కిడ్స్ డైరీ -పార్ట్2
దేవుడు కనిపించలేదే?
మా అల్లరి పిడుగులిద్దరు లిటిల్ కృష్ణ స్టొరీ బుక్ చదువుతుంటే శ్రద్దగా వింటున్నారు.
అందులో మేఘాల మధ్య ఇంద్రుడి బొమ్మ ఉంది.
“అమ్మ, గాడ్ sky లో ఉంటాడు కదా? ”
“hmmm……అనుకుంట”
“మరి….మరి…మనం ఫ్లైట్ లో వెళ్తున్నప్పుడు ఎందుకు కనిపించలేదు?”
అయ్యో..భగవంతుడా
కెమెరాను ఎంత జాగ్రత్తగా ఎక్కడ దాసినా, మా బుడంకాయలు ఇట్టే కనిపెట్టేసి..అదేదో toyలాగా ఆడేసుకుంటున్నారు.
టైం అవుట్ లు, విపు విమానం మోతలు workout అవ్వవు అని, ఇద్దరికీ చెరొక బొమ్మ కెమెరాలు కొనిచ్చాము.
ఏదన్న కొత్త బొమ్మ వచ్చాక రెండు మూడు రోజులు అదే లోకంలో ఉంటారు కదా.
అలా ఆ వీరులిద్దరు ఆ బొమ్మ లోకంలో ఉన్న ఒకనాడు ….నేలపై స్టీల్ బటన్ shapeలో ఉన్న ఒక వస్తువు కనిపించింది.
అదేమిటబ్బా అని మేమిద్దరం రెండు నిముషాలు ఆలోచించుకుని, “ఆ..ఏమై ఉంటుందిలే…toy కెమెరా shutter బటన్ అయివుంటుందిలే,” అని డిసైడ్ అయిపోయాం. ఇప్పుడు వాడికి చెప్పి లేనిపోని గొడవ, పేచి తెచ్చుకోవటం ఎందుకు అని పడేసాం.
..
..
..
..
…….
కొన్ని రోజుల ఆ తర్వాత…..ఫోటో తీద్దామని కామెర బయటకు తీసినప్పుడు జ్ఞానోదయమయినది….పడేసినది toy కెమెరా shutter బటన్ కాదు అని… GODDDDDD….
కిడ్డి బ్యాంకు తాళం ఎక్కడ మాయం?
కిడ్స్ కిడ్డి బ్యాంకు coins తో నిండిపోయింది. ఓపెన్ చేసి పిల్లలతో coins లెక్కపెట్టిద్దామని చుస్తే తాళం ఎక్కడా కనిపించదే!
ఇల్లంతా వెతికి, కెలికిన నువ్వే ఎక్కడో పెట్టుంటావ్,నేను కాదు నువ్వే ఎక్కడ పెట్టావో మర్చిపోయావ్ లాంటి వాదులాటలు అయ్యాక …..
“ఆ small key ని మేమే కిడ్డి డబ్బాలో వేసేశాంగా,” తీరిగ్గా చెప్పారు మా బుడంకాయలిద్దరూ.
మట్టి ముంతల్లాంటివి కొనాల్సింది, వీళ్ళ సంగతి తెలిసిందే కదా!
హాట్స్ అఫ్ టు టీచర్స్
“Pencil Sharpeners are banned in the school ”
ఎందుకంటేనంట….ఈ బుడంకాయలు, ఫస్ట్ period నుంచి లాస్ట్ పిరియడ్ వరకు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు, డస్ట్ బిన్ దగ్గర నుంచుని పెన్సిల్స్ చెక్కేస్తున్నరంట….very funny 🙂
hats off to those teachers who handle kinder garden and primary kids.
రాకెట్
పేపర్ తో రాకెట్స్ చేసుకుని ఆడుకుంటున్నారు.
“హమ్మ, కొట్టుకోకుండా ఆడుకుంటున్నారు,” అనుకునేలోపే
బుడంకాయి నంబర్ 1 రాకెట్ స్పీడ్ లో పరిగెత్తుకెళ్ళి దేవుడి దగ్గర ఉన్న అగ్గిపెట్టె తీసుకొచ్చాడు.
వీళ్ళ వీరంగం ఎరిగిన వాళ్ళము కదా…అంతే స్పీడ్ లో అగ్గిపెట్టి లాగేసుకుని, “ఎందుకురా నీకు మ్యాచ్ బాక్స్?”, అని అడిగితే….
“రాకెట్ కి ఫైర్ పెడతాము, అప్పుడు స్పీడ్ గా వెళ్తుంది” అని సెలవిచ్చాడు.
Boysssss……The dangerous!!!
భలే భలే
Finish your home work….otherwise cartoon cut!
Eat food…..if not no play!
Stop fighting….remember time out!
చెప్పిన మాట విను…వినకపోయావో నీ rights cut!
..
…
..
son says,
Dad I want this n this n this……
If you don’t give me, I will cut your “న్యూస్”!
భలే..భలే….
సంగీతం
ఇంట్లో అల్లరి కాస్తన్నా తప్పుతుందని కర్నాటక సంగీతం క్లాసులో జాయిన్ చేసాం.
మొదటి రోజు:
ఈ రోజు టీచర్ ఏం చెప్పారు?
సరిగమ చెప్పారు.
వేరి గుడ్…
రెండో రోజు:
మళ్లీ సరిగమే చెప్పారు
మూడో రోజు :
నిన్న ఏమి చెప్పారో ఈ రోజు కూడా అదే చెప్పారు
నెక్స్ట్ డే:
అమ్మ రోజు రోజూ ఎందుకు అడుగుతావ్? సంగీతం అంటే సరిగమే చెపుతారు!
oho….
వినాయకచవితి అనుమానాలు
పిల్లల పుస్తకాలకు పసుము కుంకుమ రాసి వినాయక పూజలో పెడుతుంటే పిడుగు నెంబర్ 1 అంటాడు, ” నా నోట్ బుక్స్ అన్ని తెలుగు బుక్స్ అయిపోతాయా? మరి మా టీచర్ కి తెలుగు రాదుగా?”…….
పూజా పుస్తకంలో చూస్తూ వాళ్ళ నాన్న అనర్గళంగా మంత్రాలు చదువుతుంటే, “dad dad stop it.. What are you reading? అంటే ఏంటో చెప్పు?”…..
కుదురుగా కూర్చోమని ఎన్ని సార్లు చెప్పినా వినకుండా, అగరబత్తి పొగతో ఆడేసుకుంటూ చెయ్యి చురుక్కుమన్నాక ఒక రాగం తీసి, అప్పుడు కుదురుగా కూర్చున్నాడు పిడుగు నెంబర్ 2 …..
కధ అని నేను చదవటం మొదలు పెట్టాను…. అనగనగా అని చెప్పకుండా ఏంటేంటో చదువుతావేంటమ్మ? ఇద్దరూ అయోమయంగా మొహం పెట్టారు.
మొత్తానికి కధ చదవటం అయింది అనిపించించి వాళ్లకు అర్థం అయ్యేదట్టు చెప్పాం……
దీపావళి బెదిరింపు
దీపావళి…. పిల్లల బడికి సెలవ్. ఇంట్లో ప్రాణం తీసేస్తున్నారు.
“అల్లరి ఆపకపోతే పోలీసుకు ఫోన్ చేస్తా ,” బెదిరించా.
“పొలిసు నా ఫ్రెండ్, “ఒక్క క్షణం ఆలోచించి చెప్పాడు.
వార్ని…..నేనే కహానీలు చెపుతున్నానంటే, వీడు నాకే ఎదురు కధలు
వినిపిస్తున్నాడే!! నేను ఇంకో క్షణం ఆలోచించా…
“సరే అయితే, నువ్విలాగే అల్లరి చెయ్యి, సాయంత్రం టపాకాయలు కట్”……హిహాహా, అలా రా దారికి.
అబ్బబ్బ..ఇంత బండతనం ఏమిటో!
కర్ణుడి కవచకుండలాల టైపులో ఈ మగపిల్లల మోకాళ్ళు, మోచేతులకు Permanent shields ఉంటే బాగుండు..
ఎందుకనగా, మాకున్న నాలుగు చిన్ని మోకాళ్ళు, మోచేతులలో కనీసం ఒక మోచేతికో, మొకాలికో సర్వవేళల సర్వావస్థలందునా చిన్నదో పెద్దదో దెబ్బ ఉంటూనే ఉంటుంది.
కృష్ణా ముకుందా
Kids are learning healthy food versus junk food at school. I picked butter during weekly grocery shopping
“Is butter healthy food or junk food”, asked my boy.
“You can eat butter in limited quantity. It’s a fatty food”, I replied
“ohhh….Then why Krishna is eating lots of butter?”, His quick question.
Ufff, I struggled to answer. As usual he is not convinced!
స్పెల్లింగ్స్
ఒకానొక హోం వర్క్ ఎపిసోడ్ లో daughter స్పెల్లింగ్ నేర్పిస్తున్నాను.
“నేను think చేసాను datar కరెక్ట్ స్పెల్లింగ్. ugh ఎందుకు రాయాలి?”, అంటూ మా పిడుగు వాదన. Indian accent, phonics sounds మ్యాచ్ కుదరక వాడిని convince చెయ్యలేక విసుక్కున్నాను.
మరో రోజు, నేను రాసుకున్న కధ పేపర్లు ఎలా దొరికాయో వాడి చేతిలో పడ్డాయి. పేపర్ నిండా పెన్సిల్ తో రైట్లు, రాంగ్లు దిద్దేసి మార్కులు కూడా వేసేసాడు. ఆ పేపర్లు పట్టుకును నా దగ్గరకు వచ్చి, “ఎన్ని సార్లు తెలుగు నేర్పించాను? అయినా అన్నీ తప్పులే “, అంటూ నాకో చిన్న సైజు క్లాసు పీకాడు… Tit for tat!
………….. ఇంకో పోస్ట్ లో ఇంకొన్ని
చాల బాగుంది.
ప్రవీణగారూ, నమస్తే. మీ ‘పల్లెటూరులో ఓ రోజు’ పోస్ట్‌లోని పసుపుపచ్చ పువ్వు ఫోటో చాలా బాగుందండి. ఆ ఇమేజ్‌ను నా డెస్క్‌టాప్ backgroundగా పెట్టుకోవాలనుంది…మీరు పర్మిషన్ ఇస్తే.
తేజస్వి
తేజస్వి గారు @ తప్పకుండా మీ డెస్క్ టాప్ పై పెట్టేసుకోండి. Iam glad u liked it. Thank you 🙂
Thank you.