సముద్రంతో సంభాషణ
సముద్రపు ఒడ్డున ఒద్దికగా చేతులు కట్టుకుని నుంచుని ఉన్నాను. “కవిత్వం పొంగుకు వస్తుందా,” వెనుకనుంచీ వస్తూ అంది స్నేహితురాలు. ఒక మాటకు మరోమాటను జతచేసి వాగే నేను ఆ నిమిషాన మౌనంగా ఉండిపోయాను, మొహమాటంగా నవ్వి ఊరుకున్నాను. కవిత్వం కాదుకదా కనీసం ఒక్క భావం కూడా మనసులో నుంచీ తన్నుకురాలేదు, ఒక్క పదం కూడా గొంతుకలో కొట్టుకలాడలేదు. ఒకాలాంటి నిశ్శబ్దం నన్ను ఆవరించుకుంది.
ఒక్కో అల ఒక్కో లయ, ఆ అలల లయలలో కొట్టుకుపోతున్నానో……
ఏ సుదూర తీరంలో ఇరుక్కుపోయానో…తెలీదు!
సముద్ర ఘోష చెవుల్లో ప్రతిధ్వనిస్తోంది. మెల్లమెల్లగా లోలోపలి సెగల సముద్రాలు అలలుగా విచ్చుకుని ఎగిసెగిసి పడటం మొదలుపెట్టాయి. నిశ్శబ్దంలో ఎదుగుతున్నానో, ఒదుగుతున్ననో తెలీని సందిగ్దత!
ఇరుకిరుకు సంధుల్లో నుంచీ, గాలి ఆడని మనసుల నడుమ నుంచీ తప్పించుకుని పరిగెత్తుకుంటూ వచ్చి ఈ సముద్రం ముందు నుంచున్నట్టుంది.
ఎంత విశాలత్వం….నా రెండు చేతులూ సాగినంత మేరా జాపినా ఇంకా ఇంకా మిగిలుండే వైశాల్యం. నేనెంత ఆహ్వానించి ఆస్వాదించినా ఇంకా నా వాకిలిలో తచ్చాడుతూ ఉండే విశాలత్వం.
మనుష్యులకే ఇంత సంకుచిత్వం! ఎవరికి వారే పట్టనంత ఇరుకిరుకు పంజరాలలో కుక్కేస్తున్నారు మనసులను, జీవితాలను. ఆ పంజరపు గోడల్లో నుంచే తీర్పులు! ఈ సముద్రం నుంచీ కాస్తన్నా నేర్చుకోగలిగితేనా…..
ఎన్నింటినో తనలో కలుపుకోగలిగే మహాసంద్రం ముందు ఒద్దికగా ముడుచుకును కూర్చుని తదేకంగా తననే చూస్తూ ఎన్ని గంటలైనా నిశ్శబ్దంగా గడిపెయ్యొచ్చు కదూ! ఒక్కోసారి అనంతానంత ఆకాశం కిందే దగ్గరతనం అనుభవమవుతుంది.
సంద్రాన్ని మాత్రమే కాదు సుమా! ఆ ఒడ్డున కేరింతలు కొడుతున్న పిల్లలు, సేద తీరుతున్న పెద్దలను చూడటం ఎంత బాగుందో చూడు.
అలలతో ఆడుకుంటున్న ఈ చిన్నోడు ఇలా నా కెమేరాకు చిక్కాడు.
ఓ పక్కగా కూర్చుని, కెమెరా కంటితో పరిసరాలను విక్షించటంలో కవిత్వం ఉంటుంది. It has it’s own immense feel. కవిత్వం, కెమెరా అంటే ఓ మాట చెప్పాలనిపిస్తుంది, We may come across people who makes fun of these hobbies/interests, leave them to their sillyside.
సముద్రమూ, సాయం సంధ్య కలిపి వేసిన చిత్రాలు
సముద్రంతో మౌనంగా సంభాషిస్తే ఎడతెరిపి లేకుండా సాగుతూ ఉంటుంది సంభాషణ. అందుకే ఒడ్డున నిశ్శబ్దంగా ఉండాలి…..
ఎప్పటిలానే సూపర్ ఫొటోలకి జతగా చక్కని మాటలు ఏంటో అందాన్నిచ్చాయి గ్రేట్ ! 🙂
థాంక్స్ రాధిక
Thank you very much.
థాంక్స్ హరి ప్రసాద్ గారు
your comments added more beauty to those magnificent pictures.