Working Mother


వర్కింగ్ మదర్

ఆ చిన్ని చేతులు
నడుం చుట్టూ చుట్టేసి
కాళ్ళకు అడ్డం పడుతుంటే
బ్రతిమాలి, బామాలి
విసుక్కుని, కసురుకుని
నుదుటన ముద్దు పెట్టి
బయలుదేరింది ఆఫీసుకు ఆ తల్లి…

కీ బోర్డు ప్రెస్సులు
mouse క్లిక్కుల నడుమ
desktop పై నవ్వులు చిందిస్తున్న
ఆ చిన్నారి కళ్ళను చూస్తున్న
ఆ తల్లి మనసులో బెంగ
ప్రాజెక్ట్ డెడ్ లైన్స్
మరుగున మాయమయ్యే ప్రయత్నంలో
గూటికి గమ్మున చేరాలన్న ఆత్రంతో
వంచిన తలను మరి ఎత్తకుండా
పనిలో పరుగులు పెట్టింది ఆ ఉద్యోగి…

ఆ చిన్ని చేతులు
మెడ చుట్టూ చుట్టేసుకుని
బుగ్గపై పెట్టిన ముద్దుకే
అలసటంతా మాయమైపోయింది ఆ తల్లికి
“పనేక్కువగా ఉందా?”, ఆ పలకరింపుకే
ఎక్కడ లేని శక్తి వచ్చేసింది ఆ ఇల్లాలికి…

This entry was posted in అమ్మ, కవితలు. Bookmark the permalink.

3 Responses to Working Mother

  1. Hari Krishna Sistla. says:

    నుదుటను ఒక ముద్దు పెట్టి , Might have suited well instead నుదుటన ముద్దు పెట్టి shows the scarcity of the time,other wise to call,How busy she is.Same passion “ప్రాజెక్ట్ డెడ్ లైన్స్” can be replaced by Projectula Dead linelu (plural to show how busy she was).’Aa chinnari ‘ if was been replaced by ” ‘Tana Chinnaari ‘,shows the More attachment with ‘Her Kid’.“పనేక్కువగా ఉందా?”, “anna” aa palakrimpuke might have suited the situation well.

    Heart Touching.literature made by you. However suggestions made by me are to extract a good writer from you. Do not misunderstand please.

  2. justsrikar says:

    chala baagundi andi Hari Krishna Sistla cheppinavi kuda manchi maarpulu la unnai, oka sari savarinchi choodandi, nacchaka pothe vadileddam 🙂

Leave a comment