ఎవరు?
హృదయాంతరాలలో శూన్యతను పదే పదే గుర్తుచేస్తున్నదెవరు?
కనురెప్పల మాటున కన్నీటిని ఫ్రీజ్ చేయ్యమంటున్నదెవరు?
చిరునవ్వును పెదవులపై అతికించమంటున్నదెవరు?
ఉలిక్కిపాటు భద్రతను ఊహల్లో కల్పిస్తున్నదెవరు?
ఇంటిపక్కన ఇల్లెవరిదో తెలియని కమ్యూనిటీలు నిర్మిస్తున్నదెవరు?
బానిసత్వాన్ని బోధిస్తున్న విధ్యా విధానాలకు రచిస్తున్నదెవరు?
స్త్రీత్వానికి సుకుమారాన్ని అంటగడుతున్నదెవరు?
పురుషత్వానికి కఠినత్వం కొలబద్దచేస్తున్నదెవరు?
వేళ్ళసందుల్లో నుంచి జారిపోతున్న స్వేచ్ఛను గుప్పిట్లో నింపుతున్నదెవరు?
కిటికీలు మూసేసిన గది గోడలకానుకుని ఆలోచిస్తున్న మేధావులెవరు?
నగ్నత్వాన్ని చూడలేక కళ్ళు ముసుకుంటున్నదెవరు?
ఎవరు? ఎవరు?…..సమాధానాల కొరకు మరికరిని వెతకాలా?
మనలోని వారే ..!! “మనం” అన్న వారే..!!
హృదయార్ద్రత ని ఆవిరి చేసుకున్న వాల్లు
అంతరాల మధ్యలో శూన్యాన్ని నింపుతున్నారు …
కారుణ్యాన్ని మరచి కఠినమైన వారు
అంతరంగం లో కన్నీటిని దాచుతున్నారు…
మనలోని వారే ..!! “మనం” అన్న వారే..!!
సంఘటిత సామర్థ్యాన్ని వదిలి స్వార్థానికి సహాయం చేసినవారు
అస్థిత్వపు పిచ్చిలో వ్యక్తిత్వాన్ని వదిలి తోటి వారిని మరచిపోయారు..
సంప్రదాయాన్ని మరచి అరువుతెచ్చుకున్న కుతంత్రాన్ని
బానిసలు కొందరు భోధనా-విధ్యగా భోస్తున్నారు
మనలోని వారే ..!! “మనం” అన్న వారే..!!
చరిత్రలు, గతాలు మరిచినవారు స్త్రీ-పురుషులకి,
సుకుమార-ఖఠినత్వాన్ని ఆపాదిస్తున్నారు ..
స్వేచ్చంటే భాధ్యతలని నెరవేర్చుకునే హక్కని మరచినవారు,
దాన్ని “నీరుగార్చి ” చేతుల్లో నింపుతున్నారు….
మనలోని వారే ..!! “మనం” అన్న వారే..!!
సత్యానికున్న విరాట్‌స్వరూపాన్ని చూడలేని వారు
నగ్నత్వాన్ని చూసి కళ్ళు మూసుకుంటున్నారు…
మనసుల తలుపులు తట్టని మొండిమేధావులు …
ఇరుకు గదుల్లో మేధోమధనం చేస్తున్నారు.
మనలోని వారే ..!! “మనం” అన్న వారే..!!
ప్రశ్నలన్నింటినీ సంఘర్షణనుండి సమాధానం వరకూ
ఓదార్పు నుండీ ఉధ్ధరణ వరకూ
ఓర్పుగా తీసుకెల్లాల్సిందీ మనమే
నేర్పుగా నెరవేర్చాల్సిందీ మనమే! మనమే!!
-సత్య 🙂
Nice !
ప్రవీణ గారూ,
మీ కవిత తాత్పర్యం, నాకు సరిగ్గా అర్థమయి ఉంటే, తప్పులని ఎత్తి చూపడం. అటువంటి సందర్భంలో ఈ రెండు పాదాలూ ఒదగడం లెదని నా అభిప్రాయం. దయచేసి గమనించండి.
1. వేళ్ళసందుల్లో నుంచి జారిపోతున్న స్వేచ్ఛను గుప్పిట్లో నింపుతున్నదెవరు? .
స్వేచ్ఛ జారిపోతుంటే గుప్పిట్లో నింపడం మంచిదే. వాళ్లగుప్పిట్లో పెట్టుకుంటే మాత్రం అది నిరశించవలసినది.
అలాగే,
2. నగ్నత్వాన్ని చూడలేక కళ్ళు మూసుకుంటున్నదెవరు?… నగ్నత్వం చూడమని మీరు ప్రభోదిస్తున్నారని నేననుకోలేను. బహుశ ఇక్కడ నగ్నత్వం అంటే ఇంగ్లీషులో Nudity అనబడేది కాకపోవచ్చు. ఒక వేళ ఎదురుగుండా “ప్రత్యక్షంగా కనిపిస్తున్న” (Naked) అన్న అర్థం సూచించే అన్యాయాలో అక్రమాలో అయి ఉండొచ్చు. అప్పుడు నగ్నత్వం బదులు మరొక మాట వాడితే బాగుండేదేమో. దయచేసి గమనించగలరు.
అభినందనలు.
Nauduri Murty garu@ హృదయ పూర్వక ధన్యవాదాలు. ఇప్పుడిప్పుడే రాయటం నేర్చుకుంటున్న నాలాంటి వారందరికీ, ఇలాంటి సలహాలు ఏంటో అవసరం. It helps us to put our words and thoughts in a betetr way.
1.వేళ్ళసందుల్లో నుంచి జారిపోతున్న స్వేచ్ఛను గుప్పిట్లో న…ింపుతున్నదెవరు? .
My thought here is , ఇసుకను ఎంతగా గుప్పిట్లో బందిచాలనుకున్నా కుదరదు. వేళ్ళ సందుల్లో నుంచి జారిపోతుంది. ప్రస్తుత పరిస్తితుల్లో మనకున్న స్వేఛ్చ ఇసుకలాంటిదే. స్వేఛ్చ వుంది అని అనుకుంటున్నాం కాని,
అందంతా భ్రమే.
2. నగ్నత్వాన్ని చూడలేక కళ్ళు మూసుకుంటున్నదెవరు?…
నగ్నత్వం…ముసుగులేని నిజం. మనం మనసుకు కావాల్సింది ముసుగులు లేని సత్యం. మనం మనసునే ముసుగులతో కప్పెస్తున్నాం.మన మనసుకు కావాల్సిన నిజాన్ని చూడగలిగే ధైర్యం మనకి ఉందా?
పదాల కోసం తడుముకుంటూనే ఉంటాను. I will again try to get some more words. Thanks a lot Murty garu..