Category Archives: Uncategorized

ఇది కవిత కాదు


ఇది కవిత కాదు ఎంత కాలమైంది… ఈ కలం ఒలికి ఎంత కాలమైంది… ఈ కాగితం నలిగి ఏదన్నా రాద్దామని మొదలు పెట్టా… మొన్నీ మధ్య ఓ మిత్రుడు, “కవిత్వమంటే కష్టాలేనా” అని నవ్వాడు… సమాధానమేమిటి? విరహాలు, విషాదాలేనా కలం కార్చేది? కన్నీరు పన్నీరులో తడిసి ముద్దయిన కాగితంలో దేని శాతం ఎంత? ఏమో…Let me … Continue reading

Posted in కవితలు, కష్టం, Uncategorized | 7 Comments

ఓ సంఘర్షణ


ఓ సంఘర్షణ    ఓ సంఘర్షణ, సెగలా ఆవరించి, నిప్పులా దహించేసి, ఎదుట నిలిచి, ప్రశ్నలు సంధించింది, సమాధానాల వెతుకులాటకు, జీవిత కాలం సరిపోదు, సమాధానాలు తెలుసు కోకపోతే, జీవితం సాగదు, ఆలోచన ఆచరణ మధ్య నలిగిన వ్యక్తిత్వంలా…. నీ కూర్పు ముత్యాలే కావచ్చు, నే చిత్తు కాగితం కాలేను, మరో ఘటన సంఘర్షణ లోపు, కాగితంపై రాస్తున్నా ప్రశ్నలు, అప్రయత్నంగా రాలుతున్న నక్షత్రాలతో, తడిసి ముద్దయిన కాగితంలో, అలికిన అక్షరాలే మిగిలాయి….  

Posted in కవితలు, జీవితం, Uncategorized | 1 Comment

మసి పూసిన మారేడు కాయ


 మసి పూసిన మారేడు కాయ   ఊహలతో ఊసులతో ఊపిరి పోసిన ఆశలతో, నిర్మించిన వారధి ఎంత కాలం నిలుస్తుంది? వారధిపై ఒక్క అడుగు వెయ్యి, వెయ్యి ముక్కలవుతుంది నీ మనసు, శిధిలమయ్యే లోపు ఉన్న సంధి కాలపు ఆనందం, అత్యంత విచారాన్ని మిగులుస్తుంది. సమయం చేయి దాటక ముందే, సమస్యల సుడిగుండంలో సమాధి అవ్వక ముందే, మేలుకో నేస్తమా….. నిజాల పునాదిపై నిర్మించుకో భవిష్యత్తు భవనాన్ని. *    *    *   *    *     *     *     *     *      *      * … Continue reading

Posted in Uncategorized | 2 Comments

పెళ్లి బంధమా? ప్రతిబంధకమా?


పెళ్లి బంధమా? ప్రతిబంధకమా?   మూడు ముళ్ళు, ఏడడుగులు, మంగళ సూత్రాలు, మట్టెల, లెక్కలు తెలీవు కానీ, మనుషులను మనసులతో ముడివేసే బంధం, ఆత్మీయతను బంధించే అనుబంధం, కష్టనష్టాల ఆటుపోటులలో కొట్టుకుపోకుండా, ఆసరాగా ఆదుకునే అనురాగం.   తప్పొప్పుల కలగాపులగంలో, ఓ తప్పు, ఓ మాట, నిప్పులా దాహించేసినా, మరో ఒప్పు, మరో మౌనం, నిప్పుతో కడిగిన నిజాలే.   ఓ రోజు విసుగనిపించినా, ఓ క్షణం వద్దనిపించినా, మరో రోజు అక్కున చేర్చుకుని, మరో … Continue reading

Posted in కవితలు, పెళ్లి, Uncategorized | 12 Comments

Vacation time…


 Vacation time… సెలవలకు ఇండియా వెళ్ళే టైం వచ్చేసింది. ఇంకొన్ని రోజుల్లో అమ్మ, నాన్న దగ్గర వాలిపోవొచ్చు. వెళ్ళిన రోజు నుంచి తిరిగి వచ్చే దాకా 24 * 7 * 30 days of pampering . అక్కడ ఉండే నెల రోజుల కోసం రెండు నెలలుగా ఎదురు చూస్తాము. ఎన్నెన్నో Plannings ……ఆ … Continue reading

Posted in అమ్మ, జీవితం, నా అనుభవాలు, వ్యాసాలు, Uncategorized | 24 Comments

ప్రేమగా తాకి వెళ్ళిన పవనం (పరిచయం)


ప్రేమగా తాకి వెళ్ళిన పవనం (పరిచయం) ఎచట నుంచో, అనురాగపు శీతల పవనం, ఆప్యాయతను ఆదరంగా మోసుకొచ్చి, ప్రేమను నిలువెల్లా ఒలకపొస్తూ, మనసుని మధురంగా తాకింది. గాలికి చెదిరిన ముంగురులు, నుదిటిపై అల్లరి చేస్తుంటే, ముద్దుగా విసుక్కుని, కనులు మూసుకుని, మనసారా ఆస్వాదించి, కనులు తెరిసేటప్పటికి,  వయ్యారంగా ఊపుకుంటూ వెళ్ళిపోయింది. చిన్న నిట్టూర్పుతో, చిరునవ్వు సాయంతో, … Continue reading

Posted in కవితలు, జీవితం, Uncategorized | 3 Comments

కష్టం కాలం సుఖం


కష్టం కాలం సుఖం   కన్నీరు ఉప్పెనలా ఉప్పొంగి, ఈ క్షణాన్ని ముంచెత్తింది, కొట్టుకుపోతున్న సమస్తంలో, మరో క్షణం కలిసిపోయింది.   శిధిలాల నడుమ, కాలం ఒంటరిగా మిగిలింది, కొనప్రాణం మిగిలి ఉన్న సెకను ముళ్ళు, దేకుతూ పాకుతూ, నిమిషాల ముళ్ళును నెట్టింది, నెమ్మదిగా కదిలిన నిమిషం, మెలమెల్లగా సత్తువను కూడగట్టుకుని, గంటల ముళ్ళుతో జతకట్టింది.   ఇక అంతే, సెకను వెనుక నిమిషం, నిమిషం వెనుక గంటలు, పరుగులు పెడుతూనే ఉన్నాయి.   కష్టం, కాలం, సుఖం … Continue reading

Posted in కవితలు, కాలం, Uncategorized | 2 Comments

సగటు ఆడపిల్ల (1) —– పుట్టిల్లు


సగటు ఆడపిల్ల (1) —– పుట్టిల్లు “అమ్మలు, కాస్త ఇటు వచ్చి కొంచెం పని అందుకో తల్లీ” “అమ్మా నా ప్రాజెక్ట్ వర్క్ ఇంకా complete అవ్వలేదు, రేపే submit చెయ్యాలి. అన్నయ్య కాలీగానే ఉన్నాడుగా. ఆ టీవీ చూసే బదులు నీకు సాయం చెయ్యమను.” “ఓయ్, ఏంటీ ఉచిత సలహా ఇస్తున్నావ్, నేను అమ్మకు … Continue reading

Posted in సగటు ఆడపిల్ల, Uncategorized | 12 Comments

ప్రేమ, పెళ్లి, విడాకులు మీ ఇష్టం..మరి పిల్లలు?


ప్రేమ, పెళ్లి, విడాకులు  మీ ఇష్టం..మరి పిల్లలు?   మనిషికి స్వేఛ్చ ఎంత అవసరమో, ఆ స్వేచ్చకు హద్దు అనేది ఉండటం కూడా అంతే అవసరం. ఎవరిని ప్రేమిస్తున్నాము లేక పెళ్లి చేసుకుంటున్నాము అనే విషయాలలో మనసుకు స్వేఛ్చ అత్యవసరం. మన సమాజంలో ప్రేమ, పెళ్లి విషయాలలో కట్టుబాట్లు ఉన్నాయి. ఆ కట్టుబాట్లలో మంచి ఉంది, చెడు ఉంది. ఈ కట్టుబాట్ల కారణంగానే చాలా సంసారాలు సాగుతున్నాయి. క్షణికావేశాలకు, కోపతాపాలకు కాపురాలు కూలిపోవట్లేదు. అదే కట్టుబాట్ల కారణంగానే చాలా మంది బయటపడలేక నిత్య నరకం … Continue reading

Posted in జీవితం, Uncategorized | 40 Comments

కష్టంలో సుఖం, సుఖంలో కష్టం..


కష్టంలో సుఖం, సుఖంలో కష్టం కష్టం నన్ను కష్టిద్దామని ఎంతో కష్టపడుతుంది. కొన్ని సార్లు నాకంటే పెద్దగా, మరి కొన్నిసార్లు నా కంటే చిన్నగా, కొన్నిసార్లు నా ముందు, మరి కొన్నిసార్లు నా వెనుక…నీడల నన్ను వెంబడిస్తుంది. కష్టానికే తెలియని కష్టమేమిటంటే, కష్టం తన ప్రతీ కష్టంలోనూ నన్ను సానపెడుతుంది. కష్టం తన కష్టాల సమ్మెట పోటులతో నన్ను శిల్పంగా చెక్కుతుంది. కష్టం తన కష్టంతో నన్ను కష్టించి కష్టించి….. … Continue reading

Posted in కష్టం, Uncategorized | 6 Comments

ఇల్లు, పిల్లలు, ఉద్యోగం నడుమ కలవరపెట్టే ఆలోచనలు


ఇల్లు, పిల్లలు, ఉద్యోగం నడుమ కలవరపెట్టే ఆలోచనలు అలారం సైరన్ మోతలాగా మోగుతుంది. అప్పుడే తెల్లారిపోయిందా? కళ్ళు తెరుచుకోవట్లేదు, కనురెప్పలు విడిపడట్లేదు. ఒక్క ఐదు నిముషాలు పొడుకుని లేగుస్తాలే. అమ్మో, పనులు తెమలవు. అతి కష్టంగా మంచం దిగాను. కళ్ళు మండిపోతున్నాయి. నిద్ర సరిపోలేదు. ఇంకాసేపు పడుకోమని దేహం ప్రాధేయ పడుతుంది.  మనసు చెప్పే మాటలు, గుండె పలికే పలుకులు………ఇలా వింటూ కూర్చుంటే అయినట్టే. … Continue reading

Posted in అమ్మ, Uncategorized | 7 Comments

మన భారతం! అటువైపు అలా..ఇటు వైపు ఇలా…


మన భారతం! అటువైపు అలా..ఇటు వైపు ఇలా… తిండి: అటువైపెటో పూరి గుడిసెల్లో ఆకలి తీరని పేద కడుపుల ప్రేగు అరుపులు, ఇటువైపెటో నక్షత్రాల హోటల్లో ఖరీదైన పింగాణి పాత్రల్లో వదిలేసినా ఆహారాన్ని చెత్త కుప్పల్లో పడేస్తూ వెండి చెంచాలు చేస్తున్న శబ్దాలు. బట్ట: అటువైపెటో చిరిగిన బట్టలు కుట్టుకుంటూ, మళ్ళి మళ్లీ కుట్టుకుంటూ, అరకొర … Continue reading

Posted in ప్రజాస్వామ్యం, Uncategorized | 7 Comments

అక్షరాలతో స్నేహం


అక్షరాలతో స్నేహంఅక్షరాలతో స్నేహం, పదాలతో ప్రేమ, భావాలతో భందం, ఆలోచనలతో అనురాగం, ఆత్మీయంగా రాసుకునే నా అక్షరాలు, నా ప్రియాతిప్రియమైన నేస్తాలు.  నాలో నేను వెతుక్కునే ప్రయత్నం, నాతో నేను చేసుకునే స్నేహం, నాతో నేను చెప్పుకునే కబుర్లు, నాతో నా కాలక్షేపం, నాకు నేను స్పూర్తి నిచ్చుకోవటం, నన్ను నేను ఓదార్చుకోవటం, నన్ను నేను … Continue reading

Posted in Uncategorized | 4 Comments

నా నేస్తమా నీకు కృతఙ్ఞతలు


నా నేస్తమా నీకు కృతఙ్ఞతలు నాకు నాకే తెలీకుండా, నా మనసుకు దగ్గరయ్యావు, నాలో నేనే లేనప్పుడు, నువ్వు నన్ను లేపావు, నన్ను నేను కోల్పోతున్నప్పుడు, నువ్వు నన్ను నిలబెట్టావు, నాలో నేను కుంచించుకుపోతున్నప్పుడు, నువ్వు నాలో ప్రవేశించావు.   ఏ ప్రభాత సమయంలో, ఏ సంధ్యా సమయంలో, ఏ గోధూళి వేళలో, నన్ను స్పందించావో, … Continue reading

Posted in Uncategorized | 5 Comments

నేను అమ్మనయ్యాక అర్థమయ్యావు అమ్మ నువ్వు


నేను అమ్మనయ్యాక అర్థమయ్యావు అమ్మ నువ్వు ఆరు నెలల నా కూతురు పాలు తాగనని మారాం చేస్తుంటే, ఆరేళ్ల నా కొడుకు అన్నం తిననని విసిగిస్తుంటే, పదహారేళ్ల వయస్సులో, పాతికేళ్ల వయస్సులో, ఈ కూర బాగోలేదు, ఆ కూర బాగోలేదు, రోజు ఇదే వండుతావేంటి అంటూ నిన్ను విసిగిస్తుంటే, నువ్వు పడ్డ బాధ నాకు ఇప్పుడు అర్థమవుతూంది … Continue reading

Posted in కవితలు, నా అనుభవాలు, Uncategorized | 14 Comments

బాల్యం…పల్లెటూరులో


బాల్యం…పల్లెటూరులో బాల్యం….ఎంత  అందమైన  అనుభవం ఎంత  మధురమైన  జ్ఞాపకం ఇంతలోనే  అంత  ఎదిగిపోవాలా!? కాలం  కాసేపు  ఆగెపొకూడదు! ఎప్పుడెప్పుడు  సెలవలు  వస్తాయా  అనే  ఎదురుచూపులు ఎప్పుడెప్పుడు  ఊరెలదామా అన్న ఆత్రం రైలుబండి  కోసం ఎదురుచూపులు కిటికీ సీటు కోసం పోట్లాటలు అమ్మ అరుపులు, అలకలు… అమ్మమ్మ గోరుముద్దలు, మామయ్య ముచ్చట్లు ఊగిన ఉయ్యాల, చదివిన పుస్తకాలూ … Continue reading

Posted in కవితలు, నా అనుభవాలు, Uncategorized | 7 Comments

అందమైన జీవితం


అందమైన జీవితం నునులేత  కిరణాలు  గోరువెచ్చటి  హంగులు  కూర్చుకుని నా  కోసమే  ఉదయిస్తున్నాయి ఆ  హంగులు  నా  దరికిచేరకముందే కలువ  పువ్వు  కంగారుగా  విచ్చుకొంది తన హొయలు  సైతం  నాకు  చూపించాలనే కనురెప్పల  సవ్వడికి  బెదిరిపోతున్న స్వప్నాన్నే పొదిగి  పట్టుకుని  మదిలో  భద్రంగా  దాచాను. రెప్పలు  రెండూ  విడవడగానే  కనుపాప ఆనందంగా  ఆస్వాదించి౦ది  సుర్యోదయన్నే అనుభవం  … Continue reading

Posted in కవితలు, నా ఆలోచనలు, Uncategorized | 5 Comments

Hello world!


ప్రపంచానీకీ నమస్తే. తెలుగువారికీ అబీవందనాలు! happy new year. జీవీత పరుగు పందెంలో మరుగున పడేపోయేన బావాలు  వెళీకతేసీ ప్రయత్నం. Please wish me luck to have enough time and attitude.!

Posted in Uncategorized | 2 Comments