నిశ్శబ్దం మాట్లాడింది
అ వేళ,
సద్దు లేని పొద్దులో
ఎద నిశ్శబ్దంలో ఓలలాడింది.
సవ్వడి లేని ప్రశాంతంలో
మనసు మధురిమలు పలికింది.
ఆ వేళ,
ధ్వని లేని ద్వారంలో
మౌనం రారమ్మని పిలిచింది.
సడి లేని సౌధంలో
ఏకాంతం ఆతిధ్యమిచ్చింది.
ఆ వేళ,
కనురెప్పల రెపరెపలు ఊసులాడాయి
ముంగురులు నుదుటిపై గుసగుసలాడాయి
ఉచ్ఛ్వాస నిచ్ఛ్వాసలు కబుర్లాడుకున్నాయి
ఆ వేళ,
హృదయం కౌగిలించుకుంది,
అవును… హృదయ స్పర్శ మాట్లాడింది,
అవును…నిశ్శబ్దం మాట్లాడింది.
Good Literature.
Instead using the sentence “మౌనం రారమ్మని” should have gone with “Mounam Rammani pilichindi”. Might have better if used sentence “Nuduti pai mungurulu” instead using “ముంగురులు నుదుటిపై”.
Landing sentences are excellent indeed.
Hari Krishna Sistla garu: Thanks a lot for ur advices for all my poems.
మీ నిశ్శబ్దపు సవ్వడి మాకు వినిపించి౦దండీ….. బావుంది కవిత.