Category Archives: మౌనం

నిశ్శబ్దం మాట్లాడింది


నిశ్శబ్దం మాట్లాడింది అ వేళ, సద్దు లేని పొద్దులో ఎద నిశ్శబ్దంలో ఓలలాడింది. సవ్వడి లేని ప్రశాంతంలో మనసు మధురిమలు పలికింది. ఆ వేళ, ధ్వని లేని ద్వారంలో మౌనం రారమ్మని పిలిచింది. సడి లేని సౌధంలో ఏకాంతం ఆతిధ్యమిచ్చింది. ఆ వేళ, కనురెప్పల రెపరెపలు ఊసులాడాయి ముంగురులు నుదుటిపై గుసగుసలాడాయి ఉచ్ఛ్వాస  నిచ్ఛ్వాసలు కబుర్లాడుకున్నాయి … Continue reading

Posted in కవితలు, జీవితం, మౌనం | 3 Comments

నా మౌనమే నీ నెపమా?


నా మౌనమే నీ నెపమా?   నా మౌనమే నీ నెపమా ప్రియా, అయితే, మరి విను నా బాధ, నా పెదాలు పలికితేనే, నీ చెవులు ఆలకించి, నీ హృదయానికి చేరవెయ్యాలా నా బావాన్ని? మౌనంగా నా కళ్ళు, నీ మనసుతో మాట్లాడట్లేదు? నీ హ్రదయం వినట్లేదు? అది నిజం కానప్పుడు, నా మాటలు పెడర్ధాలుగా మారి, … Continue reading

Posted in కవితలు, మౌనం | 1 Comment

మౌనం, మాటల ఘర్షణలో….


మౌనం, మాటల ఘర్షణలో….   నీ మౌనం నా మనసును గాయం చేసినప్పుడు, శూన్యంలో మాటలు వెతకలేక, నేను మూగబోయినప్పుడు, మాటల వర్షం కురిపిస్తావు. హృదయం కరిగి, మౌనం వీడి, నా మాటల ప్రవాహంలో, నీ హృదయం తడిపెయ్యాలని, మరోసారి  ప్రయత్నం చిగురేసి, చుట్టూ చూసే లోపు, కనుచూపు అంచుల్లో ఉంటావు, హృదయపు అంతులను మాత్రమే, తాకగల నా చిరుసవ్వడి, నీ చూపుల్లో చులకన. చిరుసవ్వడి పెనువేధనై, పల్లకీలో ఊరేగుతుంది, నా హృదయ పరిధిలో. ఈ పరిధి దాటలేని నా నిస్సహాయత, ఎన్నటికి అర్థం చేసుకుంటుందో, నోరు పలికే పలుకుల కన్నా, హృదయం చెప్పే మౌనమే మేలని. … Continue reading

Posted in కవితలు, జీవితం, మౌనం | 8 Comments