మా గురించి మీకు పూర్తిగా తెలుసా?
లోకమంతా మాలోనే,
మేమే లోకమంతా,
ప్రేమ, ద్వేషం,
కరుణ, కాటిన్యం,
సౌమ్యం, కఠినం,
సుఖం, కష్టం,
అమాయకత్యం, గడుసుతనం,
అన్నీ సమపాళ్ళలో కలబోసినా సృష్టి రహస్యం.
దైవం మనసు పెట్టి,
మెళుకువలు నేర్చి,
పదిలంగా తీర్చిదిద్దిన ప్రాణులము,
వనితలము, మహిళలము, స్త్రీలము.
పుత్రికలము,
ఈడపిల్లలము మేమే,
ఆడపిల్లలము మేమే.
ఆడపడుచులము,
అధికారము మాదే,
ఆదుకునేది మేమే.
అర్ధాంగులము,
అర్ధభాగము మాదే,
మరో భాగానికి అర్థం తెచ్చేది మేమే.
తల్లులము,
ప్రేమతో ముంచేత్తేది మేమే,
దండనలతో దారికి తెచ్చేదే మేమే.
మేము లేని సృష్టి అసంపూర్ణం,
మమ్ము గౌరవించని నాడు,
లయ తప్పే సృష్టి,
గతి తప్పక మానదు.
నాకు కొన్ని వింత ఆలోచనలు ఉంటాయి. అందులో ఇదొకటి. భగవంతుడు స్త్రీలను ఎంతో జాగ్రత్తగా, నిజానికి అతి శ్రద్ధగా సృష్టించాడు. అందుకే మేము చాల Sensitive గా ఉంటాము. పాపం దేవుడుకు ఆడవాళ్ళను సృష్టించేటప్పటికి అలిసిపోయి నిద్ర వచ్చేసింది. కానీ పని పూర్తి చెయ్యాలని, నిద్ర ఆపుకుని మొగవారిని సృష్టించాడు. మనం చదువుకునేటప్పుడు లంచ్ బ్రేక్ తర్వాతి క్లాసులో నిద్ర ఆపుకుంటూ నోట్స్ రాస్తే ఎలా ఉంటుంది. అలాగన్నమాట. అందుకే ఈ మొగవారికి ఆడవారిలోని sensitivity అర్థం కాదు. పాపం అందులో వాళ్ళ తప్పు ఏమిలేదు, మనమే అర్థం చేసుకుని సర్దుకుపోవాలి. సీరియస్ గా తీసుకోకండే…Please..
Related Post: నేటి మహిళ మనోగతం
అహా… అలాగా…!!
If God had created woman first, he was definitely working on a trial piece so that he could fare better when he comes to his master piece -`M`an. 😀
well said and written..
అబ్బ ఛా! 🙂
IM, good response!
meeranukonnatlu andaru adavallu antha sensitive kadu praveena garu..okkasari me alochanalonundi bayataku vachi chudadni..
నిజమే కదా.. అర్ధం చేసుకోరూ…
పెద్ద వాళ్ళ మాట:
మగాళ్ళని కేవలం అర్థం చేసుకోవాలట
ప్రేమించ కూడదట!
ఆడాళ్ళని కేవలం ప్రేమించాలట
అర్థం చేసుకోకూడదట!
రెండో బొమ్మ చాలా బాగుంది.
చదువరి గారు: నాక్కూడా భలే నచ్చింది ఆ బొమ్మ. అచ్చ తెలుగు అందమైన ఆడపడుచులా ఉంది. ఆ నవ్వు ఎంత బాగుందో. గూగుల్ లో దొరికింది. Thanks for responding.
అర్థమైతే అందల మెక్కించుకుంటారు కాని అర్థం కారుగా!
అర్థాంగులం , అర్థాంగులం అంటారు గాని,
అర్థం కానంత వరకూ అర్థ శతాబ్దమైనా
అర్థ-అంగుళం కూడా ముందుకు కదలలేరు!
Indian Minerva గారు, కొత్తపాళి గారు: అన్నన్నా..ఎంత మాట అన్నారు trial piece , master piece . పైగా కొత్తపాళి గారి సమర్ధింపు…ఉండండి..ఉండండి…మీ ఇద్దరి పని చెపుతా…మహిళా సంఘాలకు complain చేస్తా. అహహ…నా మీద complain చెయ్యటానికి మీకు సంఘాలు లేవుగా..భలే..భలే..భలే… అసలు సంగతి మీకు తెలిదు, actually god బ్రహ్మ is my friend. అందుకని నా చెవిలో ఈ రహస్యం చెప్పారు.Since he is a man he couldn’t tell to everyone, ego matters here. మరి ఆడవారి నోటిలో ఆవగింజన్న దాగదుగా.
Iam just kidding..సీరియస్ గా తీసుకోకండే.
గిరీష్ గారు: మీరు ఎంత మంచి వారో…నన్ను ఏమి అనలేదు. Thank you .
సరయు గారు: I agree with you. We ladies share our problems with others. We talk about it. But when it comes to men, they don’t s discuss their issues. It doesn’t mean that they don’t have problems. I feel both men and women has same amount of issues. As you said, not every lady is sensitive. There are cases where wife tortures her husband with her words. Mental torture is horrible than physical torture.
Thanks for sharing your opinion.
జ్యోతి గారు: సత్య గారు చెప్పారు చుడండి బ్రహ్మాండమైన మాట అర్థం చేసుకోవటం గురించి. ధన్యవాదాలు…
సత్య గారు: మీరు ఈ పెద్దవాళ్ళ మాటను ఎక్కడ విన్నారండి? ప్రేమించటం, అర్థం చేసుకోవటం…బాప్ రే…
“అర్థం కారుగా!అర్థ-అంగుళం”….అర్థం చేసుకోగలిగితే మనసులో ప్రతిష్టించుకుని పూజ చేసుకుంటాము కదా. శక్తి వంచన లేకుండా ప్రయత్నిస్తే అర్థం ఎందుకు కాదండి? వీళ్ళు అంతేలే..మనకెందుకులే అని అనుకుంటే , ముందుకు ఎలా కదలగలము? బాగున్నాయండి మీ కామెంట్స్….Thank you…
ఎంత బాగ చెప్పావు అక్కాయ్. ఆడ,మగల మేలికలయికలు(రెంటిలోనూ బెస్టు) వున్నారన్నమాట మరిచిపోకేం.
మాడా గారు: Thanks తమ్ముడు..రెండిటిలోనూ మంచి చెడు ఉంటేనే కదా సాగేది..మర్చిపోవటం అన్న ప్రశ్నే లేదు.
సరదాగ ఫ్రెండ్సంతా కూర్చొని కబుర్లాడుకుంటున్నట్లుంధి ఎనిహౌ సత్య గారి పెద్దవాళ్ళ మాట భావుంధి
రవి బాబు గారు: మీరు సరదాగా ఓ విసురు విసరండి..సత్య గారు జ్ఞానోధయం చేసారు.
మనసు నిలిపి మనసు నిర్మలంగా, నిమ్మళంగా వుండాలని కోరుకుంటాడేగానీ మదిని నిగ్రహించుట మిక్కిలి సాహసవంతమైన పని అని చెబుతాడు! తన సాధనాబలం చేత దాటిన జ్ఞాని మనసునిలిపి నిశ్చల స్థితిని పొంది భగవంతునిపై లగ్నమై ఉంటుంది. మనసు నిలిపి శరణాగతినే కోరుకుంటుంది ఆత్మ జ్ఞానం అనేది ఎంతటి అత్యున్నతి స్థితి సూక్ష్మచైతన్య సాధనల యొక్క అత్యున్నత లక్ష్యం ఆత్మ )సాక్షాత్కారం తన్ను వీడి తాను నిలుచు సూక్ష్మతత్త్వమే నిత్యం. తానని గ్రహించటం సూక్ష్మ తత్వం అంతటా వ్యాపించి ఉన్న సూక్ష్మ తత్వం ఆత్మా సాక్షాత్కారం .’ఉపదేశం అన్న మాటకు అర్థం ఆత్మలో ఉండడం లేక ఆత్మగా ఉండడం. అతీతమైన సూక్ష్మచైతన్య స్థితి ఒక క్షణంలోమనసు నిలిచి అమనస్కమైన ఉండాలి ఆత్మ సాక్షాత్కారం అని చెప్పారు.క్షణంలోగురువు ద్వారానే దర్శనం చేసుకోవాలి . ఉన్నది ఒకే ఆత్మ .. నేను, నీవు, ఈ బ్రహ్మ.. భవిష్యత్తులో ఆవిర్భవించనున్న వేమన ఇవన్నీ ఏకస్వరూపాలే.ఆత్మఏకస్వరూపా ము ఆత్మలో ఏ బేధం లేదని” అనుగ్రహించి తన నిజరూపంతో దర్శనమిచ్చి.. వారి అహంకారాన్ని మట్టికలిపినట్లు గురువు చెబుతున్నారు. జీవనముక్తి మార్గంలో సూక్ష్మసాధన ద్వారా “తత్వమసి” అనే సత్యాన్ని గ్రహించాలి. అనుభవించేవాడికి, అనుభవానికి భేదం లేదని సూక్ష్మసాధన ద్వారా తెలుస్తుంది. ఇలా బ్రహ్మ జ్ఞానాన్ని తెలిసికొన్నవారే జీవన్మిక్తులు, “అది” వున్నది. ఆత్మసూక్ష్మచైతన్య స్థితి దీనినే పరతత్వం, పరబ్రహ్మము అని కూడా అంటారు. అమరత్వము సాధించి పెట్టడం అనే విషయాన్ని మానవ జాతికి అందించడానికి గురువుద్వారా నూతన పరిణామము తీసుకొని వచ్చింది. మనసు నిలుపకున్న ముక్తి లేదయా చూపు నిలుపకున్న సుఖము లేదుబ్రహ్మ మనగ వేరె పరదేశమున లేడు బ్రహ్మ మనగ జూడు బట్ట బయలు, తనకు తానె బ్రహ్మ తారక మౌనయా గురువు మీద నమ్మకం ఉంటేనే జ్ఞానం లభిస్తుంది. చీకటిలో నడవడానికి దీపం మీద ఎంత నమ్మకంగా ఆధారపడతామో అదేవిధంగా మనలోని అజ్ఞానాన్ని తొలగించుకోవడానికి గురువు మీద అంతగా ఆధారపడాలి. మనం భ్రమతో చీకటిలోకి వెళ్తున్నాం. ఈ జీవితం అంతా మాయ. ఈ పుట్టుక, మరణం కూడా మాయనే. ఈ శరీరం వీడిన తరువాత ఏదీ మనవెంట రాదు. అన్నింటికి మనం దూరం అవుతాం. శరీరం నశించిన తరువాత అసలు మనము ఉండం. అందుకే నాది, నావి, నావారు అనే భ్రమలు వదులుకోవాలి. ఈ జీవన నాటక రంగంపై నటించాలి. నాటకంలో పాత్రధారి పూర్తిగా లీనం కానట్లే జీవితంలో కూడా మీరు పూర్తిగా లీనం కావద్దు. సంతానం కలుగకపోతే తాపత్రయం, కలిగితే తాపత్రయం. వారికి ఏదీ తక్కువైనా తాప త్రయం. వారి చదువులు, పెండ్లి, ఉద్యోగం, ఆరోగ్యం ఇలా అన్నింటి గురించి తాపత్రయమే. ఇవన్నీ వదులుకోవాలి.
సద్గురు సహాయము లేకుండా మనస్సును జయించగలవాడు యెవ్వడు ? మనస్సు ఆత్మతో విలీనమైతే మనిషి సాధించ లేనిదంటూ ఏమీ లేదు దైవమంటే ఏమిటి?మనం ప్రతిరోజు దేవుణ్ణి పూజిస్తాం. మనసు నిలకడకోసం ఒక విగ్రహాన్నో, చిత్రపటాన్నో ఎంచుకొని దేవుణ్ణి ప్రార్ధిస్తాం. గతంలో అవతరించిన అవతార పురుషులను, ప్రస్తుతం సజీవులైన మహాత్ములను, బాబాలను, స్వాములను, అమ్మలను మనం పూజిస్తున్నాం. ఐతే దైవమంటే ఏమిటి, ఎలా ఉంటాడు, ఎక్కడుంటాడు అనే ప్రశ్నలు ఉదయిస్తాయి. అసలు దేవుడనగా అకాశములోగాని, పాతాళములోగాని, పరలోకములోగాని, విగ్రహములోగాని, దేవాలయములోగాని, మరి ఏ ఇతర నిర్దేశిత ప్రదేశం లో గాని ప్రతిష్టించబడియున్న కూడిన అద్భుత శక్తి కాదు. సకల చరాచర జీవజగత్తులో నిండి, నిబిడీకృతమై వున్న అనంత అతీతమైన సూక్ష్మచైతన్య అసలైన దైవం.
మన తాతలు, తండ్రులు, దేవుని విగ్రహాలకు, చాయా చిత్రాలకు దండం పెట్టారు. మనమూ అదే బాటలో దండాలు పెడుతున్నాం. రాముడు, కృష్ణుడు, ఏసు ప్రభువు, మహమ్మద్ ప్రవక్త, గురునానక్, షిరిడీ సాయి మొదలగు వారిని దేవుండ్లంటున్నాం. వారిని పూజిస్తున్నాం, కీర్తిస్తున్నాం.
బాగా ఆలోచించి, విశ్లేషణ చేసుకుంటే మనం దేవుని పటానికి దండం పూజలను చేస్తున్నాం. మన మాయను ఛేదించుకోవాలంటే గురువును ఆశ్రయించాలి. అంటే గురువును ని పూజించాలి. మనం ఎవరినైతే గురువుగా ఎంచు కుంటామో వారి అనుగ్రహానికి పాత్రులు కావాలి. అప్పుడే భ్రమలు తొలగి ఆత్మనిత్య కైవల్యాన్ని అందుకుంటారు గురువు తెలుసు. అందుచేతనే వారు ఆత్మసత్యాలని చక్కటి ఉదాహరణల ద్వారా బోధించేవారు.గురుపాదపద్మాలను ఆశ్రయిస్తే పూర్వజన్మకృత పాపఫలం కూడా నశిస్తుంది. దీనివల్ల ఆదిఆత్మదైవతక మనస్సు,నిలిపి కనురెప్పపాట్లు బ్రహ్మజ్ఞానం కలుగుతుంది
గురువు పూజలోని అంత్రరార్థాన్ని తెలుసుకోకుండా, అదొక తంతువలె భావిస్తుంటారు.పూజను ప్రారంభించేటప్పుడు ముందుగా గురువుద్వారా భక్తునికి,మనస్సు,నిలిపి తానెవరో, తను ఇక్కడకు ఎందుకు వచ్చాడో , ఈ ప్రయాణం ఎక్కడికి పోతుందోనన్న విషయన్ని తెలుసుకుంటాడు.మనస్సును లీనం చేయడంమనసులోకి ఏ ఇతర భావనలు రాకుండా అరికట్టాడం అర్ఘ్యం. అమృతవృత్తియే స్నానం. రాగద్వేషాలకు అతీతంగా ఉండటం కర్మవాసనలకు దూరంగా ఉండటమే . మనసులో దోషాలేవీ లేకుండా మనస్సును అర్పించడమే పుష్పం. మనసులోనున్న చెడు ఆలోచనలను దూరంగా పోగొట్టు కోవడం వలన సాధ్యమవుతుంది. తనకు ఈ లోకంలో లభించినవన్నీగురువు లభించాయన్న ఉద్దేశ్యంతో నెవేద్యాన్ని మర్పిస్తుంటాం.నిశ్చలంగా మనసులో ఎటువంటి భావనలు లేకుండా ఉండటం ప్రదక్షిణం. ఆయనే నేనే అన్న భావాన్ని కలిగి ఉండటం నమస్కారం. అతీతమైన సూక్ష్మచైతన్య మౌనంగా ఉండటం అని చెప్పబడింది. బ్రహ్మపథంలో ఉన్న పరమాత్మను సేవించడమే ఈశ్వరసేవ అని చెప్పబడింది సూక్ష్మచైతన్యం ఓ సర్వాంతర్యామీ! నీవు నిరంతరం సర్వ ప్రాణూలలో నిండి ఉన్నావు. సమస్త ప్రాణులలో రాణంగా ఉన్నావు
ఈ ఆత్మ కు కులమతములు లేవు. స్త్రీ పురుష బేధంలేదు. చావుపుట్టుకలు లేవు. అదియే సజీవాత్మ. జాగ్రత్, స్వప్న, సుషుప్తి, తురీయ సూక్ష్మచైతన్య స్ధితి
rathanmsjcc garu: I agree with every single word in ur comment. Thanks a lot andi…konchem busy ga vunnanu, I will give u a detailed reply soon, kshamincha galaru…