Monthly Archives: July 2012

వలయం


వలయం ఏదో  ద్రవంలో  తేలియాడుతున్నాను చేతి వేళ్ళు కదలాడుతున్నాయి కాళ్ళ కదలికలు మొదలయ్యాయి కనురెప్పలు విడిపడుతున్నాయి కనులు మూసినా తెరిసినా, అదే చీకటి! ఏదో ప్రవాహపు హోరు ఆలకిస్తూ బొడ్డుతాడు చుట్టూ తిరిగేస్తూ నాకు మాత్రమే సరిపోయే చోట నేను మాత్రమే ఉన్నాను! అమ్మ గర్భమంట ఎంత భద్రంగా ఉందీ చోటు! అమ్మ..అమ్మ…ఎలా ఉంటుందో? గొంతు … Continue reading

Posted in కవితలు, కష్టం, కాలం, జీవితం, మనిషి, Uncategorized | 6 Comments

విరామం


ATA Souvenir 2012  పత్రికలో వచ్చిన నా కవిత “విరామం”….పేజి నెంబర్ 142 నేను ఎవరో తెలియకపోయినా, నన్ను ఈమెయిలు లో  కాంటాక్ట్ చేసి, ఫోన్ నెంబర్ తీసుకుని కాల్ చేసి రాయమని ప్రోత్సహించిన శర్కరి బ్లాగర్ జ్యోతిర్మయి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు.. విరామం మనసు అలసట మదికి  తెలుస్తూనే ఉంది తనువు బడలిక భారమై … Continue reading

Posted in కవితలు, గుర్తింపు | 6 Comments

నిశ్శబ్దం


నిశ్శబ్దం నా చుట్టూ నిశ్శబ్దపు రాజ్యం రాణిని నేనే, దాసిని నేనే! ఆలోచనల అలల్లో తీరం చేరితే సామ్రాజ్యమంటాను! ఆశల వలలో చిక్కుకుపోతే నడిసముద్రమంటాను! నుదుటి స్వేదం గుండెలపైకి జారి నిశ్శబ్దాన్ని చిద్రం చేస్తుంది అంతే వేగంగా తటాకంలోని గులకరాయి బుడుంగున మునిగిపోతుంది…. ఏ పలకరింపో ఓ శబ్ద తరంగాన్ని అలా మోసుకొచ్చి చుట్టపుచూపులా ఇలా … Continue reading

Posted in కవితలు, జీవితం | 3 Comments