ఓ నలిగిన జ్ఞాపకం
జ్ఞాపకాల దొంతరలో నుంచి
ఓ నలిగిన కాగితం
అప్రయత్నంగా జారి పడింది….
వీలైనంత చదును చేసి చదువుదామంటే
కన్నీళ్ళ కొలనులైన కళ్ళు
మసగబారిపోయాయి…..
ఒక చేత్తో కళ్ళు నలుపుకుంటూ
మరో చేతి చూపుడు వేలుతో
అలుక్కుపోయిన అక్షరాలు విడదీస్తుంటే
చెమ్మగిల్లిన కాగితం
మరి కాస్త చిరిగి
మనసుని చిత్తడి చేసింది…
నలిగిన జ్ఞాపకాల పనే అది మనసు చిత్తడే చేయడమే ప్రవీణ గారూ, కవిత బావుంది.
Good indeed.Felt very sensitive,on thy feelings.
superb