Monthly Archives: April 2011

మనిషి ఎంత చిత్రం, మనసు అంత విచిత్రం…


మనిషి ఎంత చిత్రం, మనసు అంత విచిత్రం… మనిషి ఎంత చిత్రమో, మనసు అంత విచిత్రం, ఆలోచనలు అనంతం, ఆశలు అపరిమితం, చేతలు మాత్రం పరిమితం, సప్త సముద్రాల నీటిని సిరాగా నింపి, నిఘంటువు ఆఖరి అక్షరంతో సహా లిఖిలించినా, ఇంకా లెక్కలేనన్ని విషయాలు మిగిలే ఉంటాయి. అంతా అర్థం అయ్యినట్టే అనిపిస్తూ, ఏమీ అర్థంకాని … Continue reading

Posted in కవితలు, జీవితం, నా ఆలోచనలు, మనిషి, సమాజంలో సామాన్యులు | 7 Comments

ఇంతేనా మనం?


ఇంతేనా మనం?? ఆలోచనల చిక్కుముడుల నడుమ, ఏమూలో చిక్కుకుపోయిన మనసును, ఆవేశపు ముళ్ళులు గుచ్చి గుచ్చి బాధిస్తుంటే, చేతకానితనం సానుభూతిగా చూస్తూ, ఎగతాళిగా వెక్కిరిస్తుంటే, స్వార్థానికి అసమర్ధత జతపరిచి, బాధ్యతకు నిర్లక్ష్యం తోడుచేసి, అసహాయతకు నిస్సహాయతను లంకె పెట్టి, నా పరిధిని నే సౌక్యంగా నిర్ణయించుకుని, తోచినట్టు నా చుట్టూ నే గిరి గీసుకుని, కర్తవ్యం … Continue reading

Posted in కలం, కవితలు | 7 Comments

నేస్తమా,ఈ క్షణాన్ని కరిగిపోనీ..


నేస్తమా,ఈ క్షణాన్ని  కరిగిపోనీ.. నేస్తమా, నీదికాని ఈ క్షణాన్ని కష్టంగా కరిగిపోనీ, ఈ ఒక్క క్షణాన్ని ఎలాగోలా సహించుకో, మరోక్కటంటే ఒక్కటే క్షణాన్ని ఓర్చుకో, వేదనల ఆవేదనల, ఆవేశపు ఆలోచనల, నిరాశ నిట్టుర్పుల, చిక్కు ప్రశ్నల వలయం, దానికదే విడిపోతుంది, పరిష్కారం లేని సమస్యే లేదుగా, కాలానికి కానరాని పరిష్కారమే లేదుగా. ఏ కష్టమైనా, నేడు … Continue reading

Posted in కవితలు, కష్టం, జీవితం | 3 Comments

నీకు నాకు మధ్య


నీకు నాకు మధ్య… నీకు నేను చేరువయ్యే క్రమంలో, నన్ను నేను పూర్తిగా కోల్పోతుంటే, నేను నీకు దగ్గరవుతున్ననేమో కానీ, నువ్వు నాకు దూరమవుతున్నవని గ్రహించుకో! సర్దుబాటు నాకే కాదు నీకు కూడా, కోపతాపాలు నీకే కాదు నాకు కూడా, మన్ననలు మన్నిపులు నాతో పాటు నీకు కూడా, పంతాలు పట్టింపులు నీతో పాటు నాకు … Continue reading

Posted in కవితలు, జీవితం | 23 Comments

కష్టాలున్నాయి అయితేనేం…


కష్టాలున్నాయి అయితేనేం…. గుండెనిండా కష్టాలున్నాయ్ మనసునిండా బాధలున్నాయ్ అయితేనేం! సూర్యోదయాన్ని ఆస్వాదించేద్దాం ఓ క్షణం వేకువ వెలుగులో కరిగిపోనీ కష్టాలు ఆ క్షణం చలి కాచుకో వెచ్చని వెలుతురులో… కళ్ళనిండా కన్నీరున్నాయ్ మధినిండా వేధనలున్నాయ్ అయితేనేం! వాన చినుకులలో గంతులేసేద్దాం ఓ క్షణం కొట్టుకుని పోనీ కన్నీటిని ఆ క్షణం తడిసి ముద్దవనీ ఆనంద బాష్పాలని… ఆశల … Continue reading

Posted in కవితలు, కష్టం, జీవితం, ప్రకృతి సృష్టి, మనిషి | 13 Comments

పిల్లల పెంపకంలో నిర్లక్ష్యం చేస్తున్న కొన్ని చిన్నవిషయాలు


  పిల్లల పెంపకంలో నిర్లక్ష్యం చేస్తున్న కొన్ని చిన్నవిషయాలు కొన్ని తరాల క్రితం వరకు “division of work” అనేది ఆడ, మగ వారి మధ్య సరిసమానంగా ఉండేది. ఆడవారు ఇంటి పనులు చక్కబెడితే, మగవారు బయటి పనులు చూసేవారు. నేటి తరంలో అందరూ అన్ని పనులు చెయ్యవలిసిందే. మహిళలు ఇంటా, బయటా అన్ని పనులు చెయ్యాల్సిందే. మగవారు బయటి పనులతో పాటు ఎంతో కొంత ఇంటి పనులు అందుకోవలిసిందే. … Continue reading

Posted in జీవితం, నా ఆలోచనలు, వ్యాసాలు | 1 Comment

వెలుగు కోసం వెతుకులాట


వెలుగు కోసం వెతుకులాట       చీకటిని చీల్చుతూ, వెలుగు కోసం వెతుకులాట, వెలుగు ఓ వింత, ఆమడ దూరంలో కానవస్తూ, అలసి సొలసి పోయినా, అందుకోలేని ఆగమ్యగోచరం.   చిమ్మ చీకటిలో, లాంతరు చేతబట్టి, వెలుతురని భ్రమపడి, భ్రమలో బతికేస్తూ, ఏనాటికో భ్రమలు తొలిగి, నిజం నిక్కచ్చిగా నిలదీసే వరకు, కాలం కరిగిపోతూ, జీవనం సాగుతూనే ఉంటుంది.   నిజం నిజమని తెలిసిన నాడు, భూభ్రమణం ఆగిపోదు, … Continue reading

Posted in జీవితం | 3 Comments

మా గురించి మీకు పూర్తిగా తెలుసా?


మా గురించి మీకు పూర్తిగా తెలుసా? లోకమంతా మాలోనే, మేమే లోకమంతా, ప్రేమ, ద్వేషం, కరుణ, కాటిన్యం, సౌమ్యం, కఠినం, సుఖం, కష్టం, అమాయకత్యం, గడుసుతనం, అన్నీ సమపాళ్ళలో కలబోసినా సృష్టి రహస్యం. దైవం మనసు పెట్టి, మెళుకువలు నేర్చి, పదిలంగా తీర్చిదిద్దిన ప్రాణులము, వనితలము, మహిళలము, స్త్రీలము. పుత్రికలము,         ఈడపిల్లలము మేమే,         … Continue reading

Posted in మహిళ | 17 Comments

పరుగులు పరుగులు…


పరుగులు పరుగులు… పరుగులు, పరుగులు, నేటి కాలంలో బతకడానికి కాలంతో పరుగులు, శరీరం కాదు, మనసు అలిసిపోయే పరుగులు, సుతిమెత్తని మనసు బండబారిపోయే పరుగులు, హృదయ స్పందనలకు స్పందిచలేని పరుగులు, ఆలోచనల ప్రవాహానికి ఆనకట్ట వేసే పరుగులు, కోరికలకు కల్లాలు లేక, ఆశల వెనుక పరుగులు,   ప్రవాహానికి ఎదురీద లేక, ఎదురీత తెలిసినా, ఎదురీదే సాహసం లేక, ఎదురీదితే వెనుక పడిపోతామేమోనన్న భయంతో, … Continue reading

Posted in అమ్మ, కవితలు, కష్టం, జీవితం | 4 Comments

గెలిచారోచ్, గెలిచారోచ్ కప్పు మాత్రమే కాదు…


గెలిచారోచ్, గెలిచారోచ్ కప్పు మాత్రమే కాదు…. గెలిచారోచ్, గెలిచారోచ్, మనాళ్ళు గెలిచారోచ్, మనందరినీ గెలిపించారోచ్, యావత్ దేశం గర్వంగా ఉప్పొంగిపోగా, జై జై ద్వానాలతో దేశం దద్దరిల్లగా, ప్రపంచ కప్పు మన ఒడిలో ఒదిగిపోగా, ముక్త కంఠంతో మనమంతా ఒక్కటని, ఇది మన దేశ విజయమని, మనం భారతీయులమని మురిసిన మధుర క్షణం, కప్పు సాధించిన … Continue reading

Posted in ప్రజాస్వామ్యం, సమాజంలో సామాన్యులు | 2 Comments