గాలి బుడగ
తనలో తాను నిండుగా గాలిని నింపుకున్న బుడగ
హటాత్తుగా మన మధ్యలోనికి వచ్చిపడుతుంది.
అనివార్యంగానో, అయోమయంగానో
అత్యుత్సాహంగానో, ఆశతోనో
నెత్తిన పెట్టుకుని
ఊపిరితిత్తులు నొప్పెట్టేలా
ఊపిరిని ఊది ఊది ఊరంత చేస్తాం.
అక్కడో ఇక్కడో
అది గాలిబుడగన్న వారి నెత్తిన గట్టిగా మొట్టుతాం.
మేడలు కట్టే హడావుడిలో
గాలి సంగతి ఆలోచించనే ఆలోచించం.
అంతే హటాత్తుగా
బుడగ భళ్ళున బద్దలవుతుంది.
బెంబేలెత్తిపోతాం
మోసపోయామని ఏడుస్తాం
గగ్గోలుపెడతాం
……
……………
మనం వెర్రిబాగులోళ్లమని…..మెల్లమెల్లగా మర్చిపోతాం
మళ్ళీ మరో గాలి బుడగ మీద ఆశతో బయలు దేరతాం! కదూ
ముమ్మాటికీ అంతే సుజాత గారు. థాంక్స్