సమాధానం ఏది?
తీరం చేరిన అలనడిగా
నడి సముద్రపు విశేషాలేమని?
తొలి పొద్దున సూరీడినడిగా
గడిచిన రేయి సరసాలేమని?
వీచే చిరుగాలినడిగా
ఆతిధ్యమెవరిదని ?
పారే సెలఏటినడిగా
పరవళ్ళ పరవశమేమని?
ఆకాశపు అంచునడిగా
నీలం రంగేలనని?
ధరణి కుచ్చిళ్ళనడిగా
కడలి చెమ్మేలనని?
ప్రకృతంతా ఏకమై
“నీకింత ప్రేమేలనని” అడిగితే
నా దగ్గర సమాధానమేది?
Inspired by Jayati Reddy’s photo…
నిజమే…కదా!
Nijame kada..
prakruthi prema kaavalanukovadam;penchukovadam prakruthi sahajame kadaa!
Wonderful Thought.
chaala baagudhi …..jus beautiful wods,good day,god bless u……
hi madam… prakruthi gurinchi chala baga cheeparu…..