Monthly Archives: November 2011

చెమట వాసన (కధ)


చెమట వాసన మే నెలాకరు, ఎండలు మండి పోతున్నాయి. ఉక్కపోతతో జనాలు అల్లాడిపోతున్నారు. రోహిణికార్తెకు రోళ్ళు పగులుతాయంట, ఈ సంవత్సరం కొండలే పగులుతాయా అన్నట్లు ఉంది. నడి వేసవిలో మిట్ట మధ్యాహ్నం కారులో ప్రయాణం మొదలుపెట్టాను. ఏసి ఫుల్ స్పీడ్ లో తిరుగుతున్నా చల్లదనం సరిపోవట్లేదు. కారు డ్రైవ్ చేస్తుంటే, నున్నటి తారు రోడ్డు మీద … Continue reading

Posted in కధలు | 4 Comments

నమ్మకపు గాయాలు


నమ్మకపు గాయాలు నా గుండెలపై నుంచి  నిర్దాక్షిణ్యంగా నడుచుకుంటూ వెళ్ళిపోయావు నీవు వదిలిన వెళ్ళిన పాదముద్రలు ఇంకా పచ్చిగా రేగుతూనే ఉన్నాయి రగిలి రగిలి మండుతూనే ఉన్నాయి మానని గాయమూ మంచిదే గుణపాఠం  గుర్తుచేస్తుందనుకున్నా… కానీ మరిచిపోయినది మనుష్యులపై నమ్మకమని జీవితం గుర్తుచేస్తూనే  ఉంది…

Posted in కవితలు, కష్టం | 2 Comments

నువ్వు నేను కలిసినప్పుడు


నువ్వు నేను కలిసినప్పుడు నువ్వు నేను కలిసినప్పుడు కుశల ప్రశ్నల పలకరింపులతో కాలం గడిపేస్తాం…. కన్నీటిని కనురెప్పలతో కప్పెయ్యాలని కనుపాపతో గదంతా వెతుకుతాం… భారంగా దొర్లే క్షణాలను బరువైన చిరునవ్వుతో మరింత కుంగదీస్తాం… ఆమాట ఈమాట మధ్య వినిపించే నిట్టుర్పుతోనో ఆచూపు ఈచూపు మధ్య కనిపించే దాపరికంతోనో నడి సముద్రపు ఈతగాడిని తీరం చేరనివ్వం… నిశ్శబ్దపు అగాధాలు … Continue reading

Posted in కవితలు, కష్టం | 11 Comments

ఆ పెద్దమనిషి వదిలి వెళ్ళిన సద్దిమూట


ఆ పెద్దమనిషి వదిలి వెళ్ళిన సద్దిమూట వెళుతూ వెళుతూ ఏదో వదిలి వెళుతున్న బావన మనసూరుకోక వెనుదిరిగి మూల మూలలా వెతుకుతుంటే….. ఓ పెద్ద మనిషి భుజం తట్టి “ఎందాకా?” అని ప్రశ్నించారు ఎక్కడో చుసినట్టుందే…గుర్తురావటంలేదు ??!! సమాధానం చెప్పటం మరిచిపోయి ఆలోచిస్తూ ఉండిపోయా….. “సరి సరి వెళ్లిరా”, కళ్ళతోనే సైగ చేసి గుర్తుపట్టేలోపే మునుముందుకు … Continue reading

Posted in కవితలు, కష్టం, కాలం | 2 Comments

అంతర్ముఖంతో అంతర్మధనం


అంతర్ముఖంతో అంతర్మధనం నన్ను కౌగిలించుకుంటున్న చీకటి రాత్రుళ్ళలో రాలిపడుతున్న నక్షత్రాలు ఎన్నో ప్రశ్నలను సంధిస్తున్నాయి… నేను చేజార్చుకున్న వేకువ వెలుగులలో ఎగురుతున్న ఎన్నో పక్షులు సమాధానాలు వెతుకుతున్నాయి… నాలోతుల్లో ఏ మూలో దాక్కున్న అంతర్ముఖం పగలంతా నిద్రలో జోగుతూ రాత్రుళ్ళు కత్తులు దువ్వుతూ తలలు నరుకుతూ స్తైర్యవిహారం చేస్తుంది… ఎగిసిపడే ఆలోచనలలో తడిసి ముద్దయ్యే నన్ను నేను … Continue reading

Posted in కవితలు, కష్టం, జీవితం | 8 Comments

తాళం వెయ్యాల్సిన తలంపు


తాళం వెయ్యాల్సిన తలంపు చాలా కాలానికి తెరుచుకున్న తలుపుల నుంచీ తలంపు బయటకు బయలుదేరింది… అందమైన లాన్లు క్రమశిక్షణగా నాటిన మొక్కలు నీటిని వేదజిమ్ముతున్న ఫౌంటైన్ల నడుమ నియాన్ లైట్ల వెలుతుర్లో మెరుస్తున్న నున్నటి తారు రోడ్డుపై నడుస్తూ దారులు వెతుకుతుంటే సైన్ బోర్డులన్నీ నింగి నేల  కలిసే చోటుకే చూపిస్తున్నాయి…. రోడ్డుపై పలకరించ మానవుడు … Continue reading

Posted in కవితలు, జీవితం, నా అనుభవాలు | 9 Comments

సముద్రపుటోడ్డున జారిన ఇసుక


సముద్రపుటోడ్డున జారిన ఇసుక జీవితాన్ని గుప్పెట బంధించానన్న బ్రమను ఆస్వాదించక మునుపే వేళ్ళ సందులలో నుంచి జారిపోయింది ఇసుక రేణువులళ్ళే….. సంతోషపు అల తీరానికి చేరుతుందన్న ఆనందం ఒడ్డుకు చేరక మునుపే జారిన ఇసుకను తనలోకి లాగేసుకుంది ఈ మహా సముద్రం…

Posted in కవితలు, కష్టం | 1 Comment

దహన సంస్కారం


దహన సంస్కారం ఎక్కడో ఏదో కాలుతున్న వాసన ముక్కు పుటాలను కమ్మేస్తున్న పొగ శ్వాసలో  నా వాసన నాకే తెలుస్తున్న బావన దహనమైపోతున్నది ఎవరూ? నా అంతరాత్మ? కాదు కాదు…ఇది నేను కాదు ఎవరో ఎక్కడో…ఏమో నాకు తెలీదు ఎవరో ఏడుస్తున్న శబ్దం చెవులు రిక్కించి ఆలకిస్తున్నా ఎక్కడో విన్న గొంతులా ఉందే నేను నా … Continue reading

Posted in కవితలు, కష్టం, జీవితం | 2 Comments

నేస్తమా…ఆలకించు


నేస్తమా…ఆలకించు కష్టం ముద్దాడింది కన్నీరు చెరువయింది నేస్తమా….. నీ సమక్షంలో నన్ను కరువుతీరా మాట్లాడనీ మధ్యే మధ్యే మార్గాలు సూచించకు నువ్వు మనసు పెట్టి సాంతం ఆలకించు   నా తప్పొప్పులు ఎత్తి చూపుతూ సలహాలు మాత్రమే నువ్వు చెప్పు తేలికైన నా మనసు పరిష్కారాలు అదే వెతుక్కుంటుంది.. నేస్తమా…Just listen to me …..

Posted in కవితలు, కష్టం | 5 Comments