-
Recent Posts
- అమూల్య
- మార్పు వచ్చింది, మారాల్సింది ఇంకా ఎంతో ఉంది
- సముద్రతో సంభాషణ
- ఒక్కో చినుకు ఒక్కో ముత్యం
- ఈ దోవ పొడవునా
- ఎప్పటికప్పుడు నిన్ను
- ఎక్కడో ఉంటావ్
- మలిసంధ్య బృందావనాలు
- మా పల్లె అందాలు అనుభవాలు
- చందమామ కధలు
- నాకోసం అట్టేపెట్టేయ్యవూ
- నీ జ్ఞాపకాలే…….. నువ్వు కాదు
- సువిసైడ్
- ఆ కళ్ళలో హరివిల్లు
- స్విస్ మంచు పర్వతాల సొగసులు
- స్విస్ స్వర్గం
- పారిస్ ట్రిప్
- వింటాను
- Shopping Mall -2
- Shopping Mall -1
Archives
- November 2021
- June 2016
- October 2015
- September 2015
- July 2015
- May 2015
- April 2015
- January 2015
- November 2014
- October 2014
- August 2014
- July 2014
- June 2014
- May 2014
- April 2014
- March 2014
- February 2014
- January 2014
- December 2013
- November 2013
- October 2013
- September 2013
- June 2013
- May 2013
- April 2013
- March 2013
- February 2013
- January 2013
- December 2012
- November 2012
- October 2012
- September 2012
- August 2012
- July 2012
- June 2012
- May 2012
- April 2012
- March 2012
- February 2012
- January 2012
- December 2011
- November 2011
- October 2011
- September 2011
- August 2011
- July 2011
- June 2011
- May 2011
- April 2011
- March 2011
- February 2011
- January 2011
Categories
- అమ్మ
- ఆడవారి మాటలు
- కధలు
- కలం
- కవితలు
- కష్టం
- కాలం
- కిడ్స్ డైరీ
- గుర్తింపు
- జీవితం
- నా అనుభవాలు
- నా ఆలోచనలు
- నాన్న
- పెళ్లి
- పోస్ట్ చెయ్యని ఉత్తరాలు
- ప్రకృతి సృష్టి
- ప్రజాస్వామ్యం
- ప్రవాసీ బంధం (కధలు)
- భూతద్దంలో కనిపెట్టిన జీవిత సత్యాలు (funny)
- మనిషి
- మహిళ
- మౌనం
- వ్యాసాలు
- సగటు ఆడపిల్ల
- సమాజంలో సామాన్యులు
- సినిమాలు
- Photography
- Uncategorized
Meta
Blog Stats
- 168,852 hits
-
Join 124 other subscribers
Category Archives: కష్టం
ఎక్కడో ఉంటావ్
ఎక్కడో ఉంటావ్ ఎక్కడో ఉంటావ్ ఆకృతులలోనో, అక్షరాలలోనో గాత్రంలోనో, గానంలోనో ఎక్కడో ఉంటావ్! వర్ణాలలోనో, చిత్రాలలోనో నూలులోనో, అల్లికలోనో ఎక్కడో ఉంటావ్! అందీఅందనట్టు కలలోనో తెలిసీతెలియనట్టు కలవరపాటులోనో ఉండీలేనట్టు ఉంటావ్! ఎక్కడ నుండో ఉండుండి జ్ఞాపకమై వస్తావ్ సెలయేరులా, గురుతులన్నీ ఉండచుట్టి విసిరేసినట్టు వెళ్లిపోతావ్ జలపాతంలా. వెళ్తూ వెళ్తూ మరో ముద్రను వదిలిపోతావ్ భందించి భద్రపరుచుకోవటానికి … Continue reading
Posted in కవితలు, కష్టం, కాలం
Leave a comment
నీ జ్ఞాపకాలే…….. నువ్వు కాదు
నీ జ్ఞాపకాలే…….. నువ్వు కాదు ఏ హడావుడి, మరే సందడి లేని నిశ్శబ్దంలో గాలి సవ్వడి, ఆకుల గలగలలు లేని సందర్భంలో నెలవంక బెదురుబెదురుగా అడుగులో అడుగులేస్తూ మేఘాల చాటు కెళ్తున్న తరుణంలో, చూరు నుంచీ జారిపోబోతున్న ఘడియ అక్కడే స్థంభింభించిపోయిన సమయంలో, ఆరు బయట నేనుకాక మరెవ్వరూ లేనట్టూ చుట్టూ ఉన్న మనుష్యులూ, పరిస్థితులూ ఉన్నఫళంగా ఉన్నవన్నీ … Continue reading
Posted in కవితలు, కష్టం, కాలం
2 Comments
సువిసైడ్
సువిసైడ్ ఆ రెండు కన్నీటి చుక్కలు కనుకోనలలో వేళాడుతున్నాయి వాలే భుజం లేక….. ఆ రెండు మాటలు నాలికను చిధిమేస్తూ గొంతుకలో నొక్కివెయ్యబడుతున్నాయి వినే మనసు లేక….. ఆ విసుగు నిస్పృహై శూన్యంలోకి జారిపోతుంది ఆశకు ఆసరా లేక….. ఆ తనువు తనను తాను శిక్షించుకుంటూ మరణాన్ని ప్రేమించి నిష్క్రమించింది … Continue reading
Posted in కవితలు, కష్టం, Uncategorized
4 Comments
వింటాను
వింటాను నువ్వు ఏవేవో చెపుతూ ఉంటావు నీ మాటల ప్రవాహం సాగిన మేరా నేను నిన్ను వింటున్నాననుకుంటావు. నిజానికి నేను వినేది నీ మాటలను కాదు ఓ సంభాషణ ముగించి మరో సంఘటనకు మాటల రూపం ఇచ్చే వ్యవధిలో నువ్వు పడే యాతన ఓ సుదీర్ఘ నిశబ్దాన్ని నాకు వినిపిస్తుంది. కన్నీరు అడ్డొచ్చి వెక్కిళ్ళు మాటలను … Continue reading
Posted in కవితలు, కష్టం
7 Comments
తోడు
తోడు నువ్వూ నేనూ రెండు విరుద్ద భావాలను వ్యక్తీకరిస్తున్నాం అనుకుంటున్నాం తరచి తరచి చూస్తే వాటి మూలం ఒకటే నేస్తం! నువ్వన్నావు, కష్టాన్ని పంచుకునే తోడొకటి లేకపోవటమే పెద్ద లోటని నేనన్నాను, సంతోషాన్ని పంచుకోలేని తోడు ఒక తోడే కాదని హుటాహుటిన పెద్ద పెద్ద గ్రంధాలను మోసుకోచ్చావ్ నీ చూపుడు వేలితో ఆ నీతుల వెంట … Continue reading
Posted in కవితలు, కష్టం
2 Comments
ఆసుపత్రి
ఆసుపత్రి వెతుక్కుంటునో లేక దారి తప్పో ఈ రోజు నేనో చోటుకు వెళ్లాను. నగరంలో ఓ ములకు విసిరేయ్యబడ్డ స్థలమది. పచ్చదనాన్ని పట్టించుకోకుండా అస్తవ్య స్థంగా పెరిగిన పచ్చికను దాటుకుంటూ ఊహామాత్రపు పరిచయమన్నా లేని ఆ నాలుగు గోడల నడుమకు చేరాను. అక్కడందరూ అదో తరహా మనుష్యులంట! మతి లేని వారో? స్తిమితం తప్పినవారో? … Continue reading
ఓ మేధావుల్లరా…..Throw this mind set on dust bin
ఓ మేధావుల్లరా…..Throw this mind set on dust bin. ఛాన్స్ దొరకటం పాపం….మా భారతీయత, మా సంస్కృతీ, స్త్రీ దేవత, పూజలు, మా కుటుంబాలు, మేము అంటూ అబ్బో ఓ లెవెల్లో గొప్పలు చెపుతాము.స్ శ్ శ్స్స్స్ స్స్స్ ……మెల్లగా , ఇంక మన ముసుగులు తియ్యాల్సిన సమయం వచ్చినట్టుంది కదూ! (పర్లేదు..పర్లేదు…తెలుగు బ్లాగ్ … Continue reading
Posted in కష్టం, ప్రజాస్వామ్యం, మహిళ, వ్యాసాలు, Uncategorized
19 Comments
ఓ ఆడ కూతురా
ఓ ఆడ కూతురా ఇప్పుడేదో హడావిడి చేస్తున్నారు ఉరేయ్యాలంట! ఎవరెవరిని ఉరేద్దాం? పురాణాల దగ్గర మొదలుపెట్టి యుగ యుగాలుగా లెక్కిస్తూ పొతే ఏనాటికి తేలేను ఈ సంఖ్య? ఈ లోపు ఇంకెన్ని కౌరవ సభలో! ఎందరి పడతుల కన్నీటి ప్రళయాలను తనలో కలిపేసుకుందో ఈ కాలం. సముద్రంలో జారిపడిన మరో కన్నీటి చుక్కవు నువ్వు…అంతే! * … Continue reading
Posted in కవితలు, కష్టం, మహిళ
13 Comments
నిదుర
నిదుర అలసట కనురెప్పల మాటుకి చేరినా కనులు మూతపడవే వింతగా! నిదుర దరిచేరదే నిర్ధయగా! నడిరేయి చిక్కటి చీకట్లలోనూ అరమోడ్పు కనులలో అదే అలజడి అవే తలంపులు అవే సుడులు మడులు అవే తంత్రాలు, తరుణోపాయాలు అవే పరిధిలు, ప్రణాళికలు అవే వృత్తాలు అంతే వ్యత్యాసాలు…. అమ్ముల పొదితో ఒడిలో ఒదిగి ఆదమరిచి నిదుర పోయేదేలా? … Continue reading
Posted in కవితలు, కష్టం, జీవితం
4 Comments
ఇలాగే ఉందాం
ఇలాగే ఉందాం ఈ లోకం ఇంతే నేనూ ఇంతే మంచినే చూస్తానో, చెడునే చూస్తానో అంతా నా దృష్టిలోనే ఉందంటాను. నీదంతా అమాయకత్వం అని నవ్వేస్తారు! కాదే!…. నేనేమి చూడాలనుకుంటున్నానో నాకు తెలుసంటే పాపం మంచితనమంటారు ఈ పాపం అలంకారమెందుకో??!! ఈ లోకమూ ఇంతే, అంతు చిక్కనంటుంది! నేనూ ఇంతే, అవగతం కానిదేముంది? అంతా ప్రేమమయమే … Continue reading
Posted in కవితలు, కష్టం
3 Comments
స్థితి
స్థితి ఆనందమూ కాదు, విషాదమూ కాదు అదో స్థితి మాటలన్నీ మూటకట్టుకుని పారిపోతే ఎద మొత్తం మౌనంలో ఒదిగిపోతే ఆ నిశ్శబ్దపు ఒడిలో ఏర్పడే స్థితి…..స్తబ్దత! శూన్యత కాదు స్తబ్దత! ఈ స్తబ్దతలో శ్వాసే ప్రశ్నలను సంధిస్తుంది.. సమాధానాల అన్వేషణలో మనసును తవ్వి పొరలను చీల్చుతూ హృదయాంతరాలకు చేరాక అక్కడ ఎన్నాళ్ళుగానో నిక్షిప్తమైన మణులు వెలికి … Continue reading
Posted in కవితలు, కష్టం, జీవితం
3 Comments
ప్రశ్నల్లో ప్రశ్న
ప్రశ్నల్లో ప్రశ్న? సామాజికమో, ఆర్థికమో బరువో, బాధ్యతో కాళ్ళు కడిగి అప్పగింతలు అప్పజెప్పి చీర సారేలతో సాగనంపి ఖాలీ అయిన చోటన గుండె బరువు దింపి ఊపిరి పీల్చుకున్నారు. * * * * * * “బాగున్నావామ్మా?” నాన్న ఏనాడు అడగనే అడగరు! ధైర్యంలేకో? వినే ఓపిక మరింక లేకో? “బాగున్నానని మాత్రమే చెప్పు … Continue reading
Posted in కవితలు, కష్టం, మహిళ
9 Comments
అసంపూర్ణం
అసంపూర్ణం ఒక్కో రాత్రి, ఒక్కో పగలు ఎక్కడి నుంచీ మోసుకొస్తాయో ఇంతేసి దిగులును? నేల ఈనుతున్నట్టు, ఆకాశం చాలనట్టు పుట్టుకొచ్చే ఈ ఆలోచనలు! కడవల కొద్దీ తోడినా ఊట బావిలా ఊరుతూండే ఈ జ్ఞాపకాలు! నల్ల మబ్బుల నీటి భారం వానై వరదై ముంచెత్తితే మటుమాయం…ఎంతదృష్టం! కనురెప్పల కన్నీటి భారం చినుకై కురిసి కురిసి కడలిలోనే … Continue reading
Posted in కవితలు, కష్టం, జీవితం
3 Comments
పై పై బతుకు…
పై పై బతుకు… ఇప్పుడంతా పై పై బతికేయ్యటం అలవాటు చేసేసుకున్నాం ఏ క్షణానన్నా పొరపాటున అంతరాలలోకి జారిపడితే ఆత్మవిమర్శలు చుట్టుముడితే అస్తిత్వం ప్రశ్నిస్తే మిగిలేదంతా అంధకారమే! ఇప్పుడంతా పై పై బతుకులకు సౌఖర్యాల మేకప్పులే మస్కారా కరిగితే, ఐలైనర్ చెదిరితే కాంతి క్షిణించిన కళ్ళలో జీవాన్ని భూతద్దంలో వెతుక్కోవాల్సిందే! లిప్ గ్లాస్ అద్దిన నవ్వులు … Continue reading
Posted in కవితలు, కష్టం, జీవితం
3 Comments
వలయం
వలయం ఏదో ద్రవంలో తేలియాడుతున్నాను చేతి వేళ్ళు కదలాడుతున్నాయి కాళ్ళ కదలికలు మొదలయ్యాయి కనురెప్పలు విడిపడుతున్నాయి కనులు మూసినా తెరిసినా, అదే చీకటి! ఏదో ప్రవాహపు హోరు ఆలకిస్తూ బొడ్డుతాడు చుట్టూ తిరిగేస్తూ నాకు మాత్రమే సరిపోయే చోట నేను మాత్రమే ఉన్నాను! అమ్మ గర్భమంట ఎంత భద్రంగా ఉందీ చోటు! అమ్మ..అమ్మ…ఎలా ఉంటుందో? గొంతు … Continue reading
Posted in కవితలు, కష్టం, కాలం, జీవితం, మనిషి, Uncategorized
6 Comments
ఆ జ్ఞాపకాలు
ఆ జ్ఞాపకాలు ఊగిసలాడుతున్న ఆ జ్ఞాపకాలు ఊడిపడిపోతే ఎంత బాగుండు! రెప్పల్లో ఇరుక్కున్న ఆ నలుసు ఒకేసారి కన్నీటిలో కొట్టుకుపోతే ఎంత బాగుండు! ఎన్నిసార్లు అనుకుంటానో, ఆ క్షణాలు తిరిగి రాయగలిగితే చాలని! ఆ అనుభవాల శకలాలు అసలేం మిగలనట్టు శిధిలమయితే చాలని! తడమకపోయినా తట్టిలేపుతున్న ఆ తలపులు పాతుకుపోయిన ఆ గురుతులు వెంటాడుతూనే ఉంటాయి…
Posted in కవితలు, కష్టం, జీవితం
7 Comments
ఓ విజయం
ఓ విజయం ఓ విజయం రారమ్మని ముద్దు ముద్దుగా పిలిచింది. ఎగురుకుంటూ హుషారుగా పరుగెత్తాను. నన్నే చూస్తూ కవ్విస్తూ వెనువెనుకకు అడుగులు వేసింది….. బుంగమూతి పెట్టి దొంగ చూపులు చూస్తూ నేనూ అడుగులు వేసాను నవ్వుకుంటూ. అందలేదు..దోబూచులాడుతుంది… ఇక..ఉక్రోషం తన్నుకొస్తుంది వేగం పెంచాను అయినా అందదే దుఖం పొంగుకొచ్చింది పరుగాపలేదు.. ఓపిక తగ్గుతుంది నీరసం వస్తుంది … Continue reading
Posted in కవితలు, కష్టం
4 Comments
ఎవరు?
ఎవరు? హృదయాంతరాలలో శూన్యతను పదే పదే గుర్తుచేస్తున్నదెవరు? కనురెప్పల మాటున కన్నీటిని ఫ్రీజ్ చేయ్యమంటున్నదెవరు? చిరునవ్వును పెదవులపై అతికించమంటున్నదెవరు? ఉలిక్కిపాటు భద్రతను ఊహల్లో కల్పిస్తున్నదెవరు? ఇంటిపక్కన ఇల్లెవరిదో తెలియని కమ్యూనిటీలు నిర్మిస్తున్నదెవరు? బానిసత్వాన్ని బోధిస్తున్న విధ్యా విధానాలకు రచిస్తున్నదెవరు? స్త్రీత్వానికి సుకుమారాన్ని అంటగడుతున్నదెవరు? పురుషత్వానికి కఠినత్వం కొలబద్దచేస్తున్నదెవరు? వేళ్ళసందుల్లో నుంచి జారిపోతున్న స్వేచ్ఛను గుప్పిట్లో నింపుతున్నదెవరు? కిటికీలు మూసేసిన గది గోడలకానుకుని ఆలోచిస్తున్న మేధావులెవరు? నగ్నత్వాన్ని చూడలేక కళ్ళు ముసుకుంటున్నదెవరు? ఎవరు? ఎవరు?…..సమాధానాల కొరకు మరికరిని వెతకాలా?
Posted in కవితలు, కష్టం, మనిషి, సమాజంలో సామాన్యులు
4 Comments
మనసు
మనసు నిజానికి మనసెప్పుడూ గాజుపలకే పగులుతూనే ఉంటుంది ముక్కలు ముక్కలవుతూనే ఉంటాయి… కానీ ఒక పారదర్శకమైన పొర మనసును చుట్టి ఉంచుతుంది. ముక్కలు చెదిరినా నేలరాలకుండా ఆ పొరలోనే ఉండిపోతాయి… అందుకే కాబోలు ముక్కలయినా..మనసు మనదే.
Posted in కవితలు, కష్టం
6 Comments
నాలోని నా గుహ
నాలోని నా గుహ నాకు నేనుగా నా ఒడిలో నేను పాపగా నా బడిలో నేను విద్యార్ధిగా నాలో నేనుగా ఒదిగిపోయే నా స్థానం అంతర్మధన సముద్రాన్నిఅంతరంగంలో ఇముడ్చుకున్న నా స్థలం నాలోని నా గుహ…..నా అంతర్గుహ… అటు ఇటు వీలుచూసుకుని హటాత్తుగా తనలోకి లాగేసుకుంటుంది ఆలోచనల ప్రవాహంలో కొట్టుకుపోయినట్టు సంఘర్షణల కొలిమిలో కాలిపోతునట్టు గతమంతా ఓ … Continue reading
Posted in కవితలు, కష్టం
8 Comments