ఆ పెద్ద మనిషి


ఆ పెద్ద మనిషి

ఆ పెద్ద మనిషి
రచ్చబండపై ఆశీనుడై
మొగుడు పెళ్ళాల పంచాయితీ తీర్చాడు
పెళ్ళాన్ని ప్రేమగా చూసుకోమని మందలించి
మొగుడుకి అణుకువగా నడుచుకోమని సూచించి
ఇంటికి చేరాడు…..
కాళ్ళకు అంటిన సంస్కారాన్ని నీళ్ళతో కడిగేసుకుని
కండువా పెద్దరికాన్ని కొక్కానికి తగిలించి
“ఒసేయ్ ఎక్కడ చచ్చావ్”
ధర్మపత్నిని కేకేసాడు….

This entry was posted in కవితలు, జీవితం, పెళ్లి, మనిషి, మహిళ. Bookmark the permalink.

10 Responses to ఆ పెద్ద మనిషి

  1. ప్రవీణ గారూ పెద్దమనిషి సంస్కారాన్ని చాలా సూటిగా చెప్పారు. చెళ్ళున కొరడా ఝళిపించినట్లుగా వుంది. నాకు నచ్చింది.

  2. Hari Krishna Sistla says:

    Really a great man.
    However,రచ్చబండ”పై” ఆశీనుడై is not the proper usage,to the best of my knowledge. Rachhabanda may mean a court. If you could check the one.
    I swear if am mistaken.

  3. కమల్ says:

    ‘ ఏమ్రోయి..నోరు పెద్దదవుతుంది, ఓళ్ళు ఎలా ఉంది ” దొడ్లో నుండి ధర్మపత్ని ప్రతిస్పందన

  4. Valli says:

    Hahaha..nice post…

Leave a comment