ఏముంది నీ జీవితంలో, బతుకు బాగుపడటానికి?


ఏముంది నీ జీవితంలో, బతుకు బాగుపడటానికి?

 

జీవితమంతా ఎదురు చూసావు,
బతుకు బాగుపడుతుందేమోనని!
 
గుండెను బండ రాయితో బాది,
స్రవించిన రక్తాన్ని,
ఇంటికి వెల్లగా వేసావు.
మనసును ముక్కలు ముక్కలుగా చేసి,
చిత్రమైన చిత్రాలుగా,
ఇంటి గోడలకు తగిలించావు.
ఇదంతా త్యాగమనుకుని భ్రమపడి,
నిన్ను నువ్వు మోసం చేసుకున్నావు జీవితమంతా!
 
దేవుడి మందిరంలో,
ప్రతిష్టించి, పుజించాల్సిన ప్రేమనుబంధాలు,
అటకెక్కించి,
తుప్పు పట్టించి,
ఇంట్లోనే వున్నాయని తృప్తి పడ్డావు బతుకంతా!
 
పెరట్లో స్వార్ధాన్ని,
విత్తనాలుగా జల్లి,
అన్యాయాన్ని ఎరువుగా వేసి,
విషవృక్షాలను ఏపుగా పెంచి,
నోట్లకట్టలను గంపలనిండా ఎత్తి,
 ఆకలి తీరట్లేదని,
అర్రులు చాచావు జీవితమంతా!
 
ఆత్మసాక్షిని పునాది గోతుల్లో పాతిపెట్టి,
రాజభవనాన్ని నిర్మించి,
నివసించే చోటు లేదని,
వాపోయావు బతుకంతా!
 
నేల విడిచి సాము చేసి,
నిదుర మరచి పని  చేసి,
ఒళ్ళు గుల్ల చేసి,
ధనం పోగు చేసి,
అనుభవించట్లేదని,
ఆక్రోశిస్తూనే ఉన్నావు జీవితమంతా!
 
బంధించాల్సిన బంధాలు,
గాలికొదిలేసి,
ఎగిరిపోతున్నాయని,
ఫిర్యాదు చేస్తూనే ఉన్నావు బతుకంతా!
 
మూడు ముళ్ళను అపహాసం చేసి,
సహజీవనమే మేలనుకుని,
తోడేవరు లేక,
ఒంటరిగానే మిగిలావు జీవితమంతా!
 
విలాసాలే ముఖ్యమనుకుని,
సంపాదనే జీవతమనుకుని,
పల్లె విడిచి, పట్నమొచ్చి,
పట్నమిడిచి, పక్క రాష్ట్రమొచ్చి,
రాష్ట్రమిడిచి, పరాయి దేశమొచ్చి,
చివరకు ఎక్కడ మిగిలాము?
నిన్ను  నువ్వు కోల్పోయావు!
అందరికే దూరమయ్యావు!
 
యంత్రికతకు అలవాటైపోయిన,
నీకేం తెలుసు?
జీవితాన్ని ఆశ్వాదించడం!
 
అనుధినం చస్తూబతికే, 
నీకేం తెలుసు?
చావుపుట్టుకల విలువ?
ఏమి మిగిలి ఉంది నీ  జీవితంలో,
బతుకు బాగుపడటానికి???!!!

 

This entry was posted in కవితలు, జీవితం. Bookmark the permalink.

13 Responses to ఏముంది నీ జీవితంలో, బతుకు బాగుపడటానికి?

  1. Thnaks satya garu for responding..

  2. Mauli says:

    inta tragedy naa 🙂

  3. Mauli says:

    it is really heavy.. but i like first 2 and last 2 paras …

  4. Vamsi says:

    But what can we do……………. its a mechanical life, there is no other way except going tru the system…………… but finally as you said at some time in life, one will realize the meaning of the above or at least will undergo such tragedy or heaviness… surely!

  5. ravireddy says:

    very true….a true expression…chaalaa baagundi

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s