వింటాను
నువ్వు ఏవేవో చెపుతూ ఉంటావు
నీ మాటల ప్రవాహం సాగిన మేరా
నేను నిన్ను వింటున్నాననుకుంటావు.
నిజానికి నేను వినేది నీ మాటలను కాదు
ఓ సంభాషణ ముగించి
మరో సంఘటనకు మాటల రూపం ఇచ్చే వ్యవధిలో
నువ్వు పడే యాతన
ఓ సుదీర్ఘ నిశబ్దాన్ని నాకు వినిపిస్తుంది.
కన్నీరు అడ్డొచ్చి
వెక్కిళ్ళు మాటలను మింగేసిన క్షణంలో
నీ మౌనాన్ని వింటాను.
నీలో నువ్వు పడుతున్న సంఘర్షణను
వ్యక్తపరచలేని నీ మాటల లేమి నాకు వినిపిస్తుంది.
పదాల కోసం వెతుక్కునే నీ నిస్సహాయతను వింటాను
అక్షరాలలో ఒదగలేని నీ భావాలను నా కళ్ళతో చూస్తాను
మాట్లాడుతూ మాట్లాడుతూ
నువ్వు హటాత్తుగా ఆగిపోతావే
అప్పుడు
నీ నిట్టూర్పులు నా చెవులలో విస్పోటకాలవుతాయి….
Amazing words….
ఆవేదన అర్ధవంతముగా ఉంది. చదివేవాళ్ళకు ఆవేదన కలిగేలా.
deep!
Thank you all 🙂
చాలా బాగుంది
క్లుప్తంగా అమ్మ మనసు అని అర్ధమవుతోంది .ధన్యవాదములు
చాలా చాలా బాగుంది