:కోపానికి అటు ఇటు:
కోపానికి అటు:
1 . అకారణంగా నాకు కోపం రాదు కదా. చిన్నదో పెద్దదో ఏదో కారణం ఉండే ఉంటుంది కద. ఆ కారణం నీకు చిన్నగా అనిపించవచ్చు, నాకేమో పెద్దగా కనిపించవచ్చు.
2 . నాకు కోపం తెప్పించే పనులే ఎందుకు చేస్తావు నువ్వు?
3 . నువ్వు కాబట్టే కద నా కోపాన్ని చూపించ గలుగుతున్నాను. అదే పరాయి వాళ్ళ ముందు ఇలా నోరు పరేసుకోగలనా?
4 . ఆ కాసేపు నన్ను భరించగలిగితే, నా తప్పు నాకు తెలుస్తుంది కదా.
5. కోపంలో నేనేం మాట్లాడుతున్నానో నాకే తెలిదు అని నీకు తెలుసు కదా. నువ్వు అవన్నీ మనసులో పెట్టుకుని ఎందుకు బాధ పడతావు? I don’t mean it అని అర్థం చేసుకోవచ్చు కదా.
కోపానికి ఇటు:
1 . కోపంలో చిన్న విషయం కూడా పెద్దగా కనిపిస్తుంది అని ఎప్పుడు తెలుసుకుంటావు?
2 . నేను ఏ పని చేసినా నీకు కోపం ఎందుకు వస్తుంది?
3 . “నువ్వు కాబట్టే…”, అవును నేను కాబట్టే నీ కోపాన్ని బరిస్తున్నాను. పరాయి వాళ్ళకు ఇచ్చిన గౌరవం నాకు ఎందుకు ఇవ్వవు? పరాయి వాళ్ళ దగ్గర చూపించిన సున్నితత్వం నా దగ్గర ఎందుకు చూపించవు? నన్ను ఎందుకు take it for grated గా తీసుకుంటున్నావు?
4 . నీ తప్పు నీకు తెలిసే లోపల నా మనసు విరిగి పోతుంది కద. విరిగిన నా మనసు నీ దగ్గరతనానికి దూరంగా వెళ్ళిపోతుందని నువ్వు గుర్తించ లేవా? దగ్గరతనం కోల్పోయినప్పుడు “నువ్వు కాబట్టే..” అనేది ఉండదు కద. నీ కోపంతో ఆ దగ్గరితనం దూరమై పోతుందని ఎప్పుడు తెలుసుకుంటావు? కోపం తగ్గాకా? అప్పటికి జరగాల్సిన నష్టం జరిగిపోతుంది కద.
5 . కోపంలో పౌరుషంగా నువ్వు అనే మాటలు, I don’t mena it అని కోపం తగ్గిన తర్వాత నువ్వు చెప్పినంత తేలికగా, గాయ పడిన నా మనసు ఒప్పుకోలేదు. మాటలు తూటాలు, తూటాను వదిలిన తర్వాత అది గాయం చేసే తీరుతుంది. గాయం ఎందుకు అని నువ్వు అనే మాటలో అర్థమే లేదు.
good post.
చాలా బాగుందండి. కానీ కోపానికి అటు ఉన్నవాళ్ళకు ఇవతల వైపు, ఇటు ఉన్నవాళ్లకు అవతల వైపు కనబడవు కదా. అదే పెద్ద ప్రోబ్లం…:)
గాయత్రీ గారు: ధన్యవాదాలు
తృష్ణ గారు: అవునండి కోపంలో ఏది కనిపించదు. ధన్యవాదాలు
బాగుంది..
good analsys… keep writing..
మంచి పోస్ట్ అండి…
బాగా రాసారు..
మనకి ఇష్టమైన వాళ్ళు, మనమంటే ఇష్టపడేవాళ్ళు కోపం లో ఏమైనా అంటున్నప్పుడు దాన్ని కాస్త వోర్చుకుంటే..ఆ వోర్పు ఆ బంధాన్ని ఇంకాస్త స్ట్రాంగ్ చేస్తుందని……….. ( తనకి లేదా అతనికి ఆ కోపం వాళ్ళ కలిగే బాధని తర్వాత కాస్తా వివరం గా వివరించగలిగితే, తను లేదా అతను ఆ బాధను అర్ధంచేసుకోగలిగితేనే)
అంతవరకే రాయగాలిగానండి, మిగతాది రాయలేకపోతున్నా..కానీ రాసింది మాత్రం, ఆరు సంవత్సరాల అనుబవం తో రాసానండి..
ప్రబంధ పూదోట గారు: ఆరు సంవత్సరాలలో గ్రహించుకోగాలిగారు మీరు. మీ కుటుంబ సభ్యులు అదృష్టవంతులు.
హాయ్ ప్రవీణ గారు.. ఉభయకుశలోపరి 🙂
చాలా రోజుల తరువాత మీ ఇంటికి వచ్చాను.. అదే అండీ మీ బ్లాగ్ కి 🙂
చక్కగా చెప్పారు కోపానికి అటూ ఇటూ మధ్య నలిగిపోయే మనసు గురించి.. ఇవే ప్రశ్నలు ఇంతకుముందు నన్ను వెంటాడుతూ ఉండేవీ కోపం వచినపుడల్లా !! ఏది అయినా భరించగలమేమో కాని కోపంలో వచ్చేమాటలు చేసే గాయాలకి పదును ఎక్కువ !!
ఈమధ్య బాగా ఆలోచించి కోపం జోలికి వెళ్ళట్లేదు.. అలా అని కోపాన్ని జయించాను అని కాదు.. కానీ పరిస్థితులని అర్ధం చేసుకుంటే మనసు తనంతట తనే నెమ్మదిస్తుంది.. ఈ విషయంలో నేను అద్రుష్టవంతురాలిని !! నా స్నేహితులకి సదా ఋణపడి ఉంటాను !!
పద్మ గారు: బహుకాల దర్శనం…మరీ చుట్టపు చూపులాగా రాకండి పద్మ గారు, అడపాదడపా ఇటు వచ్చి వెళ్ళండి, మీ రాక మాకెంతో ఆనందం సుమండీ..
నాకు కోపం చాల ఎక్కువ, కోపంలో మాటలు తూటాల్లా బాధపెడతాయి. అదృష్టం మీది కాదు, మీ చుట్టూ వుండే వారిది.
చాలా బాగుంది ప్రవీణ…బాగా విశ్లేషించారు. మన ఒక్కోసారి అటు ఇటూ కూడా ఉంటూ ఉంటాం. ఏది ఏమైనా కోపం తగ్గాక అన్న మాటలకి మనస్పూర్తిగా క్షమాపణలు చెప్పేస్తే ఏ సమస్యా ఉండదు.
Really awesome analysis!!!! .. I feel no one can explain better then this