నా చిన్ని ప్రపంచం
నాదో చిన్ని ప్రపంచం,
పిడికిలంతే పరిమాణం,
పిడికిలిలో అనంతంగా పరుచుకున్న మనసులో,
కదలాడే కోట్ల కోట్ల బావాలు,
కలగలిపిన హృదయం నా ప్రపంచం.
ఈ చిన్ని ప్రపంచంలో,
ఎన్నో బంధాలు,
కల్మషం లేని ప్రేమను పంచే అమ్మ,
గాంభీరంగా అక్కున చేర్చుకునే నాన్న,
తుంటరిగా తోడుగా ఉండే తోబుట్టువులు,
వయసులో కలిసి బ్రతుకులో భాగమయ్యే భాగస్వామి,
బాధ్యతను ప్రేమగా భుజానికెత్తుకుని పెంచాల్సిన సంతానం.
మరెన్నో స్నేహాలు,
కొన్ని గాలివాటంతో కొట్టుకుపోతే,
మరికొన్ని మంద్రంగా మనసంతా ఆక్రమించుకునేవి,
కొన్ని ‘నా’ నుంచీ ‘మా’ దాకా పరుచుకునేవి,
మరికొన్ని ‘మా’ నుంచీ ‘నా’ దాకా దగ్గరయ్యేవి.
కొన్ని కలతలు మిగిల్చినా,
మరికొన్ని ద్వేషాన్ని రగిల్చినా,
అవన్నీ అనుభవాల చిట్టాలో లెక్కలే.
కాలంతో కరిగిపోయే కన్నీరు కొంతయితే,
కరుడు గట్టిన కన్నీరు కాలంలో మిగిలిపోయేది మరి కొంత.
సంతోషపు సముద్రపు అంచున,
ఆనందపు ఉశోదయాలు,
విషాదపు కొండల నడుమన,
అస్తమిస్తున్న కష్టాలు,
అన్ని అందంగా కలబోసిన ప్రపంచం ఈ నా చిన్ని ప్రపంచం….
Excellent writing.Very much exclusively the lines “Naa nunchee maa daakaa …..”బాధ్యతను ప్రేమగా భుజానికెత్తుకుని పెంచాల్సిన సంతానం.,Only this was the line I could not digest.If you feel the one as Responsibility,Affection is backlogged and if you feel Affection,Responsibility is a backlogged term.