Category Archives: మనిషి

వలయం


వలయం ఏదో  ద్రవంలో  తేలియాడుతున్నాను చేతి వేళ్ళు కదలాడుతున్నాయి కాళ్ళ కదలికలు మొదలయ్యాయి కనురెప్పలు విడిపడుతున్నాయి కనులు మూసినా తెరిసినా, అదే చీకటి! ఏదో ప్రవాహపు హోరు ఆలకిస్తూ బొడ్డుతాడు చుట్టూ తిరిగేస్తూ నాకు మాత్రమే సరిపోయే చోట నేను మాత్రమే ఉన్నాను! అమ్మ గర్భమంట ఎంత భద్రంగా ఉందీ చోటు! అమ్మ..అమ్మ…ఎలా ఉంటుందో? గొంతు … Continue reading

Posted in కవితలు, కష్టం, కాలం, జీవితం, మనిషి, Uncategorized | 6 Comments

ఎవరు?


ఎవరు? హృదయాంతరాలలో శూన్యతను పదే పదే   గుర్తుచేస్తున్నదెవరు? కనురెప్పల మాటున కన్నీటిని ఫ్రీజ్ చేయ్యమంటున్నదెవరు? చిరునవ్వును పెదవులపై అతికించమంటున్నదెవరు? ఉలిక్కిపాటు భద్రతను ఊహల్లో కల్పిస్తున్నదెవరు? ఇంటిపక్కన ఇల్లెవరిదో తెలియని కమ్యూనిటీలు నిర్మిస్తున్నదెవరు? బానిసత్వాన్ని బోధిస్తున్న విధ్యా విధానాలకు రచిస్తున్నదెవరు?  స్త్రీత్వానికి సుకుమారాన్ని అంటగడుతున్నదెవరు? పురుషత్వానికి కఠినత్వం కొలబద్దచేస్తున్నదెవరు? వేళ్ళసందుల్లో నుంచి జారిపోతున్న స్వేచ్ఛను గుప్పిట్లో నింపుతున్నదెవరు? కిటికీలు మూసేసిన గది గోడలకానుకుని ఆలోచిస్తున్న మేధావులెవరు? నగ్నత్వాన్ని చూడలేక కళ్ళు ముసుకుంటున్నదెవరు? ఎవరు? ఎవరు?…..సమాధానాల కొరకు మరికరిని  వెతకాలా?

Posted in కవితలు, కష్టం, మనిషి, సమాజంలో సామాన్యులు | 4 Comments

బాధ్యత?


బాధ్యత? ఆ మూల ఎవరో రోధిస్తున్నారు మూలమూలలా సానుభూతి ఒలికిపోతోంది సలహాలు వల్లెవేయబడుతున్నాయి అందరూ ఆకాశం వైపు పదే పదే చూస్తున్నారు ఆదుకునే హస్తం ఊడి పడుతుందని… మన్ను అంటని చేతుల్లో పరిధి దాటని బాధ్యత! కష్టమంటే పారిపోయే మనస్సులో మనకెందుకులే అంటోంది బాధ్యత Social responsibility…..అదో fashion ఈరోజుల్లో ఎవరికి వారు అందరూ ఒప్పే … Continue reading

Posted in కవితలు, మనిషి, వ్యాసాలు, సమాజంలో సామాన్యులు | 2 Comments

ఆ పెద్ద మనిషి


ఆ పెద్ద మనిషి ఆ పెద్ద మనిషి రచ్చబండపై ఆశీనుడై మొగుడు పెళ్ళాల పంచాయితీ తీర్చాడు పెళ్ళాన్ని ప్రేమగా చూసుకోమని మందలించి మొగుడుకి అణుకువగా నడుచుకోమని సూచించి ఇంటికి చేరాడు….. కాళ్ళకు అంటిన సంస్కారాన్ని నీళ్ళతో కడిగేసుకుని కండువా పెద్దరికాన్ని కొక్కానికి తగిలించి “ఒసేయ్ ఎక్కడ చచ్చావ్” ధర్మపత్నిని కేకేసాడు….

Posted in కవితలు, జీవితం, పెళ్లి, మనిషి, మహిళ | 10 Comments

అడుగులు


అడుగులు ఎక్కడి నుంచో లీలగా ఏదో శబ్దం నవ్వులా? ఏడుపులా ? అస్పుస్టంగా ఏదో దృశ్యం ఆలింగనాలా? తోపులాటలా? నాలుగడుగులు వేసా నలుగురు కూర్చొని నవ్వుకుంటున్నారు ఆనందమేసింది…. ఇంకా ఏదో వినిపిస్తోంది మరో పదడుగులు వేసా పాతిక మంది తన్నుకుంటున్నారు అరుపులు కేకలు…. ఇంకా ఏదో  హృదయ విదారకమైన  శబ్దం మరో పాతికడుగులు వేసా వందలమంది … Continue reading

Posted in కవితలు, కష్టం, ప్రజాస్వామ్యం, మనిషి | 2 Comments

బతుకు సమరంలో కొన్ని కొన్ని…


బతుకు సమరంలో కొన్ని కొన్ని…   బతుకు సమరంలో జీవించాలంటే,  కొన్ని తప్పులు చెయ్యనే చెయ్యకూడదు, చేసామా, సరిదిద్దుకునే అవకాశం రానే రాదు.   కొన్ని చెయ్యాల్సిన పనులు చెయ్యల్సినప్పుడే చేసే తీరాలి, చెయ్యలేదా, ఆ పనులు చెయ్యాల్సిన అవకాశం రానే రాదు.   కొన్ని గాయాలు తగలనే తగలకూడదు, తగిలాయా, ఆ గాయాల మచ్చలు మాననే మానవు.   కొన్ని విభేదాలు రానే రాకూడదు, వచ్చాయా,ఆ … Continue reading

Posted in కవితలు, జీవితం, మనిషి | 2 Comments

అవును నిజమే, గొప్పే….. మరి?


అవును నిజమే, గొప్పే….. మరి? ప్రపంచాన్ని గుప్పెటలో బంధించాము, అవును నిజమే, గొప్పే….. మరి, గుప్పెడంత గుండెలో ఏమి బంధించావు? ప్రపంచీకరణతో ప్రపంచాన్ని పల్లెటూరు చేసాము, అవును నిజమే, గొప్పే….. మరి, సొంతూరు అనుభందం, ఆత్మీయత ఉందా? ఆదేశం, ఈదేశం అన్ని దేశాలు చుట్టివచ్చాము, అవును నిజమే, గొప్పే….. మరి, నీ దేశంలో నీ వాళ్ళ … Continue reading

Posted in కవితలు, జీవితం, మనిషి | 3 Comments

స్వేచ్ఛ హక్కా? అనుగ్రహమా?వరమా? శాపమా?


స్వేచ్ఛ హక్కా? అనుగ్రహమా?వరమా? శాపమా? జీవితపు మనసులోని స్వచ్ఛత నుంచీ స్వేచ్ఛ తప్పిపోయింది, తప్పిపోయిన స్వేచ్ఛను వెతుకుతుంటే, నా మనసు, నా మధిని కొన్ని ప్రశ్నలు అడిగింది, స్వేచ్ఛ హక్కా? అనుగ్రహమా? స్వేచ్ఛ వరమా? శాపమా? హద్దులు లేని స్వేచ్ఛ ఎక్కువ ప్రమాదమా? కనీసపు స్వేచ్ఛ కరువైన బతుకు ఎక్కువ భారమా? స్వేచ్ఛను వెతకటం పక్కన … Continue reading

Posted in కవితలు, ప్రజాస్వామ్యం, మనిషి, సమాజంలో సామాన్యులు | 4 Comments

మనిషి ఎంత చిత్రం, మనసు అంత విచిత్రం…


మనిషి ఎంత చిత్రం, మనసు అంత విచిత్రం… మనిషి ఎంత చిత్రమో, మనసు అంత విచిత్రం, ఆలోచనలు అనంతం, ఆశలు అపరిమితం, చేతలు మాత్రం పరిమితం, సప్త సముద్రాల నీటిని సిరాగా నింపి, నిఘంటువు ఆఖరి అక్షరంతో సహా లిఖిలించినా, ఇంకా లెక్కలేనన్ని విషయాలు మిగిలే ఉంటాయి. అంతా అర్థం అయ్యినట్టే అనిపిస్తూ, ఏమీ అర్థంకాని … Continue reading

Posted in కవితలు, జీవితం, నా ఆలోచనలు, మనిషి, సమాజంలో సామాన్యులు | 7 Comments

కష్టాలున్నాయి అయితేనేం…


కష్టాలున్నాయి అయితేనేం…. గుండెనిండా కష్టాలున్నాయ్ మనసునిండా బాధలున్నాయ్ అయితేనేం! సూర్యోదయాన్ని ఆస్వాదించేద్దాం ఓ క్షణం వేకువ వెలుగులో కరిగిపోనీ కష్టాలు ఆ క్షణం చలి కాచుకో వెచ్చని వెలుతురులో… కళ్ళనిండా కన్నీరున్నాయ్ మధినిండా వేధనలున్నాయ్ అయితేనేం! వాన చినుకులలో గంతులేసేద్దాం ఓ క్షణం కొట్టుకుని పోనీ కన్నీటిని ఆ క్షణం తడిసి ముద్దవనీ ఆనంద బాష్పాలని… ఆశల … Continue reading

Posted in కవితలు, కష్టం, జీవితం, ప్రకృతి సృష్టి, మనిషి | 13 Comments

కోపానికి అటు ఇటు…


:కోపానికి అటు ఇటు: కోపానికి అటు: 1 . అకారణంగా నాకు కోపం రాదు కదా. చిన్నదో పెద్దదో ఏదో కారణం ఉండే ఉంటుంది కద. ఆ కారణం నీకు చిన్నగా అనిపించవచ్చు, నాకేమో పెద్దగా కనిపించవచ్చు. 2 .  నాకు కోపం తెప్పించే పనులే ఎందుకు చేస్తావు నువ్వు? 3 . నువ్వు కాబట్టే కద నా కోపాన్ని చూపించ గలుగుతున్నాను. అదే పరాయి వాళ్ళ ముందు ఇలా నోరు పరేసుకోగలనా? 4 . ఆ కాసేపు నన్ను భరించగలిగితే, … Continue reading

Posted in జీవితం, మనిషి | 11 Comments

మనిషితనం ఇంకా మిగిలేవుంది(దా)!?


మనిషితనం ఇంకా మిగిలేవుంది(దా)!? కన్నుల్లో కడపటి కన్నీటి చుక్క, కనుసంధుల్లో ఇంకా  మిగిలేవుంది(?). గుండెల సవ్వడి, లీలగా ఇంకా వినిపిస్తూనే ఉంది(?). మనసులో స్పందన, చావుబతుకుల మధ్య ఇంకా బతికే ఉంది(?). మధిలో మంచితనం, చేదైన మందులు మింగుతూ, భారంగా బతుకీడుస్తూనే ఉంది. మనిషి మనిషికీ అనుబంధం, అణువై, పరమాణువై, కృశించుకుపోయినా, ఇంకా పూర్తిగా అంతరించుకుపోలేదు. … Continue reading

Posted in కవితలు, మనిషి | 2 Comments