సమాజంలో సామాన్య మానవుడు


సమాజంలో సామాన్య మానవుడు

నేను ఒక సామాన్య మానవుడిని. మరీ తెలివైన వాడినీ కాదు, అలాగని తెలివి తక్కువ వాడినీ కాదు.

నా చుట్టూ జరుగుతున్న విషయాలు కూలంకుశంగా నాకు తెలీదు,కానే సారాంశం మాత్రం తెలుసు. ముఖ్యమంత్రి ఎవరో, ప్రదానమంత్రి ఎవరో, Home minister ఎవరో నాకు తెలుసు. ఏ మంత్రి ఏ జిల్లా నుంచీ వచ్చాడో, ఏ ఊరికి ఎవరు MLA, MP లాంటివి మాత్రం నాకు తెలీదు, నా బుర్రకు ఎక్కదు. రోజుకు ఒకటీ రెండు సార్లు TVలో వార్తలు చూస్తాను. ప్రతీ ఉదయం క్రమంతప్పకుండా cofee తాగుతూ, news paper చదువుతాను.
నా డబ్బులు నేను ఎంతో జాగ్రత్తగా, ఆలోచించే ఖర్చు చేస్తాను. రోజూ paperలో వచ్చే కుంభకొణాలు, స్కాంలు చదువుతున్నప్పుడు నా రక్తం ఉడికిపోతూ ఉంటుందీ. Recentగా కట్టేన tax డబ్బులు నా కళ్ల ముందు కనపపడతాయి. నాతో ఉన్న స్నేహితులతో ఆవేశంగా మాట్లాడుతాను, ఈ ప్రభుత్యం గురించీ, కుంభకొణాలు గురించీ. మర్నాడు వార్తలో వచ్చే మరో స్కాం, నిన్నటి   స్కాంను నా మధిలో నుంచీ తోసేస్తుంది.  కానీ ప్రతీరోజూ ప్రభుత్యం గురించే నేను అసంతృప్తీగానూ, కోపంగానూ ఉంటాను.
నా సమాజంలో జరుగుతున్న అన్యాయాల గురించి నాకు తెలుసు. వాటిని ఎదిరించే దైర్యం కానీ, ఓపిక కానీ, సమయం కానీ నాకు లేవు. ఆ అన్యాయం నాదాకా రాదనే గుడ్డీ నమ్మకం. ఆ అన్యాయం నాకే జరిగితే లబోదిబోమని కొన్నీ రోజులు ఏడ్చీ, మెల్లగా అలవాటు పడిపోతాను. ఆ తర్వాత ఇదీఅన్యాయం  అనే మాటనే మర్చిపోతాను.
నేను అనుథినము నా పిల్లల భవిష్యత్తు గురించే కలలు కంటూ ఉంటాను. నా వరకు నేను చెయ్యగలిగనదంతా చేస్తూనే ఉంటాను.  నా సుఖాలన్నీ పక్కన పెట్టీ,  పైసా పైసా కూడబెడతాను.  మంచి చదువు, బాగా డబ్బు, పెద్ద  ఇళ్లు నా బిడ్డలకు ఉండాలనుకుంటాను. కానీ చుట్టూ ఉన్న సమాజం ఎంత కుల్లిపోయినా నేను పట్టించుకోను. ఆ సమాజంతో నాకు సంబందం లేదనే అనుకుంటానే కానీ, నేనూ ఈ సమాజంలోనే మనుగడ సాగిస్తున్నాను అని మాత్రం అనుకోను. సమాజం పాడైపోయిందీ అనే పొద్డస్తమాను ఉపన్యాసం ఇస్తూవుంటాను కానీ, అందులో నేనూ భాగమే అని మాత్రం  అనుకోను.
ఎన్ని కుంభకొణాలు జరిగినా, ఎంతగా రాజకీయ నాయకులు దోచుకుతిన్నా, చివరకు ఎన్నికల్లో నా కులం వాడికో, కనీసం నా మతం వాడికో, అదీ కాకపోతే నా అభిమాన నటుడికో, అతనికే సంభందించిన వ్యక్తికో ఓటు వేస్తానే కానీ, ఆ అభ్యర్థి అర్హత ఎమిటో, అతని గత చరిత్ర ఏమీటో, అంతకముందు చేసిన సంఘ సేవ ఏమీటో పరీశీలిద్దామని  పొరపాటున కూడా అనుకోను.

నేనొక సగటు మనిషిని, చెయ్యాల్సినవన్నీ నాకు తెలుసు. కానీ ఏమీ చెయ్యలేను. అందుకే నాకింత అసంతృప్తీ.

This entry was posted in నా ఆలోచనలు, వ్యాసాలు, సమాజంలో సామాన్యులు. Bookmark the permalink.

8 Responses to సమాజంలో సామాన్య మానవుడు

  1. Anonymous says:

    correct

  2. Hari Krishna Sistla says:

    I am not in a position that I can forget myself too have committed such mistakes.Not myself alone but almost every,of this society.

  3. venkata ratnam says:

    అసలు మీరు సమాజాన్ని బాగా చదివినట్లున్నారు. మీరు పోస్ట్ చేసిన కవితను ఏపీలోని ప్రతి ప్రభుత్వ శాఖకు ..నాకు తెలిసిన ప్రతి వ్యక్తికి అందించే ప్రయత్నం చేస్తున్నాను..కనీసం అది చూసిన తర్వాత అయిన మనుషులలో మార్పు వస్తుందని నమ్ముతున్నాను. ఏలాంటి పరిస్థితులలో అలాంటి కవిత్వాన్ని రాశావో నాకు తెలియదు కానీ సమాజంలో ప్రతి ఒక్కరినీ నిద్ర లేపేలా వుంది. ప్రతి ఒక్కరిలోని సోమరితనం, నిర్లక్ష్యం, అత్యాశ, లంచగొండితనం, అందులోనే స్వార్థం , కొన్ని సందర్భాలలో కష్టపడే అంశం ….ఇలా చెప్పుకుంటే పోతే చాలా అంశాలు ఇందులో ఇమిడివున్నాయి. నేను ఏంత చెప్పినా తక్కువే అవుతుంది. థాంక్స్…ఇలాంటి కవితలకోసం ఎదురుచూస్తుంటాను…

  4. venkata ratnam says:

    స్పూర్తి నిచ్చే మరో కవిత కోసం ఎదురుచూస్తుంటాను..

  5. Simha says:

    EXCELLENT..

  6. Chandra Sekhar says:

    నిజం అండి నేను కస్టపడి చదివి, రాత్రింబవళ్ళు(ప్రాసకోసం వాడాను) కస్టపడి, కడుపుకట్టుకొని, అయినవారికి దూరంగా బ్రతికి జీవితాంతం సంపాదించింది…..ఒక పోలితికల్ బ్రోకర్ ఒక సంవత్సరంలో సంపాదిస్తుంటే ఏమి చెయ్యాలి?

Leave a comment