NRI సెలవులు
సంవత్సరమంతా కూడబెట్టుకున్న సెలవులు
చిన్న చితక నొప్పులు
దగ్గు జ్వరాలు లెక్కచేయక పోగుచేసుకున్న సెలవులు
మూడు నెలల ముందు నుంచే ప్లానింగ్
వీకెండ్ కలిసోచ్చేటట్టు ఫ్లైట్ సెడ్యుల్స్, కనక్టింగ్ ఫ్లైట్స్
ఆచితూచి టికెట్ బుకింగ్ తో కోలాహలం మొదలు..
షాపింగు హడావుడితో నిండిన
సూటుకేసు హాండులగేజీలతో సర్వం సిద్ధం…
ఎయిర్ పోర్టులో అమ్మ నాన్నలను చూడగానే
ఎందుకో
గొంతు మూగబోతుంది
కళ్ళు మసకబారతాయి
అది ఆనందమో? దుఖంమో?
ఈనాటికీ నేను తెల్చుకోలేను
గిల్టీ ఫీలింగ్ మనసుకు తెలుస్తూనే ఉంటుంది…
చుట్టాలు స్నేహితులు భోజనాలు
ప్రయాణాలు పలకరిపులు
తిరుపతి నడక
షిరిడి మొక్కు
అక్కడో రోజు ఇక్కడో రోజు
ఎక్కడా ఉన్నట్టే ఉండదు
అమ్మపై బెంగే తీరదు
నాన్నతో కబుర్లు చెప్పినట్టే ఉండదు
అంతలోనే తిరుగు ప్రయాణం….
పిండి వంటలు వండుతూ—-అమ్మ కన్నీటిని దాచుకుంటుంది
బజారు పనులతో తిరుగుతూ…నాన్న దిగులును కనిపించనివ్వరు
సూటుకేసు బరువులంటూ వీడ్కోలు చెపుతూ…అమ్మ కళ్ళలోకి చూడను
ఆరోగ్యం జాగ్రత్త నాన్న…ఇమ్మిగ్రేషన్ వైపు చూస్తూ చెపుతాను
గూటిని వీడి రెక్కలు చాచి ఎగిరిపోయిని పక్షిని…
ఇక్కడికి చేరాక
ఇన్నేళ్ళుగా అలవాటైన దేశమే పరాయిగా అనిపిస్తుంది
ఇంట్లో గోడలు తలుపులు ఒంటరిగా పిలుస్తాయి
‘మరో ఏడాది’ తరగని కాలంలా తోస్తుంది
పెంచుకుపోతున్న జీవనప్రమాణాలు
వెన్నుపూస కూసాలు కుదుపుతున్న ఉద్యోగధర్మాలు
కొన్నేళ్లుగా చేస్తున్న యుద్ధమే
మళ్లీ మొదటి కొచ్చినట్టుంటుంది…
కార్న్ ఫ్లేక్స్ బ్రేక్ ఫాస్టులు
ఒంటిపూట వంటలు
కాలరీ కౌంటులు
డే కేర్ పెంపకాలు
హాయ్ బాయ్ పలకరింపులు
వారాంతరాలకు పరిమితమయిన ఆప్యాయతలు
వెరసి బిజీ బిజీ జీవితాలు…
వారం రోజుల్లో మనసు సర్దుకుంటుంది
రొటీన్ ఇండియా ఫోన్ కాల్స్ లో పడిపోతాను….
Hai, Good
good expressions of every NRI feelings…………
dhooramaina koladhi perugunu anuraagam….
rasindi kodaiga anioinchina, baga rasaru, well captured the feelings, one who reads again has to think about vacation:)
chaala baagaa raasaaru.enta correct gaa chepparo
Mee NRI selavulu chala bagundandi.
chaala baga raasaru…manam ela yenduku batukutunnamo artham kuda kaadu…okkosari..okka page lo NRI Jeevitaanni aavishkarincharu
NRI selavulu manasuku hatthukunela rasaru.. abhinandanalu…
Very well expressed…really liked it…
Very well expressed – made me to remind the past of mine too.
bagundi
ee moodu vaakayalu chala goppaga , parinithi chendina kavithvam la vundi naaku…baaga chepparandi meeru…
పెంచుకుపోతున్న జీవనప్రమాణాలు
వెన్నుపూస కూసాలు కుదుపుతున్న ఉద్యోగధర్మాలు
కొన్నేళ్లుగా చేస్తున్న యుద్ధమే
Nice Article…. Very well written…. Can you please contact me to see if we can read this on our radio show. I am listing my show in the contact details….
అక్కడ NRI గా మీరు అత్మీయుల్ని కోల్పోతున్నారు ఇక్కడ ఇండియాలో మేం డబ్బుల్ని కోల్పోతున్నాం. నిజమేనా. ఐనా డబ్బులదేముందండి ఇక్కడైనా సంపాదించొచ్చు, కానీ అమ్మా నాన్నల్ని అక్కడ సంపాదించుకోలేం కదా.
హహహహహా బలే రాసారు,నైస్ నైస్ బాగుంది
ఎం చేద్దం మరి తప్పదు ఎన్.ఆర్.ఐ బతుకులకు ఈ బాదలు..
Touching..
chala bagundi..kallalo neellu thirigay..