Monthly Archives: June 2012

ఆ జ్ఞాపకాలు


ఆ జ్ఞాపకాలు ఊగిసలాడుతున్న ఆ జ్ఞాపకాలు ఊడిపడిపోతే ఎంత బాగుండు! రెప్పల్లో ఇరుక్కున్న ఆ నలుసు ఒకేసారి కన్నీటిలో కొట్టుకుపోతే ఎంత బాగుండు! ఎన్నిసార్లు అనుకుంటానో, ఆ క్షణాలు తిరిగి రాయగలిగితే చాలని! ఆ అనుభవాల శకలాలు అసలేం మిగలనట్టు శిధిలమయితే చాలని! తడమకపోయినా తట్టిలేపుతున్న ఆ తలపులు పాతుకుపోయిన ఆ గురుతులు వెంటాడుతూనే ఉంటాయి…

Posted in కవితలు, కష్టం, జీవితం | 7 Comments

అబ్సర్డ్ పైయింటింగ్


అబ్సర్డ్  పైయింటింగ్ మనసు పొరలలో నిక్షిప్తమైన బావాలు కుంచె కొసలకు వేళాడి వేళాడి ఏ కలనో జారిపడి అలుక్కుపోయిన రంగుల కలబోత వృత్తాల గర్భాల్లో అనంతాలు వంకరటింకర గీతల్లో భావోద్వేగాలు మోహమో, వ్యామోహమో ప్రేమమయమో, ద్వేషపూరితమో జీవమో, జీవచ్చవమో ఏమో ఏవేవో అర్థాలు అంతులేని అయోమయాలు హృదయాంతరాలలో ప్రకంపనల అలజడి లేపి లేపి ఆలోచనల అలలు … Continue reading

Posted in కవితలు, జీవితం | 2 Comments