Monthly Archives: September 2011

నీ జ్ఞాపకం


నీ జ్ఞాపకం నీ జ్ఞాపకం నా తలంపులలో ప్రాణం పోసుకుని శ్వాసలో మిళితమై గుండెలో ఒదిగి మనసంతా పరుచుకుని నా తనువులో ప్రాణమై నిలిచింది …

Posted in కవితలు | 6 Comments

ఆ నీటి చుక్క


ఆ నీటి చుక్క ఆ నీటి చుక్క జల జలా జారి దోసిట్లోకి చేరి కళ్ళలోకి చూసింది… ప్రతిబింభపు పరావర్తనం సుడులు తిరిగి వేల సముద్రాల ఉప్పటి నీరు వేల్ల సందులలో నుంచి వరదలై ఉప్పొంగి ఒడిని దాటి నేలకు జారాయి……

Posted in కవితలు, కష్టం | 1 Comment

రూపాయిబిళ్ళ


రూపాయిబిళ్ళ తారు రోడ్డున గుడికి వెళ్తుంటే రూపాయిబిళ్ళ దొరికింది నాది కాదని గుడి మెట్లపై కూర్చున్న బిక్షగాడి చేతిలో వేసి వాడి కళ్ళలోకి చూసా…. వెక్కిరుతున్న కళ్ళు తలదించుకున్న బిళ్ళ నా కంటపడి చిరిగిన జేబులో నా పిడికిలి బిగిసి వదులయ్యింది…

Posted in కవితలు, జీవితం | 1 Comment

అడుగులు


అడుగులు ఎక్కడి నుంచో లీలగా ఏదో శబ్దం నవ్వులా? ఏడుపులా ? అస్పుస్టంగా ఏదో దృశ్యం ఆలింగనాలా? తోపులాటలా? నాలుగడుగులు వేసా నలుగురు కూర్చొని నవ్వుకుంటున్నారు ఆనందమేసింది…. ఇంకా ఏదో వినిపిస్తోంది మరో పదడుగులు వేసా పాతిక మంది తన్నుకుంటున్నారు అరుపులు కేకలు…. ఇంకా ఏదో  హృదయ విదారకమైన  శబ్దం మరో పాతికడుగులు వేసా వందలమంది … Continue reading

Posted in కవితలు, కష్టం, ప్రజాస్వామ్యం, మనిషి | 2 Comments

వ్యధ


వ్యధ వ్యధ అగ్గి శిఖలై ఎగిసెగిసి పడుతుంటే గుమ్మరించిన కన్నీరు ఆవిరై కంట చేరి సెగపెట్టి ఎక్కిళ్ళు పెట్టిస్తోంది…. బాధ బరువై మోయలేని భారమై చేజారి ముక్కలై మనసుని గుచ్చి గుచ్చి బాధిస్తోంది… దుఃఖం దహించి దహించి శోకం శుష్కించి శుష్కించి కాలంలో అణువై పరమాణువై అంతరించిపోయింది….

Posted in కవితలు, కష్టం | 4 Comments

దేవుడు


 దేవుడు దేవుడు ఒక నమ్మకం మన చేతిలో లేనిదేదో మరేదో తెలియని శక్తి తన చేతుల్లోకి తీసుకుని సరైన దారిలో నడిపిస్తుందన్న ఒక విశ్వాసం… దేవుడు ఒక ఆశ అంతా మంచే జరుగుతుంది ఆపైవాడే చూసుకుంటాడు ఆ తెలియనివాడే ఆదుకుంటాడన్న ఒక మానసిక ఆసరా….. మతం దేవుడు కేంద్రంగా మనుష్యుల చుట్టూ అల్లిన కట్టుబాట్ల కంచె…

Posted in కవితలు | 2 Comments

నిశ్శబ్దం మాట్లాడింది


నిశ్శబ్దం మాట్లాడింది అ వేళ, సద్దు లేని పొద్దులో ఎద నిశ్శబ్దంలో ఓలలాడింది. సవ్వడి లేని ప్రశాంతంలో మనసు మధురిమలు పలికింది. ఆ వేళ, ధ్వని లేని ద్వారంలో మౌనం రారమ్మని పిలిచింది. సడి లేని సౌధంలో ఏకాంతం ఆతిధ్యమిచ్చింది. ఆ వేళ, కనురెప్పల రెపరెపలు ఊసులాడాయి ముంగురులు నుదుటిపై గుసగుసలాడాయి ఉచ్ఛ్వాస  నిచ్ఛ్వాసలు కబుర్లాడుకున్నాయి … Continue reading

Posted in కవితలు, జీవితం, మౌనం | 3 Comments

నాన్న ఎందుకిలా చేసావు? (Story)


నాన్న ఎందుకిలా చేసావు? నాన్నా….! నాన్న, నువ్వు  భౌతికంగా మమ్మల్ని వదిలి వెళ్ళిపోయి అప్పుడే  ఇరవై నాలుగు గంటలు గడిచిపోయాయి. అమ్మ గుండెలవిసేలా ఏడుస్తూనే ఉంది. పచ్చి మంచి నీళ్ళన్నా తాగకుండా, గొంతు చీల్చుకుపోయి మంట మండుతున్నా ఆపకుండా ఎక్కిళ్ళు పెడుతూనే ఉంది. అమ్మ కళ్ళల్లో భయం, దైన్యం, అసహాయత ఎప్పుడూ కనిపించినట్లే ఈరోజు కూడా … Continue reading

Posted in కధలు, గుర్తింపు | 12 Comments

ఆ కన్నీటి చుక్క


ఆ కన్నీటి చుక్క కనుకొనలలోని ఆ కన్నీటి చుక్క ఎద లోగిలిలో మంద్రంగా పరుచుకున్న వ్యధ తరంగాలను తాకుతూ ఎగిసెగిసి పడుతున్న ఆలోచనల ప్రవాహంలో కలిసి మనసు కోటలోని తులసి తీర్ధంలోకి జారింది.

Posted in కవితలు, కష్టం | 6 Comments

Working Mother


వర్కింగ్ మదర్ ఆ చిన్ని చేతులు నడుం చుట్టూ చుట్టేసి కాళ్ళకు అడ్డం పడుతుంటే బ్రతిమాలి, బామాలి విసుక్కుని, కసురుకుని నుదుటన ముద్దు పెట్టి బయలుదేరింది ఆఫీసుకు ఆ తల్లి… కీ బోర్డు ప్రెస్సులు mouse క్లిక్కుల నడుమ desktop పై నవ్వులు చిందిస్తున్న ఆ చిన్నారి కళ్ళను చూస్తున్న ఆ తల్లి మనసులో బెంగ … Continue reading

Posted in అమ్మ, కవితలు | 3 Comments