నాలో కఠినత్వం
ఎప్పుడు ఆపాదించుకున్నాను ఈ కఠినత్వం? ఎక్కడ పోగొట్టుకున్ను సున్నితత్వాన్ని?
భగవంతుడు సఖల ప్రాణికోటిలాగానే నన్ను సృష్టించాడు కదా. జంతువులు, పక్షులు, చేపలు పుట్టినప్పుడు ఎంత సుకుమారంగా వున్నాయో, నేనూ అంతే సుకుమారంగానే ఉన్నాను. సుతిమెత్తని శరీరం, చిన్ని చిన్ని పాదాలు, చేతులు. బోసి నోరు, చిన్ని కళ్ళు, బుజ్జి నోరు. అంతా ఆనందమే, ఆకలేస్తే ఏడుపు తప్ప. అప్పుడు నాకు ఆలోచన, తెలివి లేవు. అమ్మ ఒడిలో ఉన్నంత కాలం శారీరకంగా, మానసికంగా అపురూపంగా, సుకుమారంగానే ఉన్నాను.
ఊహ తెలిసి తెలియకుండానే భుజాన స్కూల్ బాగు బరువు పడింది. బుజ్జి బుజ్జిగా మొదలయిన అక్షరాలు, వయసుకు మించిన జ్ఞానం సంపాదించుకోవాలనే ఆత్రంలో భారంగా తయారయ్యాయి. ఆటలు తనివి తీరా ఆడుకోవాల్సిన సమయం అంతా కోచింగులతో సరిపోయింది. చెస్, టెన్నిస్, సంగీతం లాంటివి హాబీలుగా కాకుండా తప్పని సరి కార్యక్రమాలుగా తయారయాయి.
నాకేమి కావాలో నిర్ణయించుకునే వయస్సు రాకమునుపే, నేను పెరిగి పెద్దయిన తర్వాత ఏమవ్వాలో నిశ్చయించేసారు. ఇక నేను చెయ్యవలసినదల్లా, అప్పటికే నిర్ణయించిన గమ్యం వైపు పరుగులు పెట్టాలి. పరుగులు పెట్టడానికి మాత్రమే తర్ఫీదు అయ్యాను. ఆ పరుగులు నేను ఆస్వాదిస్తున్నానా అనే ప్రశ్న నాకు నేను వేసుకునే స్వతంత్ర్యం కూడా నాకు లేదు. ఏ విసుగులోనో, చిరాకులోనో పైకి పొరపాటున అన్నానో, నేనేదో పాతాళంలోకి జారిపోతున్నట్టు, నన్ను పైకి లాగటానికి ప్రసంగాల తాడుతో తయారైపోతారు అందరూ. ఆ ప్రసంగాలు వింటుంటే ఒక్కోసారి నాకే అనిపిస్తుంది, నేను వెనకపడిపోతున్నానేమో అని. మనసు మాత్రం బాధగా ములుగుతుంది ఏ మూలో.
ఆ బాధలోని అసహాయత నాలోని కటినత్వాన్ని పెంచిందా? లేక కటినంగా ఉండకపోతే బతకలేను అన్న అపోహ నాలోని సున్నితత్వాన్ని తగ్గించిందా? ఏదిఏమైనా నేను బండబారిపోతున్నాను బతకడం కోసం.
చదువు అయ్యిందనిపించి ఉద్యోగంలో చేరగానే పంజరంలో నుంచి బయటకు వచ్చి రెక్కలు విప్పుకున్న భావం. చేతినిండా డబ్బు, అంతకంటే ముఖ్యంగా సాయంత్రాలు తీరిక సమయం. చదువు పుస్తకాలలో కూరుకు పోవాల్సిన అవసరం లేని సాయంత్రాలు వచ్చాయన్న ఆనందం. ఇష్టమైన పుస్తకాలూ చదవొచ్చు, నచ్చిన సినిమాలు చూడొచ్చు, స్నేహితులతో షికారులు కొట్టోచ్చు …అప్పటికే పరిపక్వత వచ్చిందన్న ఆనందం. సమయాన్ని ఆస్వాదించొచ్చు అన్న ఆశ. మళ్లీ సున్నితత్వాన్ని కౌగులించుకోవచ్చన్న కోరిక.
ఇంతలో ప్రాజెక్ట్ డెడ్ లైన్స్ భుతాల్లా మీదపడ్డాయి. సాయంత్రాలు కాదు, రాత్రుళ్ళే మింగేసాయి. ఇంత జీతాలు ఇచ్చేది అంత పని చేపించుకోవటానికే కదా అని సరిపుచ్చుకున్నా.
కొలువులో పని మెలమెల్లగా జీవితంలోని కాలాన్ని మింగేసింది. నా ప్రమేయం లేకుండానే నా కుటుంబంలో పరాయినయిపోయా. ఏ అర్ధరాత్రో ఇంటికి వెళ్ళే నా టైమింగ్స్ కు నా ఇంటి వాళ్ళు అలవాటైపోయారు. ఇక నా కోసం ఎదురుచూడటం మానేశారు. పెళ్లి, పుట్టిన రోజు, పేరంటం దేనికి వెళ్ళాలన్నా బోల్డంత ప్లానింగ్ కావాలి.
అప్పుడు అర్థమయింది ఇంత పెద్ద జీతాలు ఇచ్చేది మన జీవితంలోని జీవితాన్ని లాగేసుకోవటానికి అని. గాను గేద్దులా పని చేస్తున్న నాకు సున్నితత్వం ఎక్కడ వుంటుంది, కటినత్వం తప్ప?
అసలు నేను చిన్నప్పటి నుంచీ ట్రైన్ అయ్యింది ఇలా పరుగులు పెట్టటానికే కదా?!
ఈ హడావిడిలో ఏ పేపర్ చూసినా, టీవీ చూసినా రోజూ అవే వార్తలు. ఆ వార్తలకు ఎంతగా అలవాటు పడిపోయాము అంటే, చెడు వార్తలకు కూడా స్పందించటం మానేసాము. అంతే కదా ఎప్పుడైనా ఓసారి అన్యాయం జరిగింది అని తెలిస్తే బాధతో హృదయం బరువెక్కుతుంది, ఏదన్నా సాయం చెయ్యాలి అన్న ఆలోచన, ఆవేశం వస్తుంది. రోజూ రోజూ జరిగే అన్యాయాలకు అలవాటు పడిపోతాము.
దేవుడు మనిషికి మాత్రమే ఆలోచన, తెలివి ఇచ్చాడు. అవే మనిషిలోని సున్నితత్వాన్ని చంపేస్తున్నాయా అనిపిస్తుంది.
చివరి వాక్యంతో ఏకీభవించను కానీ టపా బావుంది. ఏంటో, జీవన చక్రంలో అలా దొర్లుకుపోతున్నాం అందరమూనూ.
Sarath Kaalam garu: Welcome to my blog. మనిషి అతితెలివితో ఆలోచిస్తూ యంత్రికతకు దగ్గరవుతూ సున్నితత్వాన్ని పోగొట్టుకుంటున్నాడు…Thanks for responding.
There are many people like me too.Just getting adjusted with the situations,our father gets a transfer.In My childhood,we used to spare a separate time for the entire family to meet.(Generally in Summers)The Three months of enjoyment per year.Now we feel, we have lost that too.
Hari Ksrishna Sistla garu :అవును చిన్నప్పుడు వేసవి సెలవలకు ఊరు వెళ్ళటం ఎంత ఆనందంగా ఉండేదో. ఇప్పుడు పిల్లలు అవన్నీ మిస్ అయిపోతున్నారు.. ధన్యవాదాలు
‘అసలు నేను చిన్నప్పటి నుంచీ ట్రైన్ అయ్యింది ఇలా పరుగులు పెట్టటానికే కదా?!’ nicely expressed feeling. every generation is going through such feeling with more or less intensities . This generation is going through lot of such hard feelings, because they could not enjoy their child wood….Nutakki Raghavendra Rao. (www.nutakki.wordpress.com)
Nutakki Raghavendra Rao garu: work… work…make money, thats the only thing left now అనిపిస్తుంది ఒక్కోసారి .
మంచి ఆలోచనల వైపు మన పయనం సాగాలని కోరుకునే మీ ఆలోచనలకు ధన్యవాదాలు..
saamaanyudu garu: కృతఙ్ఞతలు
ఇంతలో ప్రాజెక్ట్ డెడ్ లైన్స్ భుతాల్లా మీదపడ్డాయి. సాయంత్రాలు కాదు, రాత్రుళ్ళే మింగేసాయి. ఇంత జీతాలు ఇచ్చేది అంత పని చేపించుకోవటానికే కదా అని సరిపుచ్చుకున్నా. ……. like this
John Hyde garu: నేను ఎక్కడో చదివాను, బహుశా యండమూరి నోవెల్ లో అనుకుంట…పూర్వకాలం యజమాని పనివారిని కొరడాతో కొట్టేవారంట, ఇప్పుడు సాఫ్ట్వేర్ కంపనీలు ఉద్యోగులను డబ్బులతో కొడుతున్నారు నడుములు పడిపోఏదాకా…Thanks for responding..
.అయితే మనిషి పుట్టిన దగ్గరనుంచి చచ్చేదాకా చదువులకోసం,మంచి ఉద్యోగాలకోసం,పదవులకోసం,ఆస్తులకోసం,అధునాతన సౌకర్యాలకోసం,కీర్తులకోసం, మనుషులను తరుముతున్న దెవరు?కెరీర్ కోసమనో,విలాస సాధనాల కోసమనో జనం ఈవిధమయిన వెర్రి పరుగులు తీయడంలో అర్ధం ఏమిటి?గతంలో ప్రజలమధ్య వున్న అనుభంధాలు ఇప్పుడు కాన రావడం లేదు. ఈ అనుభందాలను కలుషితం చేసిందెవరు? అదుపులేని సంపదల పట్ల,అంతులేని సౌకర్యాలపట్ల ప్రజలను ఇంతగా వ్యామోహపరుస్తున్న దెవరు? గుర్రపు వీపుమీద కూర్చొని దాన్ని వెదురు బొంగుకు కట్టిన గడ్డి బుంగ చూపిస్థూ పరుగు తీయిస్తున్నట్టు జనాన్ని కూడా పరుగులెట్టిస్తున్నది ఎవరు? ప్రభుత్వమా, మీడియానా,కాకుంటే టోటల్గా సమాజమేనా? ఎవరు దీనికి జవాబుదారీ వహించాలి? కాకుంటే ఎవరిని భాధ్యులను చేయాలి? ఈ విషయాల పైన కూడా కొంచం అర్ధవంతంగా వివరించరా ప్లీజ్……… ……
ప్రభుత్వం , మీడియా మనల్ని ఇలా వుండండి అని చెప్పిందా? మనకి మనమే మితి మీరిన ఆశలకు పోయి పెడుతున్న పరుగులు కదా ఇవి. విలాసాలల్లో సుఖాన్ని అనుభవిస్తూ సంతోషాన్ని మరిచిపోయము. విడిది విందు ఎంత రుచిగా ఉన్నా, అమ్మ చేతి ముద్దే పొట్ట నింపుతుంది. వ్యాపారసభల ఉపన్యాసాలు ఎన్ని విన్నా,భార్య/భర్త పలకరింపే వీనుల విందుగా ఉంటుంది. నోట్ల కట్టల సంపాదన ఎంత ఉన్నా,బిడ్డలతో అనుభందమే ఆనందాన్నిస్తుంది.
ఓ మనిషి, నువ్వు తెలివి ఉన్న ఓ జీవివి మాత్రమే,చావు పుట్టుకుల నడుమ నడమంత్రపు సిరి ఎంతున్నా,నీ పొట్టకు కావలిసింది పిడికెడు మెతుకులే,గుప్పెడు గుండెకు కావలిసింది మనసంత మమతే,
ఇదీ నిజం..అవును కదూ?.
ఇవన్ని మనకు తెలీనివి కాదు. కానీ, లోకంతో పాటు పరుగులు పెట్టకపోతే, వెనక పడిపోతామేమో అని భయంతో ప్రవాహంలో కొట్టుకు పోతాము. పెరుగుతున్న లివింగ్ స్టాండర్డ్స్, సమాజం లో పోటి తట్టుకొవటానికి మనల్ని మనమే సమిధలము చేసుకుంటున్నాము.
I don’t think there is a way to escape. Have to find happiness with what ever time we have in our hands by developing good hobbies.
Well said, very nice.
భ్రష్టు పట్టిన ఈ వ్యవస్తని సవరించడానికి కావాల్సింది ఈ ఆలోచనే…మనం మనుషులమా? యంత్రాలమా? అందుకే మహాకవి శేషేంద్ర అన్నాడు ‘చేట్టునన్నా అయ్యుంటే యేడాదికి ఒక వసంతం అన్న దక్కేది’ అని..
the other side of the grass is always greenary