సువిసైడ్


సువిసైడ్ 

 

ఆ రెండు కన్నీటి చుక్కలు

కనుకోనలలో వేళాడుతున్నాయి

వాలే భుజం లేక…..

 

ఆ రెండు మాటలు

నాలికను చిధిమేస్తూ

గొంతుకలో నొక్కివెయ్యబడుతున్నాయి

వినే మనసు లేక…..

 

ఆ విసుగు నిస్పృహై

శూన్యంలోకి జారిపోతుంది

ఆశకు ఆసరా లేక…..

 

ఆ తనువు తనను తాను శిక్షించుకుంటూ

మరణాన్ని ప్రేమించి నిష్క్రమించింది

హత్యో ఆత్మహత్యో ముద్దాయిలెవరో

తేల్చుకోలేని ప్రశ్నలను

మనకు వదిలేస్తూ…..

 

మనం

ఆ మనసులను

ఆ ఆ  అంతరంగపు లోతులను తడమగలిగి

వారి ఆత్మలను ముద్దాడిఉంటే

ఒక మాట, ఒక చేయూత, ఒక ఆసరా, ఒక సహానుభూతి, ఒక ఆశ….ఇచ్చివుంటే

ఎన్ని కొత్త చిగురులు తొడిగేవో కదూ ఆ జీవితాలు.

చిదిమేసుకున్న ప్రతీ జీవితం మనల్ని వెంటాడుతూనే ఉంటుంది…

This entry was posted in కవితలు, కష్టం, Uncategorized. Bookmark the permalink.

4 Responses to సువిసైడ్

  1. padmarpita says:

    బాగుంది కవిత

  2. ఎదో తెలియని ఆవేదన తన స్వరాన్ని సుస్స్తిరం చేసుకొనే ప్రయత్నంలో చెలరేగిన అలజడి . బాగుంది .ధన్యవాదములు

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s