దహన సంస్కారం
ఎక్కడో ఏదో కాలుతున్న వాసన
ముక్కు పుటాలను కమ్మేస్తున్న పొగ
శ్వాసలో నా వాసన నాకే తెలుస్తున్న బావన
దహనమైపోతున్నది ఎవరూ?
నా అంతరాత్మ?
కాదు కాదు…ఇది నేను కాదు
ఎవరో ఎక్కడో…ఏమో నాకు తెలీదు
ఎవరో ఏడుస్తున్న శబ్దం
చెవులు రిక్కించి ఆలకిస్తున్నా
ఎక్కడో విన్న గొంతులా ఉందే
నేను నా వాళ్ళు అనుకున్న వాళ్ళ గొంతా?
కంపించిన ఎద మిగిల్చిన
శిధిలాల మధ్య మూగగా రోదిస్తున్నది
నాలో నేనా?
కాదు కాదు…ఇది నేను కాదు
ఎవరో ఎక్కడో…ఏమో నాకు తెలీదు
నేను కాదని
నన్ను నేను నమ్మించుకోవటానికి
నన్ను నేను దహించుకుంటున్నా
రండి రండి
నా దహన సంస్కారానికి హాజరవ్వండి
ఇంకా
ఎందుకా ఎగతాళులు?
ఎందుకా వంకర నవ్వులు?
ఇప్పుడు
నేనూ మీలో ఒకరినేగా….
ఆత్మ సంస్కారం బాగుంది….
Good one.Only some words perhaps require a change to attain perfection,I felt .
‘Yeda migilinchina’ and the words ‘Yendukanaa (yenduku + ani +aa) egataalululu ‘ and ‘ yendukanee vankara navvulu.
However I am not a good writer as you are,I am made to feel.