టైం ఎందుకు ఉండదు?


టైం ఎందుకు ఉండదు?

“అస్సలు తీరట్లేదంటే నమ్మండి. చాలా బిజీగా ఉంటున్నాను”

“ఊపిరి పీల్చుకోవటానికి  కూడా టైం దొరకట్లేదు”

“లైఫ్ ఇస్ డామ్ హేక్టిక్”

కాలమానాలతో సంబంధం లేకుండా సంవత్సరం పొడుగునా ఇవే మాటలు పదే పదే  వల్లె వేసేవారికి ఓ ఉచిత సలహా….మీరు పనులన్నీ పక్కన పడేసి యుద్ధప్రాతిపదికన హిమాలయాలకు ప్రయాణం కట్టి, బ్రహ్మ విష్ణు శివ పార్వతి మొదలగు దేవతలు, దేవుళ్ళ దర్శనం కొరకు ఘోర తపస్సు ఆచరించి రోజుకు నూట పాతిక గంటలు ఉండేలా వరం పొంది, అందులో ఓ రెండు మూడు గంటలు ఉచిత సలహా నిమిత్తం నాకు ఇచ్చేయ్యాలని మనవి.  గమనించాలి, పనులన్నీ పక్కన పడేసి అన్నానే కానీ పనులు అవచేసుకుని అనలేదు!

నిజమే…జీవితంలో కొన్ని కొన్ని దశలలో చాలా బిజీగా ఉంటాం.

నిజంగా… జీవితమంతా అంత బిజీగా ఉంటామా?? జీవించటానికే తీరిక లేనంత పనులా మనకి?!

జీవితం ఎవరికీ వడ్డించిన విస్తరి కాదు. మనమే వండుకోవాలి, మనమే వడ్డించుకోవాలి. కనీసం ముద్దలు నోట్లో పెట్టుకునే తీరిక లేదు అనేవాళ్ళతోనే చిక్కు.

ఓ రెండుమూడేళ్ళు సాగే ప్రాజెక్ట్ లో పని చేస్తున్నాం అనుకుందాం. కొన్ని కొన్ని డెవలప్మెంట్  ఫేసుల్లో పని గంటల నిమిత్తం లేకుండా పని చెయ్యాల్సి వస్తుంది. అలాంటి పరిస్తితుల్లో తీరిక లేదు, బిజీ అంటే అందం సందం. అలాకాకుండా ఆ రెండు మూడేళ్ళు పగలు రాత్రి ఆఫీసు చూరు పట్టుకుని వేళాడుతున్నారంటే, అక్కడ ఏదో లోపం ఉందనుకోవాల్సిందే. మన పరిధి, మన ప్రయారిటిస్, మన division of time, మన division of work మనకి తెలీయోద్దూ?

ఒకావిడ…ఇళ్ళు అద్దంలా మెరిసిపోవాలనుకుంటుంది. ఆ పనిలో ఆవిడ ఆనందం పొందితే అంతకంటే కావల్సిందేముంది. ఆనందం కాకుండా ఆయాసం మాత్రమే ఆవిడ అనుభవిస్తుంటే ఏం ఉపయోగం?

మరొకాయన…భూప్రపంచంలో ఉద్యోగధర్మాన్ని ఈయన మాత్రమే సక్రమంగా నిర్వహిస్తున్నట్టు భుజాలు లాప్టాప్ బరువుతో వంగిపోయి ఉంటే ఏం సుఖం?

నాకు తెలిసిన  ఒక మహిళ, ఆవిడంత energetic person ని నేనూ ఇంతవరకూ చూడలేదు అనిపిస్తూ ఉంటుంది.  పదిమందికి సమాధానం చెప్పాల్సిన స్తితిలోనూ ఆవిడ మోహంలో విసుగుకానీ, చిరాకుకానీ, అలసట కానీ కనిపించవు. ఈ బిజీ బిజీ శాల్తీలు కొందరు, “ఆవిడ అన్ని పనులు ఎలా చేసుకుంటుంది. బహుశా ఇంట్లో ఏమీ పట్టించుకోదేమో. పిల్లలను సరిగ్గా పెంచటం ఆవిడకు ఎలా కుదురుతుంది”, ఇలా మాట్లాడుకుని తృప్తి పడేవారూ ఉంటారు.

ఒక్కోసారి సెకను ముళ్ళు వెనుక పరుగులు పెడుతూ ఉంటాం, కాదనట్లేదు. కానీ ఇరవైనాలుగ్గంటలూ ఆ సెకను ముళ్ళు వెనుక పరిగెడుతూనే ఉన్నాం అనే భ్రమలో నుంచీ బయటకు రాకపోతే సెల్ఫ్ సింపతీలోకి జారిపోయి పది నిమిషాల పనిని కూడా ఏకాగ్రతగా చెయ్యలేం.

“నీకు టైం ఎలా దొరుకుతుంది?”, అని నన్ను ఎవరన్నా మెచ్చుకుంటే, అందులో గొప్పేముంది అని ఇబ్బందిగానూ…

”నీకు చాలా టైం ఉన్నట్టుందే!”, ఎప్పుడైనా వినిపించే ఎగతాళి పట్ల జాలిగాను ఉంటుంది.

అసలు టైం ఎందుకు ఉండదు? అలా ఉండకుండా ఎలా ఉంటుంది?

నాకు నవలలు ఏకబిగిన చదవటం ఇష్టం. అలా చదివితేనే ఆ ఫీల్ ఉంటుంది. ప్రస్తుత పరిస్తితుల్లో ఓ రోజంతా పుస్తకానికి కేటాయించి స్తితిలో లేను, ఇప్పట్లో ఉండను కూడా.  రోజుకో రెండు పేజీలు, వారాంతంలో మరో నాలుగు పేజీలెక్కువ లెక్కన నెలో రెండునెల్లో సాగుతాయి నా నవలా పఠనాలు. ఈ సాగదీయటంలో ఫ్లో మిస్ అయిపోయి, సీక్వెన్స్ అర్థం కాక పక్కన పెట్టేసిన పుస్తకాలు ఎన్నో. ఎప్పుడోకప్పుడు చదవకపోతానా, చూద్దాం! అందుకే కధల పుస్తకాలకే పరిమితయ్యాను ఈ మధ్య.

“మీకు పుస్తకాలు చదివే తీరికా” , అని ఆశ్చర్యపోయే వారిని సీరియస్గా ఓ మొట్టికాయ వెయ్యాలనిపిస్తుంది నాకు. దమ్ము, జలసా, బలుపు, జులాయిలకు మూడు గంటల సమయం  ఆకాశంలో నుంచి ఊడిపడగాలేంది, పుస్తకానికి  ఓ అరగంట దొరకదా!? రాస్తే ఇంకో టాపిక్ అవుతుంది కానీ పనీపాట లేనోల్లే పుస్తకాలు (*అందులోనూ తెలుగు పుస్తకాలు) చదువుతారని అనేసుకోవటంలో  మన తెలుగోళ్ళు గొప్ప (తెచ్చిపెట్టుకున్న) ఆనందాన్ని  పొందుతారు.

నాకో లిస్టు అఫ్ కోరికలు (తీరనివి, తీర్చుకోవాల్సినవి) ఉంటాయి. అందులో ఫోటోగ్రఫీ కోర్స్ చెయ్యటం ఒకటి.

అబ్బబ్బే…కోర్సులు గీర్సులు ఏం అక్కర్లేదు, చేతిలో కెమెరా వుంటే చాలు, క్లిక్ క్లిక్ క్లిక్ మనిపించి సాగరసంగమం భంగిమ టైపులో ఫోటోగ్రఫీ నేర్చేసుకోవొచ్చు అని తృప్తి పడిపోయా.

ఇప్పుడు కొంత కెమెరా కబుర్లు  చెపుతాను. ఎందుకు చెపుతున్నానంటే, ఫోటోలు తియ్యాలంటే పొద్దస్తమానూ కెమెరా తగిలించుకుని తిరగక్కరలేదు, కుదిరినపుడు మోసుకుని పోతే చాలు, అంతోటి దానికి గంటల గంటల సమయం అవసరం లేదని చెప్పటానికి.   ఇందులో సొంత డబ్బా లేదని మీరు గమనించాలి, లేకపోతే నేను ఊరుకోను మరి 🙂

ఈ మధ్య కాస్త పని ఒత్తిడి (వస్తే అన్నీ ఒకేసారి వచ్చిపడతాయి. యమ కింకరుడిలాంటి బాస్, ఆపరేటింగ్ సిస్టం upgrade ఒకేసారి వచ్చిపడ్డాయి. పని చేస్తున్న కొన్ని సాఫ్ట్ వేర్లు మాకు వయసైపోయింది అని అటకేక్కేసాయి.  బతుకు గూగుల్ మయం అయిపొయింది), పిల్లల పరీక్షలతో  (బోడి చదివే రెండో తరగతికి ఇంత సీన్, మరి చెయ్యాలికదా, తప్పదు) కెమెరా అటకెక్కి, బాటరీ బావురుమన్నది.

సెకండ్ క్లాసు గ్రాడ్యుఏషన్ ఆనందంలో ఈ వీకెండ్ పార్కుకు వెళ్దాం అనుకున్నాం. మా ఊర్లో పార్కులు విశాలంగా పచ్చగా భలే బాగుంటాయి. మొత్తానికి కెమెరా దుమ్ము దులిపాను. Actually I was terribly missing it.

మా ఎడారి వెధర్ రిపోర్ట్ లో ఆ రోజు వర్షం, గాలులు వగైరా వగైరా అన్నారు. అయినా కూడా ఉదయాన్నే సూర్యుడు ఎంచక్కా వచ్చేసాడు. పనులన్నీ అయ్యాయనిపించి బయలుదేరేసరికి మబ్బులు బయలుదేరి అప్పుడో చినుకు అప్పుడో చినుకు మొదలుపెట్టాయి. అయ్యో అనుకునేలోపే వర్షమూ వెళ్ళిపోయింది. హమ్మయ్య బతికిపోయాం, లేకపోతే బుడుంగులు బుర్ర తినేసేవారు కాదూ. వెళ్తూ వెళ్తూ కెమెరా తీసుకుపోయా.

మరికొన్ని……

చెట్లూ పుట్టలు పక్షులు కనిపించటం పాపం, ఆ అందాలను కట్టిపడేయ్యాలి

అలా అప్పుడు ఇప్పుడు తీసిన మరికొన్ని ఫోటోలు,

ఈ కింద ఫోటోలు గమనించండి. అదే ప్లేస్ లో కొన్ని నిమిషాల తేడాతో తీసిన ఫోటోలలో ఎంత వైవిధ్యం, ఎంత అందం ఉందో గమనించారా.

జీవితం వైవిధ్య భరితం, ఏ రంగు అందం ఆ రంగుదే. ఒకే రంగులో ఇరుక్కుపోకుండా అన్ని రంగులను ఆహ్వానించాల్సిందే.

ఇప్పుడు మీరందరూ కళ్ళు మూసుకోవాలి, కళ్ళు మూసుకుని ఎలా చదువుతాం అనే లాజిక్కులు తీయకండి. I have a surprise for you ….now open your eyes…

మొన్న వెళ్ళిన పార్కులో పెద్ద చెట్టు, ఆ చెట్టు నిండా సీమ చింతకాయలు/సింతమ్మ కాయలు. నాకు వాటి రుచి నచ్చదు కానీ అవి చూడగానే టైం మెషిన్ ఎక్కేసి  చిన్నప్పటి వేసవి సెలవల్లోకి వేల్లోచ్చేసా 🙂

ఇలా వర్షం పడే సూచనలు కనిపించగానే ఇంటికి వెళ్ళిపోయాం. So all this pleasure can be grabbed in a day.

 Have some  pleasure in life.  Time is all yours, it’s you who needs to know to use it. ఉన్న సమయాన్ని ముక్కలు ముక్కలుగా విభజించేసి ఎదో ఓ ముక్కలో మనకు ఇష్టమైన వ్యాపకాలను సర్దేసుకోవాలి. Otherwise, life gets too dry. 

Moral of the story ఏమిటంటే  @ నిఖార్సైన బద్దకిస్టునన్నా బరించొచ్చు కానీ సర్వవేళసర్వావస్థలలోనూ పొద్దస్తమానూ బిజీ బిజీ అనే బిజీయిస్టులను తట్టుకోలేం.

ఈ మధ్య ఈ బిజీ గోల ఇద్దరిముగ్గురి దగ్గర విన్నాను.  నిన్న ఓ ఫ్రెండ్ ఫోన్ చేసి అదే మాట మాట్లాడితే వచ్చిన  విసుగు ఈ టపా అయిందన్నమాట. 🙂

This entry was posted in కాలం, జీవితం, నా అనుభవాలు, Photography, Uncategorized. Bookmark the permalink.

14 Responses to టైం ఎందుకు ఉండదు?

  1. What is the language you’ve written here. It’s such a beautiful text! Some nice photos too!

  2. Sateesh says:

    బాగుంది మీ ఆలోచన.. లోచనం కూడా!! nice camera work.

  3. H says:

    ఫొటోస్ చాలా బాగున్నాయండీ 🙂
    ఇక మోరల్ అఫ్ ది స్టొరీ కేకో కేక అన్నమాట 🙂

    ఒంటరిగా వుండాలనిపించినపుడు యమ బిజీ అని కలరింగ్ ఇస్తుంటాను… బిజీ అంటే జనాలు మనలను లైట్ తీసుకుంటారు… అదే ఒంటరిగా వుండాలని వుంది అని నిజం చెప్పామే అనుకో, ఆ సానుభూతి ఓదార్పులను భరించడం కష్టం.. :))

  4. Praveena .. What a beautiful post ! ఉన్న సమయాన్ని ముక్కలు ముక్కలుగా విభజించేసి ఎదో ఓ ముక్కలో మనకు ఇష్టమైన వ్యాపకాలను సర్దేసుకోవాలి. Idi inka sooperu !!! I follow the same philosophy , in utilizing each minute : ))

  5. Sreedhar says:

    Nice and good to read.

  6. ఫొటోలు ఛాఆఆఆలాఆఆఆ బాగున్నాయి, ఫొటోగ్రఫి మెంటరింగ్ చేయకూడదూ మీరు !

    • నాగార్జున గారు @ ఫోటోగ్రఫీలో అ ఆ లు కూడా రావండి. వ్యూ ఫైండర్లో చూసేసి సట్టర్ బటన్ నోక్కేయ్యటమే 🙂
      థాంక్యూ

  7. Excellent pictures. ఫోటోగ్రఫీ నేర్చుకోవాలని అనుకుంటున్న నేను మీ దగ్గర నేర్చుకోవలసిన పాటాలు చాలా ఉన్నాయి అని అర్థం అయ్యింది. మొదటి పాటం “ఆ పని ఈ పని అని రోజంగా బిజీగా ఉండకుండా కళా పోషణ(personal hobbies) కు కూడా సమయం కేటాయించాలి”

    ధన్య వాదములు.

    • గ్రీన్ స్టార్@ ఈ చిన్న విషయాలు నిజానికి మనందరికీ తెలిసినవే. వివిధ కారణాల వలన ఆచరించం. ఫోటోగ్రఫీ తప్పకుండా నేర్చుకోండి. All the best.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s