Category Archives: పెళ్లి

ఓ పెళ్లి


ఓ పెళ్లి పిలుపులు అయిపోయాయి. పోస్టులో పంపించాల్సిన శుభలేఖలు వెళ్ళాయి , బొట్టు పెట్టి పిలవాల్సిన దగ్గరి బంధుమిత్రులను పిలవటం దాదాపుగా అయింది. ఇంక షాపింగ్ హడావుడి గురించైతే చెప్పనే అక్కర్లేదు. పీటలపై జంటను కుర్చోపెట్టే క్షణం ముందు వరకూ ఎవరో ఒకరు ఎదో ఒకటి కొంటూనే  ఉంటారు పెళ్లి పేరున. పెళ్లికొడుకు సపరివారసమేతానికి పట్టు … Continue reading

Posted in నా ఆలోచనలు, పెళ్లి, వ్యాసాలు | 18 Comments

ఆ పెద్ద మనిషి


ఆ పెద్ద మనిషి ఆ పెద్ద మనిషి రచ్చబండపై ఆశీనుడై మొగుడు పెళ్ళాల పంచాయితీ తీర్చాడు పెళ్ళాన్ని ప్రేమగా చూసుకోమని మందలించి మొగుడుకి అణుకువగా నడుచుకోమని సూచించి ఇంటికి చేరాడు….. కాళ్ళకు అంటిన సంస్కారాన్ని నీళ్ళతో కడిగేసుకుని కండువా పెద్దరికాన్ని కొక్కానికి తగిలించి “ఒసేయ్ ఎక్కడ చచ్చావ్” ధర్మపత్నిని కేకేసాడు….

Posted in కవితలు, జీవితం, పెళ్లి, మనిషి, మహిళ | 10 Comments

అతడు ఆమె —- ఆ బంధం


అతడు ఆమె —- ఆ బంధం అతను ప్రేమిస్తున్నానన్నాడు ఆమె అపనమ్మకంగా చూసింది నువ్వే ప్రాణం, నీతోనే జీవితమన్నాడు ఆమె మనసు కరిగి, ప్రేమ ఉప్పొంగింది బంధం ముడిపడింది….. చట్టాపట్టాలేసుకుని జీవితపు నావలో ఆనందపు తీరాలకు చేరాలని కలలు కంటూ సాగారు కొంత కాలం….     అలల ఆటుపోటులు కలలను కుదపటం మొదలుపెట్టాయి అతనిలో … Continue reading

Posted in కవితలు, కష్టం, జీవితం, పెళ్లి, మహిళ, సగటు ఆడపిల్ల | 18 Comments

పెళ్లి బంధమా? ప్రతిబంధకమా?


పెళ్లి బంధమా? ప్రతిబంధకమా?   మూడు ముళ్ళు, ఏడడుగులు, మంగళ సూత్రాలు, మట్టెల, లెక్కలు తెలీవు కానీ, మనుషులను మనసులతో ముడివేసే బంధం, ఆత్మీయతను బంధించే అనుబంధం, కష్టనష్టాల ఆటుపోటులలో కొట్టుకుపోకుండా, ఆసరాగా ఆదుకునే అనురాగం.   తప్పొప్పుల కలగాపులగంలో, ఓ తప్పు, ఓ మాట, నిప్పులా దాహించేసినా, మరో ఒప్పు, మరో మౌనం, నిప్పుతో కడిగిన నిజాలే.   ఓ రోజు విసుగనిపించినా, ఓ క్షణం వద్దనిపించినా, మరో రోజు అక్కున చేర్చుకుని, మరో … Continue reading

Posted in కవితలు, పెళ్లి, Uncategorized | 12 Comments