెండేళ్ళు ఎలా … Continue reading

Posted in కధలు | 1 Comment