Monthly Archives: August 2012

ఆమె – 2


ఆమె – 2 ఉరికే జలపాతం ఆ కొలువులో పారే సెలయేరు తన లోగిలిలో సూరీడుతో సావాసం కాలంతో సహవాసం పరుగు పరుగుల ఆరాటం అలుపెరగని అస్తిత్వపు ఆశయం ఆమెది … కంటతడిని గుండె అడుగున గుండె వ్యధను మునిపంటి అంచున దాచేసి, కన్నుల్లో స్తైర్యం చేతల్లో విశ్వాసం చెరగని చిరునవ్వు శక్తిగా అహంకారానికి ఎదురు … Continue reading

Posted in కవితలు, మహిళ | 2 Comments

కవిత్వమంటే?..ఏమో…


కవిత్వమంటే?..ఏమో… విషాదం నిద్రిస్తున్నప్పుడు అక్షరాలు మేల్కొంటాయి పదాలలో ఒదిగిపోయి వాక్యలు ఒకదాని వెనుక మరొకటి పరుగులు పెడతాయి ఈ భావాల వెల్లువను కవిత్వమనోచ్చా? ఏమో…నాకైతే తెలిదు! I call it as flow of emotions సంతోషం ఉరకలేస్తున్నప్పుడు ఎగిరెగిరిపడే మనుసును కూసిన్ని అక్షరాలతో అభిషేకిస్తాను కొండంత తృప్తి పధిల పరుచుకోవటానికి. అలా..అల్లిబిల్లిగా అల్లేసిన పదాలను … Continue reading

Posted in కవితలు, నా అనుభవాలు | 3 Comments

పుటలు


పుటలు  ఈ పుస్తకంలో నిర్ణీత కాలం గడిచాక పక్కకు తిరిగిపోయే ఎన్నో ఎన్నో పుటలు నిన్నటి పేజీలో మరి రాయలేను రేపటి పుటలో ఏమి రాస్తానో తెలీదు. నేను, తెల్లకాగితం నేడు నా ముందున్నాయి… అమ్మ కౌగిలి, కాగితం పడవ నెమళీక, ప్రేమలేఖ భద్రంగా దాచేసుకున్నా గడిచిపోయిన పుటలలో … ఎదురుదెబ్బ, నిట్టూర్పుల సెగ, గుణపాఠాల … Continue reading

Posted in కవితలు, జీవితం, నా అనుభవాలు | 1 Comment

ఇంటికెళ్ళి వచ్చాక….


ఇంటికెళ్ళి వచ్చాక…. రాత్రంతా వర్షం కురిసి ఇప్పుడే వెలిసినట్టుంది తడిసిన గుమ్మం చెమ్మగిల్లిన వాకిలి స్వాగతం పలికాయి. సన్నజాజి తీగ, మల్లె మొగ్గ, చిరుగాలి స్పర్శ ఆ ఆవరణంతా ప్రేమమయమే! “బాగున్నావా తల్లి?”, “అలా చిక్కిపోయావే?” ఆర్ధ్రత నిండిన పలకరింపుల అమృతాలే! నాన్న పడక్కుర్చీ అమ్మ గాజుల మోత వంటింట్లో తాలింపు వాసన వరండాలో బంధువుల … Continue reading

Posted in కవితలు, జీవితం, నా అనుభవాలు | 10 Comments