Category Archives: జీవితం

మనమిద్దరం సమాంతర రేఖలం


మనమిద్దరం సమాంతర రేఖలం ఆద్యంతాలను ముడివేస్తూ మనమిద్దరం రెండు సమాంతర రేఖల్లా భూమి ఆకాశం కలిసే అనంతాలకు పరుగులుతీస్తూ ఉంటాం….. నక్షత్రాల లెక్కలు తేలవు సముద్రాల లోతులు అందవు కీచులాడుకుంటూ..వాదులాడుకుంటూ అటువైపోసారి…ఇటువైపోసారి ఎగిరిపోతూంటాం…వదిగిపోతూంటాం చీకటి గుహలలో వెతుకులాడుతూ ఒకరినొకరు తడుముకుంటూ ఏవో గతాల లోతుల్లోకి జారిపోతూ ఒకరికొకరు ఆసరాగా ఎగబాకుతూంటాం.. నీ సిరా నీదే నా … Continue reading

Posted in కవితలు, కష్టం, జీవితం | 12 Comments

ముడి పడి …విడి పడి


ముడి పడి …విడి పడి  ఏదో ముడిపడుతున్న బావన అంతలోనే విడిపోతున్న వ్యధ ఎప్పటికైనా వదులయ్యేదేగా? తెలిసినా బదులేది? మనసుకు ఊరటేది? వాడిపోయే పువ్వులే మాలల అల్లిక మానగలమా? ఎగిరిపోయే పక్షే గూటిలో పొదుగుట ఆపగలమా? ఏ దారి ఎటు పోవునో బాటసారి పయనం ఆగునా? దారి పొడుగునా కుశల ప్రశ్నల పలకరింపులే మార్గమంతా ఒంటరి … Continue reading

Posted in కవితలు, కష్టం, జీవితం | 7 Comments

ప్రేమ ఇంకా ఉంది


ప్రేమ ఇంకా ఉంది నీ గుండె సడిలోను నా కంట తడిలోను నేస్తమా… ప్రేమ ఇంకా ఉంది! కరిగే కాలము  తధ్యమే మారుతున్న లోకము  విదితమే ధనం చుట్టూ పరిభ్రమిస్తున్న మనిషి నిజమే తనలో తాను వెతుకుతున్నది  ప్రేమేనన్నది సత్యమే….

Posted in కవితలు, కాలం, జీవితం | 7 Comments

అంతర్ముఖంతో అంతర్మధనం


అంతర్ముఖంతో అంతర్మధనం నన్ను కౌగిలించుకుంటున్న చీకటి రాత్రుళ్ళలో రాలిపడుతున్న నక్షత్రాలు ఎన్నో ప్రశ్నలను సంధిస్తున్నాయి… నేను చేజార్చుకున్న వేకువ వెలుగులలో ఎగురుతున్న ఎన్నో పక్షులు సమాధానాలు వెతుకుతున్నాయి… నాలోతుల్లో ఏ మూలో దాక్కున్న అంతర్ముఖం పగలంతా నిద్రలో జోగుతూ రాత్రుళ్ళు కత్తులు దువ్వుతూ తలలు నరుకుతూ స్తైర్యవిహారం చేస్తుంది… ఎగిసిపడే ఆలోచనలలో తడిసి ముద్దయ్యే నన్ను నేను … Continue reading

Posted in కవితలు, కష్టం, జీవితం | 8 Comments

తాళం వెయ్యాల్సిన తలంపు


తాళం వెయ్యాల్సిన తలంపు చాలా కాలానికి తెరుచుకున్న తలుపుల నుంచీ తలంపు బయటకు బయలుదేరింది… అందమైన లాన్లు క్రమశిక్షణగా నాటిన మొక్కలు నీటిని వేదజిమ్ముతున్న ఫౌంటైన్ల నడుమ నియాన్ లైట్ల వెలుతుర్లో మెరుస్తున్న నున్నటి తారు రోడ్డుపై నడుస్తూ దారులు వెతుకుతుంటే సైన్ బోర్డులన్నీ నింగి నేల  కలిసే చోటుకే చూపిస్తున్నాయి…. రోడ్డుపై పలకరించ మానవుడు … Continue reading

Posted in కవితలు, జీవితం, నా అనుభవాలు | 9 Comments

దహన సంస్కారం


దహన సంస్కారం ఎక్కడో ఏదో కాలుతున్న వాసన ముక్కు పుటాలను కమ్మేస్తున్న పొగ శ్వాసలో  నా వాసన నాకే తెలుస్తున్న బావన దహనమైపోతున్నది ఎవరూ? నా అంతరాత్మ? కాదు కాదు…ఇది నేను కాదు ఎవరో ఎక్కడో…ఏమో నాకు తెలీదు ఎవరో ఏడుస్తున్న శబ్దం చెవులు రిక్కించి ఆలకిస్తున్నా ఎక్కడో విన్న గొంతులా ఉందే నేను నా … Continue reading

Posted in కవితలు, కష్టం, జీవితం | 2 Comments

ముసురు


ముసురు ఆ మూల ముసురు ఎప్పుడు కమ్ముకుందో ఎండిన ఈ నేల వదిలిన మట్టివాసన హృదయానికి తగిలేదాకా తెలీయనే లేదు… ఈ నేల ఇంతగా ఎప్పుడు ఎండిపోయిందో ఆ వాన నీళ్ళు దోసిట్లో పట్టి కళ్ళాపు జల్లే దాకా తెలీయనే లేదు… ఆ ముసురూ వదలనంటోంది ఈ దోసిలి నిండనంటోంది ఆ వాకిలి తడవనంటోంది….

Posted in కవితలు, కష్టం, జీవితం | 2 Comments

లెక్కల సంబంధం


లెక్కల సంబంధం ఆరుబయట మడత మంచాలలో పడుకుని వెన్నెల వెలుగులో లెక్కపెట్టిన నక్షత్రాల లెక్క తేలకుండానే బాల్యం వెళ్ళిపోయింది… బెండకాయ కూర తినటానికి లెక్కలు రావటానికి సంబంధం తెలీకుండానే చదువైపోయింది…. ఇప్పుడు తెలిసిందల్లా నోట్ల కట్టల లెక్కలతో సంబంధమే….

Posted in కవితలు, కష్టం, జీవితం | 2 Comments

గూడు


గూడు గూడు కట్టుకున్న గుబులులో నుంచి ఆశలు ఎగిరిపోయాయి కొత్తగా వచ్చి చేరిన ఆలోచనలు గూటిని మరింత అందంగా తీర్చిదిద్దాయి….

Posted in కవితలు, కష్టం, జీవితం | 2 Comments

మనసు ఆకలి


మనసు ఆకలి రోజులు  గడుస్తూనే ఉంటాయి జీవితం సాగుతూనే ఉంటుంది అంతా సవ్యంగా ఉన్నట్టే ఉంటుంది అంతలోనే ఎక్కడో ఏదో రాగం శృతి తప్పినట్టు మరేదో గానం మూగబోయినట్టు ఏమూలో అసంతృప్తి సెగ రాచుకుని దావానలమై మనసంతా పరుచుకుంటుంది……. కానవస్తున్న గమ్యం కనికరం లేకుండా పరుగులు పెడుతున్నట్టు, నిచ్చెన చివరి మెట్టు చేరాక ఆ విజయం … Continue reading

Posted in కవితలు, కష్టం, జీవితం | 4 Comments

ఆ పెద్ద మనిషి


ఆ పెద్ద మనిషి ఆ పెద్ద మనిషి రచ్చబండపై ఆశీనుడై మొగుడు పెళ్ళాల పంచాయితీ తీర్చాడు పెళ్ళాన్ని ప్రేమగా చూసుకోమని మందలించి మొగుడుకి అణుకువగా నడుచుకోమని సూచించి ఇంటికి చేరాడు….. కాళ్ళకు అంటిన సంస్కారాన్ని నీళ్ళతో కడిగేసుకుని కండువా పెద్దరికాన్ని కొక్కానికి తగిలించి “ఒసేయ్ ఎక్కడ చచ్చావ్” ధర్మపత్నిని కేకేసాడు….

Posted in కవితలు, జీవితం, పెళ్లి, మనిషి, మహిళ | 10 Comments

అతడు ఆమె —- ఆ బంధం


అతడు ఆమె —- ఆ బంధం అతను ప్రేమిస్తున్నానన్నాడు ఆమె అపనమ్మకంగా చూసింది నువ్వే ప్రాణం, నీతోనే జీవితమన్నాడు ఆమె మనసు కరిగి, ప్రేమ ఉప్పొంగింది బంధం ముడిపడింది….. చట్టాపట్టాలేసుకుని జీవితపు నావలో ఆనందపు తీరాలకు చేరాలని కలలు కంటూ సాగారు కొంత కాలం….     అలల ఆటుపోటులు కలలను కుదపటం మొదలుపెట్టాయి అతనిలో … Continue reading

Posted in కవితలు, కష్టం, జీవితం, పెళ్లి, మహిళ, సగటు ఆడపిల్ల | 18 Comments

రూపాయిబిళ్ళ


రూపాయిబిళ్ళ తారు రోడ్డున గుడికి వెళ్తుంటే రూపాయిబిళ్ళ దొరికింది నాది కాదని గుడి మెట్లపై కూర్చున్న బిక్షగాడి చేతిలో వేసి వాడి కళ్ళలోకి చూసా…. వెక్కిరుతున్న కళ్ళు తలదించుకున్న బిళ్ళ నా కంటపడి చిరిగిన జేబులో నా పిడికిలి బిగిసి వదులయ్యింది…

Posted in కవితలు, జీవితం | 1 Comment

నిశ్శబ్దం మాట్లాడింది


నిశ్శబ్దం మాట్లాడింది అ వేళ, సద్దు లేని పొద్దులో ఎద నిశ్శబ్దంలో ఓలలాడింది. సవ్వడి లేని ప్రశాంతంలో మనసు మధురిమలు పలికింది. ఆ వేళ, ధ్వని లేని ద్వారంలో మౌనం రారమ్మని పిలిచింది. సడి లేని సౌధంలో ఏకాంతం ఆతిధ్యమిచ్చింది. ఆ వేళ, కనురెప్పల రెపరెపలు ఊసులాడాయి ముంగురులు నుదుటిపై గుసగుసలాడాయి ఉచ్ఛ్వాస  నిచ్ఛ్వాసలు కబుర్లాడుకున్నాయి … Continue reading

Posted in కవితలు, జీవితం, మౌనం | 3 Comments

గెలుపో? ఓటమో?


గెలుపో? ఓటమో?  ఎదలో ప్రశ్నల మీటలు, మధిలో సమాధానాల వెతుకులాటలు, ఎద, మధి సంవిధాన సమరంలో, గెలుపోటముల వ్యత్యాసం అతి స్వల్పం. ఆలోచనల సాయంతో, ఆశయాల మెట్లు , ఒక్కొక్కటి ఎక్కుతూ, తెలుసో తెలియకో, ఏ పాకుడు పట్టిన చోటో అడుగేసి, జర్రున జారి మళ్లీ చేరాను, మొదలు పెట్టిన చోటుకే ఎన్నోసార్లు. ఎగబాకే స్వభావం … Continue reading

Posted in కవితలు, జీవితం | 2 Comments

ఆ మాత్రం ఆస్వాదించలేమా జీవితాన్ని?


ఆ మాత్రం ఆస్వాదించలేమా జీవితాన్ని? గోరువెచ్చటి ఓ సూర్యకిరణం వెండి మబ్బులను చీల్చుకుని నేలను తాకింది శుభోదయమంటూ, సుదూరం నుంచి లీలగా వినిపిస్తుంది ఏదో పక్షి పలకరింపు “బాగున్నావా?”, అంటూ ఆప్యాయంగా, బాల్కనీలో పెట్టిన కుంపటిలోని గులాబి మొక్క మొగ్గేసింది ఆశకు చిగురులు తొడుగుతూ, ఇంట్లో అందం కోసం అమర్చిన ఎక్వేరియంలోని చేపలు గిరగిరా తిరుగుతున్నాయి … Continue reading

Posted in కవితలు, జీవితం | 6 Comments

జీవితం


జీవితం కాలం, సముద్రపుటొడ్డున ఇసుక రేణువులతో, గూడు కట్టి దారి చేసినా, పిడికిలిలో బిగించి విసిరేసినా, అలలలో కలిసిపోఏవే, జ్ఞాపకాలను మాత్రమే మిగులుస్తూ…….. జ్ఞాపకాలు, కరిగిపోని పులకరింతలు కొన్ని, కరుడుగట్టిన కన్నీటి గాధలు మరికొన్ని, కొన్ని మరికొన్ని అన్నీ, అనుభవాల శఖలాలే……. అనుభవాలు, పాఠాల సూక్తులలో, గునపాఠాల పోటులు, జీవన మార్గపు ఎత్తుపల్లాల, అధిరోహణ అవరోహణ, … Continue reading

Posted in కవితలు, జీవితం | 8 Comments

కన్నీరు


కన్నీరు కనురెప్పల మాటున దాగని కన్నీరు, పరదా చాటు దాటితే, పరువు తక్కువంట??!! ఆనకట్ట కన్నీరు, ఎదలో ఎగిసిపడే అగ్గిశిఖలపై, చిలకరిస్తే చల్లారేనా ? కట్ట తెగిన కన్నీరు, చెంపలపై జారి, గుండెలో ఇంకిపోతే, మనసు భారం తగ్గేనా? ఘనీభవించిన కన్నీరు, నలుసై గుచ్చేది, కనులలోనా కలతలలోనా? మరుగుతున్న కన్నీటి సెగలో, కాలిపోతున్నది నువ్వా? నీ … Continue reading

Posted in కవితలు, కష్టం, జీవితం | 2 Comments

నిద్ర పట్టని రాత్రి


నిద్ర పట్టని రాత్రి నిద్ర పట్టని రాత్రి బెడ్ లాంప్ చుట్టూ జ్ఞాపకాలు ముసురుకుంటాయి చేతి విదిలింపుతో తరిమేయ్యలన్న ప్రయత్నంతో పారిపోయినట్టే పోయి మళ్లీ కమ్ముకుంటాయి…. బోరున ఏడుపు రాదు గుండె బరువు తీర్చుకోవటానికి. కనుకొన నుంచి ఆగి ఆగి రాలుతున్న, ఒక్కో చినుకులో తడిసిన తలగడ చెంపకు ఆని గుండె తడిని గుర్తుచేస్తుంది ప్రతీ … Continue reading

Posted in కవితలు, కష్టం, జీవితం | 4 Comments

ఒక్కసారి ఒకే ఒక్కసారి


ఒక్కసారి ఒకే ఒక్కసారి ఒక్కసారి ఒకే ఒక్కసారి, ఈ virtual   ముసుగులన్నీ తీసి పక్కన పెట్టి……”నేను బాగానే ఉన్నానులే”, అన్న ముసుగు కూడా తీసేసి, మనసు లోతుల్లో ఆణువణువూ స్పృశిస్తూ, “సంతోషంగా ఉన్నానా?”, అని గొంతెత్తి అరిస్తే….. బండరాతి గుండెల మధ్య పలుమార్లు ప్రతిధ్వనించి ఉక్కిరి బిక్కిరి చేస్తుంది అదే ప్రశ్న. బండరాయి శబ్దం తప్ప సమాధానం ఇస్తుందా? ముసుగులు కప్పీ కప్పీ ఊపిరాడకుండా చేసి ప్రాణం తీసిన గుండె కదూ?…. పాపం ఎండిపోయింది….. ఒక్కసారి ముసుగులన్నీ తొలిగేటప్పటికి, మళ్లీ ఊపిరి పిల్చుకోవాలని ప్రయత్నం. కొన ఊపిరి అందగానే ఏదో ఆనందం…నగ్నత్వంలో  స్వచ్ఛతలాగా….. స్వచ్ఛత సువాసనను వెదజల్లే స్వేఛ్చను ఊపిరిగా పీల్చుకుంటూ … Continue reading

Posted in కష్టం, జీవితం, వ్యాసాలు | 3 Comments