వీడ్కోలు తల్లీ వీడ్కోలు….(అరుణా షాన్బాగ్)


వీడ్కోలు తల్లీ వీడ్కోలు..అరుణా షాన్ బాగ్

మానవత్వాన్ని ఇనుప గోలుసలతో బంధించి, క్రూరంగా బలత్కరించి, హింసించి కోమాలోకి నెట్టేసి, 30 సంవత్సరాలు, అవును ౩౦ వసంతాలు అచేతనావస్థలో వదిలేసినా ఈ సమాజం నుంచీ నీకిదే మా వీడ్కోలు.

సభ్య సమాజం ఉలిక్కిపడగా, యావత్ దేశం ధ్రిగ్బాంతికి లోనవగా, మానవాళి సిగ్గుతో సగం చచ్చిపోగా, తోటి మనుషులను చీత్కరించుకుంటూ, మరో జన్మంటూ ఉంటే
మానవ జన్మ, అందులోను ఆడజన్మను ఇవ్వొద్దు అని దేవుడ్ని వేడుకోవటానికి నిస్సహాయంగా వెడలిపోతున్న నీకిదే మా వీడ్కోలు.

ఇంత ఘోరం తలపెట్టిన మృగం ఏడేళ్ళు కేవలం ఏడేళ్ళు శిక్షను అనుభవించేసి, సమాజంలో చలామణీ అయిపోతున్నా, తోటి సంఘ జీవులు గుర్తుపట్టలేని, గుర్తు పట్టినా పట్టించుకునే తీరిక లేని నవ యుగపు  నవీనత్యం నుంచీ నీకిదే మా వీడ్కోలు.

నువ్వూ మా అందరి లాంటిదానవే, మా అందరి లాగా ఎన్నో కలలు కనే ఉంటావు, జీవితంలో ఏదో సాదించాలని తపన పడే ఉంటావు. నర్సుగా సేవలు చేసిన నువ్వు, నీకు జరిగిన అన్యాయానికి బలైపోయి, విధికి తలొంచి,   చావు సాయం మాత్రమే మార్గమని, ఈ క్రూర మృగాల నుంచీ తప్పించు కోవటం కోసం మృత్యు కౌగిలిలో ఒదిగిపోతున్న నీకిదే మా వీడ్కోలు.

100 వసంతాలు జరుపుకున్న మహిళా దినోత్సవం, మహిళల దుస్థితిని మరో సారి గుర్తుచేస్తూ వెలుబడిన చారిత్రాత్మక తీర్పు euthanasia, దశాబ్ధాలు కాదు శతాబ్ధాలు గడిచినా, అడవి నుంచీ నాగరికత నేర్చి పట్టణాల దాక ఎగబాకినా, మానసికంగా అడవిలో జీవించే జంతువులలాంటి మనుషులు ఇంకా ఉన్నారు అనే నిజాన్ని నిరూపిస్తూ వెళ్ళిపోతున్న  నీకిదే మా వీడ్కోలు.

దేవుడ్ని నిలదీసి అడుగు  “ఇదేమి న్యాయమని?”. ఇదంతా నీ పూర్వజన్మ పాపఫలం  అని దేవుడు సమాధానమిస్తే, ఇంకేమి మాట్లాడకు, అనవసరం.
ఈ జన్మలో చేసిన పాపాలకు మరో జన్మలో శిక్షంట!! మరో  జన్మ ఉందో లేదో తెలీని మనిషిని ఈ జన్మలో చేసిన పాపాలకు మరేదో జన్మలో శిక్షిస్తాడంట దేవుడు!!??దేవుడికే లేని న్యాయం, దేవుడు సృష్టించిన మనుషులకు ఉంటుందా??

ఎందుకు మనకు కటినమైన శిక్షలు లేవు? ఎంత నేరం చేసినా చెలామణీ అయిపోవచ్చు అనే ధైర్యం ఎందుకు మన సమాజంలో ఉంది? పసిపిల్లల దగ్గర నుంచీ పండు ముసలిని కూడా వదలని ఈ క్రూరులను నడిరోడ్డులో నిలబెట్టి ఎందుకు శిక్షించరు?
తోటి మనిషిని చూస్తేనే బెదిరిపోయే రోజులు రాబోతున్నాయా??

ఎక్కడో ఎప్పుడో ఎవరికో జరిగేవిలే, మాదాకా రావులే, మాకెందుకులే…..

This entry was posted in సమాజంలో సామాన్యులు. Bookmark the permalink.

9 Responses to వీడ్కోలు తల్లీ వీడ్కోలు….(అరుణా షాన్బాగ్)

  1. p.kusumai says:

    ఎందుకు మనకు కటినమైన శిక్షలు లేవు? ఎంత నేరం చేసినా చెలామణీ అయిపోవచ్చు అనే ధైర్యం ఎందుకు మన సమాజంలో ఉంది? పసిపిల్లల దగ్గర నుంచీ పండు ముసలిని కూడా వదలని ఈ క్రూరులను నడిరోడ్డులో నిలబెట్టి ఎందుకు శిక్షించరు?

  2. మానసికంగా ఎంత తీవ్ర ఆందోళనకు, షాక్ కి గురై ఉంటే అత్యాచారం వల్ల మతి స్థిమితం కోల్పోయి నలభై ఏళ్ళుగా అలా పడి ఉందో అరుణ?

    ఎంత ఘోరం? ఎంత విషాదం? ఎంత అన్యాయం? ఎంత అమానుషం? ఎంత దైన్యం?

    ప్రాణాలు సహజంగా పోయేవరకూ ఆమెను కాపాడుకుంటామన్న ఆ ఆస్పత్రి సిబ్బంది లో ఎంత దయ?ఎంత ప్రేమ?ఎంత కారుణ్యం?

    మీ పోస్టులోని ప్రతి లైనుతోనూ గొంతు కలపడం తప్ప మరేమీ చేయలేకపోతున్నా

    • సుజాత గారు: ఘోరాతి ఘోరం..తలచుకుంటేనే ఒళ్ళు జలదరించే ఘోరం..మనుషులం అని చెప్పుకోవటానికే సిగ్గుపడే ఘోరం..
      ఇంత ఘోరమైన లోకంలోనూ అక్కడో ఎక్కడో కాస్త మంచితనం…ఆ ఆస్పత్రి సిబ్బందకి మనం ధన్యవాదాలు చెప్పాలి, మానవత్వాన్ని ఇంకా బతికించినందుకు..

  3. అబ్బ ఎంత ఘోరం…అత్యాచారానికి గురి అయినప్పటి ఆవిడ మాన్సీక పరిస్థితి, తరువాతి కాలంలో ఆవిడ పడ్డ వేదన్స్ తలుచుకుంటేనే గుండె చెరువైపోతోంది. మీరు సంధించిన ప్రశ్నలకి డిటో పెట్టడం తప్ప ఏమి చెయ్యాలో తెలియట్లేదు.

  4. Ramya Royal says:

    mee blog chala bagundhi… naku chala nachindhi… nakuu blogging chesy alavatundhi kani, mela rayalenu.. Na paridhilo na subjects gurinchi matrame rayagalanu..
    It’s really an appreciable piece of work…

  5. Venkataramaiah says:

    Manasunu pindesinaa ghoramina sanghatanani aalochipajese vidhangaa akshareekarinchaaru. Congratulations.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s