Category Archives: జీవితం

మా పల్లె అందాలు అనుభవాలు


మా పల్లె అందాలు అనుభవాలు  “నేను ఇండియా  వస్తున్నాను, కుదిరితే కలుద్దాం,” అనగానే నీ డేట్స్ చెప్పు అని తన ప్రయాణానికి టికెట్స్ బుక్ చేసుకున్న జయతికి బోల్డు థాంక్స్ లు. థాంక్స్ ఫర్ కమింగ్ అని నేనంటే — థాంక్స్ ఏమీ కాదు ప్రవీణ, మనమందరం ఆస్వాదించాం అని తనన్నా కూడా థాంక్స్ చెప్పాలి. … Continue reading

Posted in జీవితం, నా అనుభవాలు, వ్యాసాలు, Photography, Uncategorized | Tagged | 12 Comments

నాకోసం అట్టేపెట్టేయ్యవూ


నాకోసం అట్టేపెట్టేయ్యవూ   రెండంటే రెండే మాటలు గుప్పెడంటే గుప్పెడు నీ నవ్వులు అంతో ఇంతో చిలిపితనం కాస్తంత అమాయకత్వం కూసంత పసితనం నాకోసం అట్టేపెట్టేయ్యవూ…. ఎప్పుడోకప్పుడు గుప్పిళ్ళ  నిండా పూలను ఏరి దారాలను పెనవేస్తూ మాలలు అల్లి నీ సన్నిధికి పరిగెత్తుకుంటూ రాకపోతానా చెప్పు! తీరా వచ్చాక నాదగ్గరేం  మిగలలేదంటే నేను చిన్నబుచ్చుకోనూ! వర్షపు … Continue reading

Posted in కవితలు, జీవితం, Uncategorized | 3 Comments

మెట్రో ప్రయాణం


మెట్రో ప్రయాణం  పోయిన వారం ఓ నాలుగు రోజులు కార్పరేట్ ట్రైనింగ్ అటెండ్ అవ్వాల్సి వచ్చింది. ఇలా ట్రైనింగ్లకు పంపించి ఆ తర్వాత expectations తో బాదటం ఆఫీసోల్లకు మహదానందం. ఆ ఇన్స్టిట్యూట్ లొకేషన్ మ్యాప్ మావారి చేతిలో పెట్టి కాస్త దారి చెప్పవయ్య అంటే, ఆ ప్లేస్ చాలా దూరం. ఫ్లై ఓవర్లు ఎక్కాలి, … Continue reading

Posted in జీవితం, నా అనుభవాలు, వ్యాసాలు | 1 Comment

టైం ఎందుకు ఉండదు?


టైం ఎందుకు ఉండదు? “అస్సలు తీరట్లేదంటే నమ్మండి. చాలా బిజీగా ఉంటున్నాను” “ఊపిరి పీల్చుకోవటానికి  కూడా టైం దొరకట్లేదు” “లైఫ్ ఇస్ డామ్ హేక్టిక్” కాలమానాలతో సంబంధం లేకుండా సంవత్సరం పొడుగునా ఇవే మాటలు పదే పదే  వల్లె వేసేవారికి ఓ ఉచిత సలహా….మీరు పనులన్నీ పక్కన పడేసి యుద్ధప్రాతిపదికన హిమాలయాలకు ప్రయాణం కట్టి, బ్రహ్మ … Continue reading

Posted in కాలం, జీవితం, నా అనుభవాలు, Photography, Uncategorized | 14 Comments

ఆ క్షణాలు


ఆ క్షణాలు అనుభూతి  కోసమే జీవించే ఆ క్షణాలను మనసు కెమేరాతో ఫోటోలుగా తీసి మధి  ఆల్బంలో భద్రంగా దాచేసుకోవాలి… అపుడో ఇప్పుడో మనసు భారమైన క్షణానో కన్నీరు ఉప్పొంగుతున్న  నిమిషానో దాచుకున్న ఆల్బం తెరచి ఫోటోలను మునివేళ్ళతో సుతారంగా స్పర్శిస్తే చాలు… జీవితం అందమైనదే, కాదన్నదెవరు? ఈ స్థితా లేక కాలమా? రెండు కరిగిపోయేవేలే… … Continue reading

Posted in కవితలు, కాలం, జీవితం | 4 Comments

నిదుర


నిదుర అలసట కనురెప్పల మాటుకి చేరినా కనులు మూతపడవే వింతగా! నిదుర దరిచేరదే నిర్ధయగా! నడిరేయి చిక్కటి చీకట్లలోనూ అరమోడ్పు కనులలో అదే అలజడి అవే తలంపులు అవే సుడులు మడులు అవే తంత్రాలు, తరుణోపాయాలు అవే పరిధిలు, ప్రణాళికలు అవే వృత్తాలు అంతే వ్యత్యాసాలు…. అమ్ముల పొదితో ఒడిలో ఒదిగి ఆదమరిచి నిదుర పోయేదేలా? … Continue reading

Posted in కవితలు, కష్టం, జీవితం | 4 Comments

స్థితి


స్థితి ఆనందమూ కాదు, విషాదమూ కాదు అదో స్థితి మాటలన్నీ మూటకట్టుకుని పారిపోతే ఎద మొత్తం  మౌనంలో ఒదిగిపోతే ఆ నిశ్శబ్దపు ఒడిలో ఏర్పడే  స్థితి…..స్తబ్దత! శూన్యత కాదు  స్తబ్దత! ఈ స్తబ్దతలో శ్వాసే ప్రశ్నలను సంధిస్తుంది.. సమాధానాల అన్వేషణలో మనసును తవ్వి పొరలను చీల్చుతూ హృదయాంతరాలకు చేరాక అక్కడ ఎన్నాళ్ళుగానో  నిక్షిప్తమైన మణులు వెలికి … Continue reading

Posted in కవితలు, కష్టం, జీవితం | 3 Comments

అసంపూర్ణం


అసంపూర్ణం ఒక్కో రాత్రి, ఒక్కో పగలు ఎక్కడి నుంచీ మోసుకొస్తాయో ఇంతేసి దిగులును? నేల ఈనుతున్నట్టు, ఆకాశం చాలనట్టు పుట్టుకొచ్చే ఈ ఆలోచనలు! కడవల కొద్దీ తోడినా ఊట బావిలా ఊరుతూండే ఈ జ్ఞాపకాలు! నల్ల మబ్బుల నీటి భారం వానై వరదై ముంచెత్తితే మటుమాయం…ఎంతదృష్టం! కనురెప్పల కన్నీటి భారం చినుకై కురిసి కురిసి కడలిలోనే … Continue reading

Posted in కవితలు, కష్టం, జీవితం | 3 Comments

పై పై బతుకు…


 పై పై బతుకు… ఇప్పుడంతా పై పై బతికేయ్యటం అలవాటు చేసేసుకున్నాం ఏ క్షణానన్నా పొరపాటున అంతరాలలోకి జారిపడితే ఆత్మవిమర్శలు చుట్టుముడితే అస్తిత్వం ప్రశ్నిస్తే మిగిలేదంతా అంధకారమే! ఇప్పుడంతా పై పై బతుకులకు సౌఖర్యాల మేకప్పులే మస్కారా కరిగితే, ఐలైనర్ చెదిరితే కాంతి క్షిణించిన కళ్ళలో జీవాన్ని భూతద్దంలో వెతుక్కోవాల్సిందే! లిప్ గ్లాస్ అద్దిన నవ్వులు … Continue reading

Posted in కవితలు, కష్టం, జీవితం | 3 Comments

పుటలు


పుటలు  ఈ పుస్తకంలో నిర్ణీత కాలం గడిచాక పక్కకు తిరిగిపోయే ఎన్నో ఎన్నో పుటలు నిన్నటి పేజీలో మరి రాయలేను రేపటి పుటలో ఏమి రాస్తానో తెలీదు. నేను, తెల్లకాగితం నేడు నా ముందున్నాయి… అమ్మ కౌగిలి, కాగితం పడవ నెమళీక, ప్రేమలేఖ భద్రంగా దాచేసుకున్నా గడిచిపోయిన పుటలలో … ఎదురుదెబ్బ, నిట్టూర్పుల సెగ, గుణపాఠాల … Continue reading

Posted in కవితలు, జీవితం, నా అనుభవాలు | 1 Comment

ఇంటికెళ్ళి వచ్చాక….


ఇంటికెళ్ళి వచ్చాక…. రాత్రంతా వర్షం కురిసి ఇప్పుడే వెలిసినట్టుంది తడిసిన గుమ్మం చెమ్మగిల్లిన వాకిలి స్వాగతం పలికాయి. సన్నజాజి తీగ, మల్లె మొగ్గ, చిరుగాలి స్పర్శ ఆ ఆవరణంతా ప్రేమమయమే! “బాగున్నావా తల్లి?”, “అలా చిక్కిపోయావే?” ఆర్ధ్రత నిండిన పలకరింపుల అమృతాలే! నాన్న పడక్కుర్చీ అమ్మ గాజుల మోత వంటింట్లో తాలింపు వాసన వరండాలో బంధువుల … Continue reading

Posted in కవితలు, జీవితం, నా అనుభవాలు | 10 Comments

వలయం


వలయం ఏదో  ద్రవంలో  తేలియాడుతున్నాను చేతి వేళ్ళు కదలాడుతున్నాయి కాళ్ళ కదలికలు మొదలయ్యాయి కనురెప్పలు విడిపడుతున్నాయి కనులు మూసినా తెరిసినా, అదే చీకటి! ఏదో ప్రవాహపు హోరు ఆలకిస్తూ బొడ్డుతాడు చుట్టూ తిరిగేస్తూ నాకు మాత్రమే సరిపోయే చోట నేను మాత్రమే ఉన్నాను! అమ్మ గర్భమంట ఎంత భద్రంగా ఉందీ చోటు! అమ్మ..అమ్మ…ఎలా ఉంటుందో? గొంతు … Continue reading

Posted in కవితలు, కష్టం, కాలం, జీవితం, మనిషి, Uncategorized | 6 Comments

నిశ్శబ్దం


నిశ్శబ్దం నా చుట్టూ నిశ్శబ్దపు రాజ్యం రాణిని నేనే, దాసిని నేనే! ఆలోచనల అలల్లో తీరం చేరితే సామ్రాజ్యమంటాను! ఆశల వలలో చిక్కుకుపోతే నడిసముద్రమంటాను! నుదుటి స్వేదం గుండెలపైకి జారి నిశ్శబ్దాన్ని చిద్రం చేస్తుంది అంతే వేగంగా తటాకంలోని గులకరాయి బుడుంగున మునిగిపోతుంది…. ఏ పలకరింపో ఓ శబ్ద తరంగాన్ని అలా మోసుకొచ్చి చుట్టపుచూపులా ఇలా … Continue reading

Posted in కవితలు, జీవితం | 3 Comments

ఆ జ్ఞాపకాలు


ఆ జ్ఞాపకాలు ఊగిసలాడుతున్న ఆ జ్ఞాపకాలు ఊడిపడిపోతే ఎంత బాగుండు! రెప్పల్లో ఇరుక్కున్న ఆ నలుసు ఒకేసారి కన్నీటిలో కొట్టుకుపోతే ఎంత బాగుండు! ఎన్నిసార్లు అనుకుంటానో, ఆ క్షణాలు తిరిగి రాయగలిగితే చాలని! ఆ అనుభవాల శకలాలు అసలేం మిగలనట్టు శిధిలమయితే చాలని! తడమకపోయినా తట్టిలేపుతున్న ఆ తలపులు పాతుకుపోయిన ఆ గురుతులు వెంటాడుతూనే ఉంటాయి…

Posted in కవితలు, కష్టం, జీవితం | 7 Comments

అబ్సర్డ్ పైయింటింగ్


అబ్సర్డ్  పైయింటింగ్ మనసు పొరలలో నిక్షిప్తమైన బావాలు కుంచె కొసలకు వేళాడి వేళాడి ఏ కలనో జారిపడి అలుక్కుపోయిన రంగుల కలబోత వృత్తాల గర్భాల్లో అనంతాలు వంకరటింకర గీతల్లో భావోద్వేగాలు మోహమో, వ్యామోహమో ప్రేమమయమో, ద్వేషపూరితమో జీవమో, జీవచ్చవమో ఏమో ఏవేవో అర్థాలు అంతులేని అయోమయాలు హృదయాంతరాలలో ప్రకంపనల అలజడి లేపి లేపి ఆలోచనల అలలు … Continue reading

Posted in కవితలు, జీవితం | 2 Comments

నడి వయసు


నడి వయసు ప్రౌడత్వం పెద్దరికాన్ని ఆపాదించుకుని తెల్లవెంట్రుకై పాపిటలో మెరిసింది. పెద్దరికం గాంభీరాన్ని తెచ్చిపెట్టుకుని నుదుటి మడతల్లో అనుభవమైనది. నిజానికి జీవితం ఎప్పుడో మొదలయినా జీవించటం ఇక్కడే ఆరంభమైంది ….. ఆశయం, ఆచరణల నడుమ నలిగే ఆలోచన నిన్న రేపటిల మధ్య వారధయింది ఇక్కడే… హక్కు, బాధ్యతల మధ్య బారం తెలిసోచ్చినది ఇక్కడే… కల, నిజం నడుమ … Continue reading

Posted in కవితలు, జీవితం | 6 Comments

NRI సెలవులు


NRI సెలవులు సంవత్సరమంతా కూడబెట్టుకున్న సెలవులు చిన్న చితక నొప్పులు దగ్గు జ్వరాలు లెక్కచేయక పోగుచేసుకున్న సెలవులు మూడు నెలల ముందు నుంచే ప్లానింగ్ వీకెండ్ కలిసోచ్చేటట్టు ఫ్లైట్ సెడ్యుల్స్, కనక్టింగ్ ఫ్లైట్స్ ఆచితూచి టికెట్ బుకింగ్ తో  కోలాహలం మొదలు.. షాపింగు హడావుడితో నిండిన సూటుకేసు  హాండులగేజీలతో సర్వం సిద్ధం… ఎయిర్ పోర్టులో అమ్మ … Continue reading

Posted in కవితలు, జీవితం | 17 Comments

చక్రం


చక్రం చక్రాకార గడియారంలో అనంతంగా అవిశ్రాంతంగా ప్రయాణించే ఆ క్షణాల, నిమిషాల, గంటల ముల్లులే జీవిత చక్రాల రధసారధులు….. ముద్దులొలికే బాల్యం ఎగిరిపడే యవ్వనం విశ్రాంతి వృధ్యాప్యంలో పసితనం ఆది అదే..అంతము అదే. ఈ చక్రయాత్ర నడి మార్గంలో మరో నూతన చక్ర సృష్టి . వీడ్కోలు చెపుతూ వదిలి వెళ్ళే తరాలు లయబద్ద సృష్టి నిరంతర … Continue reading

Posted in కవితలు, కాలం, జీవితం | 4 Comments

నేస్తం…..నాడు నేడు


నేస్తం…..నాడు నేడు  నేస్తం ఎన్నాళ్ళకెన్నాళ్ళకు కాలేజి రోజులు చుట్టివద్దాం బెంచీ కబుర్లు క్లాసురూము తగువులు బ్లాకుబోర్డు గీతలు లైబ్రరీ కాలక్షేపాలు చెట్ల కింద టైంపాసులు క్లాసు బంకు సాహసాలు ఓహ్….ఆ రోజులు పరీక్షలే కష్టాలు మార్కులే జీవితం అనుకున్న ఆ రోజులలో   ఎన్నెన్ని లోకాలు చుట్టి వచ్చాం కదూ భవిష్యత్తు కలలు ఆశల మెరుపులు ఉరకలేసే వయసులో ఆశయాలు … Continue reading

Posted in కవితలు, కష్టం, కాలం, జీవితం | 4 Comments

Happy Valentine’s Day to all married couples


Happy Valentine’s Day to all married couple ఈ సహవాసం మొదలయి ఎన్నేలయిందో కదూ….. ప్రేయసి ప్రియుడి స్థాయి దాటి, భార్య భర్తల స్థానాలలో ఒదిగిపోయి  చూస్తుండగానే సంవత్సరాలు  గడిచిపోయాయి.. తొలినాటి చిలిపి చేష్టలు, ఊహల ఆకర్షణ దాటి అసలైన బంధం ఏర్పడ్డాక, I love you  అని చెప్పటమే మరిచాము కదూ..బహుశా దాని అవసరం లేదనేమో, … Continue reading

Posted in జీవితం, నా అనుభవాలు, నా ఆలోచనలు, వ్యాసాలు | 16 Comments