నా నేస్తమా నీకు కృతఙ్ఞతలు
నాకు నాకే తెలీకుండా,
నా మనసుకు దగ్గరయ్యావు,
నాలో నేనే లేనప్పుడు,
నువ్వు నన్ను లేపావు,
నన్ను నేను కోల్పోతున్నప్పుడు,
నువ్వు నన్ను నిలబెట్టావు,
నాలో నేను కుంచించుకుపోతున్నప్పుడు,
నువ్వు నాలో ప్రవేశించావు.
ఏ ప్రభాత సమయంలో,
ఏ సంధ్యా సమయంలో,
ఏ గోధూళి వేళలో,
నన్ను స్పందించావో,
ఆ స్పందన స్పందనగానే మిగిలిపోయింది నేటి దాకా.
నీతో చెప్పుకుంటేనే చాలు,
నా కష్టం అంతా తీరిపోతుందే,
నీతో పంచుకుంటేనే చాలు,
నా భాగం రెట్టింపైపోతుందే.
నా గొప్పలే కాదు,
నా తప్పులన్ని నీతో చెప్పుకోగలను,
మన్ననలు పొందగలను,
మందలింపులు పొందగలను.
అందలేని దూరంలో నువ్వున్నా,
అనుదినం నిన్ను కలవలేకున్నా,
అనుక్షణం నీతో మాట్లాడలేకున్నా,
నువ్వు నాకున్నావు,
అనే భావమే నా కెంతో భద్రత.
నా మనసు చిన్నబుచ్చుకున్నప్పుడు,
నా గుండె బారమైనప్పుడు,
నా కన్నీటితో పాటుగా,
నువ్వు ఉంటావు,
నన్ను కౌగిలించుకోవటానికి, ఓదార్చటానికి.
నాలో నేనే నువ్వు,
నువ్వు లేని నేను,
నేను కానే కాదు,
నేస్తమా, పదుల సంవత్సరముల నుంచీ నాతో స్నేహం చేస్తున్నందుకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు.
It’s so important to have a good friend, who is close to your heart, with whom you can share everything.
nice post
Thanks David garu..
meelo machi kavayitri undi…
snehaniki baga pramukyatha istunnaru….
gud…
ఇట్ ఇస్ సమె అస్ మై నేస్తం
Nani garu..Thanks andi