ఆ పెద్దమనిషి వదిలి వెళ్ళిన సద్దిమూట


ఆ పెద్దమనిషి వదిలి వెళ్ళిన సద్దిమూట

వెళుతూ వెళుతూ
ఏదో వదిలి వెళుతున్న బావన
మనసూరుకోక వెనుదిరిగి
మూల మూలలా వెతుకుతుంటే…..
ఓ పెద్ద మనిషి భుజం తట్టి
“ఎందాకా?” అని ప్రశ్నించారు
ఎక్కడో చుసినట్టుందే…గుర్తురావటంలేదు ??!!
సమాధానం చెప్పటం మరిచిపోయి ఆలోచిస్తూ ఉండిపోయా…..
“సరి సరి వెళ్లిరా”, కళ్ళతోనే సైగ చేసి
గుర్తుపట్టేలోపే మునుముందుకు   సాగిపోయారాయన…

నేను వెనక్కి వెళ్లి వెళ్లి
అడుగడుగు వెతుకుతుంటే
అదిగో..అదిగో…ఆ మూలన…..
తుప్పు పట్టిన ట్రంకు పెట్టె
ఊపిరి మరిచి
ఒక్క అంగలో దరి చేరి
ప్రేమగా తట్టాను….

అప్రయత్నంగా కళ్ళల్లో తిరిగిన నీరు
ట్రంకుపెట్టె పైకి  జారి
పేరుకుపోయిన దుమ్మును తడి చేసి
గుండె తడిని గుర్తుచేసింది…

ఆప్యాయంగా తలుపు తెరిచా
మనసెరిగిన  ముక్క వాసన   హృదయమంతా పరుచుకుంది
ఇదిగో…ఇదిగో…ఈ మూలన
సద్దిమూట
కన్నీరు పన్నీరు కలగలిపి
మూటగట్టి
ఆ పెద్దమనిషి వదిలి వెళ్ళిన సద్దిమూట
కాలం మిగిల్చిన నా జ్ఞాపకాల మూట….

This entry was posted in కవితలు, కష్టం, కాలం. Bookmark the permalink.

2 Responses to ఆ పెద్దమనిషి వదిలి వెళ్ళిన సద్దిమూట

  1. Hari Krishna Sistla says:

    Good to call.”కన్నీరు పన్నీరు కలగలిపి”,should have been altered as Kanneeti Panneeru,Otherwise makes me remember Mrs.Bhanumathi’s writings “Attagari kadhalu”.

Leave a comment