Monthly Archives: May 2011

ఆలోచిస్తూ…


ఆలోచిస్తూ… నా ఆలోచనల మహాప్రవాహంలో, నేనో నీటి బిందువును, ఉధృతంగా ఉప్పొంగే ఓ నాడు, ప్రశాంతంగా సాగే మరో నాడు, అనుధినం ఓ శోధన, శోధనలో వేదన, వేదనలో ఆనందాన్ని ఆస్వాదిస్తూ, ఆలోచిస్తూ….. మనసు గర్భంలో శిశువునై, ఊహల ఉమ్మనీటిలో తేలియాడుతూ, ఊసులాడే గుండె లయకు తలాడిస్తూ, అనుభవాల రక్త ప్రసరణ ఘోషలో, అనుభూతులను వెతుక్కుంటూ, … Continue reading

Posted in కవితలు, నా ఆలోచనలు | 1 Comment

ప్రేమగా తాకి వెళ్ళిన పవనం (పరిచయం)


ప్రేమగా తాకి వెళ్ళిన పవనం (పరిచయం) ఎచట నుంచో, అనురాగపు శీతల పవనం, ఆప్యాయతను ఆదరంగా మోసుకొచ్చి, ప్రేమను నిలువెల్లా ఒలకపొస్తూ, మనసుని మధురంగా తాకింది. గాలికి చెదిరిన ముంగురులు, నుదిటిపై అల్లరి చేస్తుంటే, ముద్దుగా విసుక్కుని, కనులు మూసుకుని, మనసారా ఆస్వాదించి, కనులు తెరిసేటప్పటికి,  వయ్యారంగా ఊపుకుంటూ వెళ్ళిపోయింది. చిన్న నిట్టూర్పుతో, చిరునవ్వు సాయంతో, … Continue reading

Posted in కవితలు, జీవితం, Uncategorized | 3 Comments

వసారా మెట్లు ఎక్కి వచ్చి ….పెరటి మెట్లు దిగి వెళుతూ …


వసారా మెట్లు ఎక్కి వచ్చి ….పెరటి మెట్లు దిగి వెళుతూ … అందమైన ఓ రూపం, వసారా మెట్లు ఎక్కి వచ్చి, మనసులోకి ప్రవేశించి, పెరటి మెట్లు దిగి వెళ్తూ, జీవితంలో నుంచి నిష్క్రమించి, శూన్యాన్ని మిగిల్చింది. నిశ్శబ్దపు నిశీధిలో, వ్యధ శబ్దం, వాయువులా విహరించింది. ఎండిన గుండెలను, ఇంకా ఇంకిపోని, కన్నీటి చెమ్మ తడిచేసింది. … Continue reading

Posted in కవితలు, కష్టం, జీవితం | 7 Comments

మనసు కావ్యం


మనసు కావ్యం భావాల కలంలో, అనుభూతులు సిరాగా నింపి, జీవితపు పుటలపై, లిఖిద్దామని, మనసు గాధ వింటుంటే, మంత్రాలు ఘోశిస్తున్నట్టు ఉందేమిటి? మనిషి కధ రాస్తుంటే, వేదాలు తిరగ రాస్తున్నట్టు ఉందేమిటి? పన్నీరు అద్దిన, సువాసనలు వెదజల్లుతున్న పేజీలు, కన్నీరు ఒలికి, చెదిరిన పదాల అక్షరాలు, కంటిని ఆకట్టుకునే చిత్రాలు, గుండెను పిండేసే వ్యాక్యలు, నవ్వులు చిందించే హాస్యాలు, … Continue reading

Posted in కలం, కవితలు, కాలం | 7 Comments

కష్టం కాలం సుఖం


కష్టం కాలం సుఖం   కన్నీరు ఉప్పెనలా ఉప్పొంగి, ఈ క్షణాన్ని ముంచెత్తింది, కొట్టుకుపోతున్న సమస్తంలో, మరో క్షణం కలిసిపోయింది.   శిధిలాల నడుమ, కాలం ఒంటరిగా మిగిలింది, కొనప్రాణం మిగిలి ఉన్న సెకను ముళ్ళు, దేకుతూ పాకుతూ, నిమిషాల ముళ్ళును నెట్టింది, నెమ్మదిగా కదిలిన నిమిషం, మెలమెల్లగా సత్తువను కూడగట్టుకుని, గంటల ముళ్ళుతో జతకట్టింది.   ఇక అంతే, సెకను వెనుక నిమిషం, నిమిషం వెనుక గంటలు, పరుగులు పెడుతూనే ఉన్నాయి.   కష్టం, కాలం, సుఖం … Continue reading

Posted in కవితలు, కాలం, Uncategorized | 2 Comments

నిన్న రేపటిల నడుమ నేడు


నిన్న రేపటిల నడుమ నేడు నిన్నటి ఆలోచనలకు, రేపటి ఆచరణకు, నడుమ నేడు ప్రణాళికల ఘర్షణ. నిన్నటి నిరాశకు, రేపటి ఆశకు, నడుమ నేడు సంకల్పాల సంఘర్షణ. నిన్నటి ప్రశ్నకు, రేపటి సమాధానంకు, నడుమ నేడు అన్వేషణల ఘర్షణ. నిన్నటి తప్పుకు, రేపటి పశ్చాత్తాపానికి, నడుమ నేడు ఆత్మవిమర్శల సంఘర్షణ. నిన్నటి పనికి, రేపటి ఫలితానికి, … Continue reading

Posted in కవితలు, జీవితం | 4 Comments

ఇంత మాత్రానికేనా?


ఇంత మాత్రానికేనా? కనులు మూస్తే కమ్మని కలల అలల హొయలు, కనులు తెరిస్తే చేదు నిజాల సమ్మెట పోటులు, లిప్తపాటులో కరిగిన కలలు, జీవితమంతా ఎదురు చూసిన ఆశలు, ఇంతకీ, ఏమంత ఆశ పడ్డామని, ఇన్ని నిరాశలు, ఏమంత పెద్ద కోరికలని, ఇన్ని నిట్టూర్పులు, కూడుతో, మనసు పొట్ట నింపాలని, గుడ్డతో, మమతలు అలంకరించాలని, గూడులో, … Continue reading

Posted in కవితలు, జీవితం | Leave a comment

బతుకు సమరంలో కొన్ని కొన్ని…


బతుకు సమరంలో కొన్ని కొన్ని…   బతుకు సమరంలో జీవించాలంటే,  కొన్ని తప్పులు చెయ్యనే చెయ్యకూడదు, చేసామా, సరిదిద్దుకునే అవకాశం రానే రాదు.   కొన్ని చెయ్యాల్సిన పనులు చెయ్యల్సినప్పుడే చేసే తీరాలి, చెయ్యలేదా, ఆ పనులు చెయ్యాల్సిన అవకాశం రానే రాదు.   కొన్ని గాయాలు తగలనే తగలకూడదు, తగిలాయా, ఆ గాయాల మచ్చలు మాననే మానవు.   కొన్ని విభేదాలు రానే రాకూడదు, వచ్చాయా,ఆ … Continue reading

Posted in కవితలు, జీవితం, మనిషి | 2 Comments

పోస్ట్ చెయ్యని ఉత్తరాలు : కూతురు అమ్మకు రాసిన ఉత్తరం (అందరికీ…ఎవరికీ నిషేధం కాదు….)


 పోస్ట్ చెయ్యని ఉత్తరాలు : కూతురు అమ్మకు రాసిన ఉత్తరం (అందరికీ…ఎవరికీ నిషేధం కాదు….)     అమ్మా,               ఈరోజెందుకో నువ్వు తెగ గుర్తొస్తున్నావు. చాలా బెంగగా, దిగులుగా అనిపిస్తుంది. ఆగి ఆగి కళ్ళలో నీళ్ళు తిరుగుతున్నాయి.  ఎందుకో తెలిదు దుఖం తన్నుకొస్తుంది. నీమీద చాలా బెంగగా ఉందమ్మా…..ఈవయసులో నేను ఈ మాటను ఎవరికన్నా చెబితే నవ్వుతారేమో? చిన్న పిల్లలు మాత్రమే అమ్మ కోసం బెంగ పడతారు అని ఎవరన్నారు?  ఒక బిడ్డకు అమ్మవయిన నీకు నీ అమ్మ మీద బెంగా అని ఎగతాళి చేస్తారు కదూ. అందుకే ఈ ఉత్తరం రాస్తున్నాను. ఒక ఆడపిల్ల అమ్మ అవతారమెత్తిన తర్వాతే తన … Continue reading

Posted in పోస్ట్ చెయ్యని ఉత్తరాలు | 22 Comments

అవును నిజమే, గొప్పే….. మరి?


అవును నిజమే, గొప్పే….. మరి? ప్రపంచాన్ని గుప్పెటలో బంధించాము, అవును నిజమే, గొప్పే….. మరి, గుప్పెడంత గుండెలో ఏమి బంధించావు? ప్రపంచీకరణతో ప్రపంచాన్ని పల్లెటూరు చేసాము, అవును నిజమే, గొప్పే….. మరి, సొంతూరు అనుభందం, ఆత్మీయత ఉందా? ఆదేశం, ఈదేశం అన్ని దేశాలు చుట్టివచ్చాము, అవును నిజమే, గొప్పే….. మరి, నీ దేశంలో నీ వాళ్ళ … Continue reading

Posted in కవితలు, జీవితం, మనిషి | 3 Comments

స్వేచ్ఛ హక్కా? అనుగ్రహమా?వరమా? శాపమా?


స్వేచ్ఛ హక్కా? అనుగ్రహమా?వరమా? శాపమా? జీవితపు మనసులోని స్వచ్ఛత నుంచీ స్వేచ్ఛ తప్పిపోయింది, తప్పిపోయిన స్వేచ్ఛను వెతుకుతుంటే, నా మనసు, నా మధిని కొన్ని ప్రశ్నలు అడిగింది, స్వేచ్ఛ హక్కా? అనుగ్రహమా? స్వేచ్ఛ వరమా? శాపమా? హద్దులు లేని స్వేచ్ఛ ఎక్కువ ప్రమాదమా? కనీసపు స్వేచ్ఛ కరువైన బతుకు ఎక్కువ భారమా? స్వేచ్ఛను వెతకటం పక్కన … Continue reading

Posted in కవితలు, ప్రజాస్వామ్యం, మనిషి, సమాజంలో సామాన్యులు | 4 Comments

సగటు ఆడపిల్ల (2 ) — Society


సగటు ఆడపిల్ల (2 ) — Society “అమ్మలూ, కాలేజీకి బయలుదేరుతున్నావా?”  “ఇంకా కొంచెం టైం ఉందమ్మా, బయలుదేరుతాను.” “జాగ్రత్త తల్లీ, నువ్వు బయటకు వెళుతుంటే నాకు భయంగా ఉంది.” “అదేమిటమ్మా కొత్తగా?” “టీవీ లోనూ, పేపర్లోను చూడట్లేదు రోజూ, అవన్నీ చదువుతుంటే కంగారుగా అనిపిస్తుంది. ” “కంగారు పడకమ్మ, నేను నా జాగ్రత్తలో ఉంటాను.” … Continue reading

Posted in సగటు ఆడపిల్ల | 5 Comments

సగటు ఆడపిల్ల (1) —– పుట్టిల్లు


సగటు ఆడపిల్ల (1) —– పుట్టిల్లు “అమ్మలు, కాస్త ఇటు వచ్చి కొంచెం పని అందుకో తల్లీ” “అమ్మా నా ప్రాజెక్ట్ వర్క్ ఇంకా complete అవ్వలేదు, రేపే submit చెయ్యాలి. అన్నయ్య కాలీగానే ఉన్నాడుగా. ఆ టీవీ చూసే బదులు నీకు సాయం చెయ్యమను.” “ఓయ్, ఏంటీ ఉచిత సలహా ఇస్తున్నావ్, నేను అమ్మకు … Continue reading

Posted in సగటు ఆడపిల్ల, Uncategorized | 12 Comments

నా కవిత “అదిగదిగో…” కౌముది మే ఎడిసన్లో అచ్చయిందోచ్…


ఓ చిన్ని గుర్తింపు నా కవిత “అదిగదిగో…” కౌముది మే ఎడిసన్లో  అచ్చయిందోచ్. నా మొదటి కధ “ప్రేమరాహిత్యం” సాధారణ ప్రచురణకు ఎన్నికయిందోచ్.  కౌముది యాజమాన్యానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు.. అదిగదిగో… అదిగదిగో ఆనందం,            చిటారు కొమ్మన మిఠాయి పొట్లం, అదిగదిగో సంతోషం,          ఎగిరే పక్షుల రెక్కల మాటున మరి భద్రం, అదిగదిగో మనశ్శాంతి గమ్యం,          అలల … Continue reading

Posted in కవితలు, గుర్తింపు | 3 Comments