కుందేళ్ళ కధన్నమాట…మూర్ఖత్వం versus అతితెలివితనం
భూతద్దంలో కనిపెట్టిన జీవిత సత్యాలు (పార్ట్ 2)
ఇది కుందేళ్ళ కధన్నమాట, సావధానంగా వినండి (చదవండి)
అనగనగనగా , ఒక ఊరిలో ఇద్దరు వ్యక్తులు వున్నారన్నమాట.
వ్యక్తి one అంటాడు @ ప్రపంచంలో కుందేళ్ళన్నీ ఒకే మాదిరిగా ఉంటాయి. అమెరికాలోనైనా, ఆస్ట్రేలియాలోనైనా, కేనడాలోనైనా, ఆఫ్రికాలోనైనా..చివరికి మా దుబాయ్ జూ లో వుండే కుందేళ్ళు అన్నీ ఒకే బరువు, ఒకే ఎత్తు, ఒకే రంగు కలిగివుంటాయి.
ఊళ్ళో వారందరూ వ్యక్తి one గురించి తమలో తాము ఇలా అనుకుంటారు@ This is truly purely called stupidity
వ్యక్తి Two అంటాడు @ నీ మొహం నీకేం తెలుసు. నేను చెపుతా విను. నేను పట్టుకున్న కుందేలే కాదు, ప్రపంచంలో ఉన్న కుందేళ్ళ అన్నింటికి మూడే మూడు కాళ్ళు. అలాగని నిరూపించే తెలివితేటలు నాకున్నాయి.
ఊళ్ళో వారందరూ వ్యక్తి Two గురించి తమలో తాము ఇలా అనుకుంటారు@ ఓరి భగవంతుడా, ఇదెక్కడి తెలివితేటలు? ఇది అతి To the power of అతి అంత అతితెలివితేటలు. మహానుభావా, నీకు వుండాల్సింది
తెలివితేటలు కాదు..వివేకం, సంస్కారం.
Moral of the story is @ ఈ ఇద్దరు వ్యక్తులకు దూరముగా వుండటం శ్రేయస్కరం.
ఇప్పుడు, Multiple choice Quiz time అన్నమాట,
అ) పైన ఉదహరించిన వ్యక్తులలో ఎవరు ఎక్కువ ప్రమాదకరం
౧) వ్యక్తి one
౨) వ్యక్తి Two
౩) ౧ మరియు ౨
ఆ) పైన ఉదహరించిన వ్యక్తులను మనము మార్చాలి అనుకున్నచో,
౧) మనం ముర్ఖులము
౨) మనవి అతితెలివితేటలు
౩) పైన చెప్పిన రెండు
***ఇప్పుడు రిసర్చ్ వర్క్ అన్నమాట,
ముర్ఖుడుకి, అతి తెలివితేటలు ఉన్న వాడికి అసలు బేధం ఉందా?
***Research grant will be provided
హ హ హ …. ఓ తేడా ఉండనే ఉంది … !!!
ఎలా అంటారా … మొదటివాడు కుందేలి రంగులోనో, ఎత్తులోనో, లేక ఇంకో విషయంలోనో పట్టుబడొచ్చు … కాని రెండవ వాడు … తానూ పట్టుకున్న కుందేలి కాలిని విరగ్గొట్టి ఐన … కుందేలికి మూడే కాళ్ళు అని రుజువు చెయ్యగలడు … 😉
నాకు కొద్దిగా అతి తెలివి పాళ్ళు ఎక్కువలెండి … 😉
Fazlur Rahaman Naik @ సుపెరో సూపరు మీ సమాధానం..
అంతా మీ బ్లాగ్ టపాలు … మీ పేస్ బుక్ టపాలు చదివి వచ్చిన (అతి)తెలివి లెండి … 😉
Fazlur garu @ హ్మం…నన్ను తిడుతున్నారా? వుండండి వుండండి మీ సంగతి మా అతితెలివి కుందేలు సంఘం అధ్యక్ష కుందేలుకు చెపుతాను 🙂
ఆ .. (భయం తో) … వద్దు వద్దు … నేను మిమ్మల్ని తిట్టలేదు … పోగిడాను అంతే … !!! 🙂
ఇద్దరూ వారి వాదన తప్ప మరొకళ్ళది వినరు…ఇద్దరికీ తేడా లేదండీ..
good
వారు ఇద్దరూ ఏ ఏరియా లో ఉంటారో చెబితే ……… నా జగ్రత్త లో నేను ఉంటాను – ఎందుకైనా మంచిది.( దానిని స్వార్ధం అంటారన్నమాట )
ఎవరు ఎక్కువ ప్రమాదకరం?
–> ఇట్లాంటి కథలు చెప్పి భయపెట్టే మీరు! 🙂
ఇది చాలా బాగుంది
just joking